Sumanth's Mahendragiri Varahi Release Date Locked : వైవిధ్యమైన కథలతో, డిఫరెంట్ రోల్స్‌తో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో సుమంత్. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అంతే రేంజ్‌లో మూవీస్ చేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాబోతోన్న మూవీ 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi). ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

రిలీజ్ ఎప్పుడంటే?

భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మూవీ కోసం దాదాపు రెండున్నరేళ్లు చర్చలు జరిగినట్లు తెలిపారు సుమంత్. మధ్యలో ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడిందని... సినిమాలో ఆద్యంతం ట్విస్టులు అలరిస్తాయని చెప్పారు. ఓ స్టార్ హీరో 20 నిమిషాలు కనిపిస్తారని అన్నారు.

రూ.10 కోట్ల బడ్జెట్

'డైరెక్టర్‌కు సంతోష్‌కు ఆధాత్మికత, చరిత్ర గురించి చాలా విషయాలు తెలుసు. తొలుత అనుకున్న కథలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమా రూపొందించాం. ఇందులో నటించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఫస్ట్ బడ్జెట్ రూ.10 కోట్లు అనుకున్నా ఆ తర్వాత కొంచెం పెరిగింది. VFX, గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.

కొన్ని సన్నివేశాల టైంలో థియేటర్లలో గూస్ బంప్స్ తప్పకుండా వస్తాయి. ఇందులో ఓ కీలకపాత్ర కోసం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ను సంప్రదించాం. కథ విని నచ్చి వెంటనే ఓకే చేశారు. మరి ఆమె వారాహి అమ్మవారిగా నటించారా? లేదా వేరే ఏదైనా రోల్ చేశారా? అనేది వెండితెరపై చూడాల్సిందే.' అని అన్నారు.

Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?