Mahabubabad Railway Station | మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంతో దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధి చూస్తే ఇది రైల్వేస్టేషనా, లేక విమానాశ్రయమా అనే తరహాలో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అందుకోసం కొన్ని రోజులపాటు రైల్వేస్టేషన్లకు కొన్ని రైళ్లను దారిమళ్లించడం లాంటివి చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్, బేగంపేట, కరీంనగర్, మహబూబాబ్ రైల్వే స్టేషన్లను అమృత్‌భారత్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

త్వరలోనే మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి రానుంది. రూ.26.49 కోట్ల వ్యయంతో చేపట్టిన మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభించనున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, వెయిటింగ్‌హాల్‌ పనులు, కవర్ ఓవర్ ప్లాట్‌ఫాం పనులు పూర్తయ్యాయని తెలిపారు.

ఓవరాల్ గా చూస్తే 92 శాతం మేర పని పూర్తయిందని, అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమవుతోందన్నారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ ఫొటోల్ని కిషన్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తగిన నిధులు అందించి రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.