Mahindra XEV 9e, BE 6 Discounts Offers: మహీంద్రా కంపెనీ, తన రెండు బోర్న్‌ ఎలక్ట్రిక్‌ SUVలైన XEV 9e & BE 6 మోడళ్లకు భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు డిసెంబర్ 20 వరకు లేదా మొదటి 5,000 బుకింగ్స్‌ వరకు మాత్రమే వర్తించనున్నాయి. అంటే, త్వరగా బుక్‌ చేసుకునే వారికి మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఎక్కువ. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఈ బెనిఫిట్స్‌ను డీలర్లు అందిస్తున్నారు.

7.2 kW AC ఫాస్ట్‌ ఛార్జర్‌ ఫ్రీ!
ఈ ఆఫర్లలో ముఖ్యమైనది - ప్రతి కస్టమర్‌కు 7.2 kW AC ఫాస్ట్‌ ఛార్జర్‌ పూర్తిగా ఉచితం. దీని మార్కెట్‌ విలువ దాదాపు రూ.50,000. హోమ్ ఛార్జింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది భారీ సేవింగ్‌. అలాగే, మహీంద్రా డీలర్లు రూ.30,000 విలువ చేసే ఆక్సెసరీస్‌, రూ.25,000 వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌, రూ.30,000 వరకు ఎక్స్చేంజ్ / లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 విలువ చేసే పబ్లిక్‌ ఛార్జింగ్‌ క్రెడిట్స్‌ ఇస్తున్నారు. మొత్తం కలిపితే ఆఫర్లు రూ.1.55 లక్షల వరకు చేరుతున్నాయి.

BE 6, XEV 9e - వేరియంట్‌ వారీ ధరలు

BE 6 మోడల్‌ ధరలు రూ.18.9 లక్షలు నుంచి ప్రారంభమై రూ.26.9 లక్షల వరకు ఉన్నాయి.

XEV 9e ధరలు రూ.21.9 లక్షలు నుంచి రూ.30.5 లక్షల వరకు ఉంటాయి.

బ్యాటరీ ఆప్షన్‌లు

రెండు SUVలు కూడా 59 kWh & 79 kWh బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్‌లతో వచ్చాయి.

BE 6 59kWh వేరియంట్ - 556 km ARAI రేంజ్

BE 6 79kWh వేరియంట్ - 682 km రేంజ్

XEV 9e 59kWh - 542 km రేంజ్

XEV 9e 79kWh - 656 km రేంజ్

XEV 9e కొంచెం వెయిట్‌ ఎక్కువగా ఉండటంతో రేంజ్‌లో స్వల్ప తేడా ఉంటుంది.

మహీంద్రా, ఈ కార్ల కోసం 11.2kW AC ఛార్జర్‌ ఆప్షన్‌ కూడా అందిస్తోంది. దీని ధర రూ.75,000 అదనం.

EV మార్కెట్‌లో BE 6, XEV 9e పోటీ కార్లు
మహీంద్రా BE 6 నేరుగా Hyundai Creta Electric తో పోటీ పడుతుంది. XEV 9e మాత్రం Tata Harrier EV ని టార్గెట్‌ చేస్తోంది. SUV స్టైల్లో రగ్డ్‌గా, కుటుంబ వినియోగానికి సరిపోయేలా, ప్రీమియం ఫీచర్లతో ఈ రెండు మహీంద్రా కార్లను డిజైన్‌ చేశారు.

తెలుగు యువతకు, కుటుంబాలకు EVలు ఇప్పుడు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా పన్నులు తగ్గడం, ఛార్జింగ్‌ స్టేషన్లు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల EV మార్కెట్‌ వృద్ధి పెరుగుతోంది.

ఎవరికి ఎక్కువ ఉపయోగం?

కొత్తగా EV కొనాలనుకునే వారికి ఇది బెస్ట్‌ టైమింగ్‌

ఎక్స్చేంజ్ ఆఫర్‌ ఉన్నందున పాత కారును ఇచ్చి కొత్త EV తీసుకోవచ్చు

హోమ్ ఛార్జింగ్‌ సెటప్‌ కావాలనుకునే వారికి ఫ్రీ ఛార్జర్‌ పెద్ద ప్లస్‌

కార్పొరేట్‌ ఆఫర్లు ఉండడంతో ఉద్యోగులు మరింత సేవ్‌ చేసుకోవచ్చు

2025 డిసెంబర్ 20 వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, తిరుపతి, వరంగల్ వంటి నగరాల్లో డీలర్‌షిప్‌లు భారీ రద్దీని ఎదుర్కొంటున్నాయి. మహీంద్రా EV SUV కొనాలని ప్లాన్‌ చేస్తున్నట్లయితే, ఇదే సరైన టైమ్‌ అనచ్చు. బెనిఫిట్స్‌ మొత్తం రూ.1.55 లక్షల వరకూ ఉండటంతో బడ్జెట్‌ పరంగా కూడా ఇది మంచి డీల్‌గానే కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.