సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ఆయన భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా ఒకరు. ఈ జంట తాజాగా 20వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా వీరిద్దరి అందమైన ప్రేమ కథతో పాటు, మహేష్ బాబు - నమ్రత మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంత అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

మహేష్ బాబు కంటే నమ్రతా పెద్దది
సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, బాలనటుడిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 'రాజకుమారుడు' సినిమాతో ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. మరోవైపు 1993లో మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ ను గెలుచుకున్న నమ్రత, ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 1998లో 'జబ్ ప్యార్ కిసీ సే హోతా హై' అనే సినిమాతో ఆమె చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది. అదే టైంలో మహేష్ బాబు 'మురారి' వంటి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలిసి 1999లో 'వంశీ' అనే సినిమాలో చేశారు.

ఈ మూవీ టైంలోనే మహేష్ - నమ్రత మొట్టమొదటిసారి పరిచయమయ్యారు. మొదటి చూపులోనే ఈ జంట ప్రేమలో పడ్డారు. అయితే తమ రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచి, స్వయంగా తమ తల్లిదండ్రులకు వారే చెప్పేదాకా ఎవ్వరికి ఈ విషయం గురించి తెలియనివ్వలేదు. మహేష్ బాబు 2004లో తన తల్లిదండ్రులకు నమ్రతతో ప్రేమ విషయాన్ని వెల్లడించారు. ఇక ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఈ జంట సింపుల్ గా వివాహం చేసుకున్నారు. 2005 ఫిబ్రవరి 10న ముంబైలోని జేడబ్ల్యు మారియట్ లో ఈ జంట వివాహం జరిగింది.

Also Read: జాబిలమ్మా.. నీకు అంత కోపమెందుకు? - జాలీగా రండి.. జాలీగా వెళ్లండి, హుషారుగా ధనుష్ కొత్త మూవీ ట్రైలర్ చూసేయండి!

ఆ సమయంలో మహేష్ బాబు 'అతడు' సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మహేష్ బాబు నమ్రతా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. నమ్రత 1972 జనవరి 22న పుట్టింది. మహేష్ బాబు కంటే నమ్రత దాదాపు మూడేళ్లు పెద్దది. 1975 ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టాడు. మహేష్ బాబు, నమ్రతా మధ్య ఉన్న ఈ ఏజ్ గ్యాప్ వారి ప్రేమకు మాత్రం అడ్డు రాలేదు.

మహేష్ బాబు స్పెషల్ విషెస్
ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నట్టే మహేష్ బాబు, నమ్రత జీవితంలోనూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. 2006లో గౌతమ్ పుట్టిన తర్వాత మహేష్ కెరీర్లో బ్రేక్ తీసుకున్నారు. అదే టైమ్ లో నమ్రత తన తల్లిదండ్రులను కోల్పోయింది. ఇక 2012లో మహేష్ బాబు - నమ్రతలకు సితార జన్మించింది. తాజాగా తమ 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ లో నమ్రతకు స్పెషల్ గా విషెస్ తెలిపారు. "నువ్వు, నేను, 20 అందమైన సంవత్సరాలు... ఎప్పటికీ నీతోనే నమ్రతా శిరోద్కర్" అంటూ ఓ స్పెషల్ పిక్ ను షేర్ చేసుకున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు 'ఎస్ఎస్ఎంబి 29' మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్