Maha Shivaratri Upavasam 2025 : మహా శివరాత్రి సమయంలో ప్రధానంగా చేసేవి రెండే రెండు. ఒకటి ఉపవాసం, రెండు జాగరణ. ఈరోజున శివుని భక్తులు ఉదయం నుంచి ఉపవాసం చేసి.. రాత్రంతా జాగరం చేస్తారు. మీరు కూడా ఈ 2025లో మహా శివరాత్రి రోజు అంటే 26వ తేది ఈ రెండూ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

ఉపవాసం అర్థమిదే

ఉపవాసం అంటే చాలామంది భావించేది ఏంటి అంటే ఏమి తినకుండా ఉండడం అనుకుంటారు. కానీ అసలు ఉపవాసం అంటే అర్థం తెలుసా? ఉప అంటే సమీపం.. వాసం అంటే ఉండుట. దేనికి సమీపంగా ఉండాలి అంటే.. ఏ పూజ సమయంలో దేవుడి కోసం ఉపవాసం చేస్తున్నారో ఆ దేవునికి దగ్గరగా ఉండాలి అని అర్థం. శివరాత్రి సమయంలో ఉపవాసం చేస్తే.. శివునికి దగ్గరగా ఉండాలి అర్థం. 5 జ్ఞానేంద్రియాలను దేవుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయాలట. అప్పుడే దానికి పరమార్థం ఉంటుందని చెప్తున్నారు.

ఉపవాసం అంటే మరో నియమంగా ఏమి తినకూడదని చెప్తారు. అంటే నోటి ద్వారా ఏమి తీసుకోకుండా.. కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా ఉండాలని కొందరు చెప్తారు. అయితే ఉపవాసం గురించి ఎప్పుడూ అలా చెప్పకూడదట. అది అశనమవుతుందట. అయితే అలా అన్నారని.. ఆరోజు కూడా ప్రతిరోజూ తిన్నట్లు తినకూడదట. ఎందుకంటే ఇంద్రియములకు, కడుపునకు మంచి సంబంధం ఉంటుంది. పూర్తిగా తినడం వల్ల ఇవి కంట్రోల్లో ఉండవు. కాబట్టి రోజు తిన్నట్లు తినకూడదని చెప్తున్నారు.

సాత్వికమైన ఆహారమే..

ఆహారం అనేది శరీరాన్ని నిలపగలిగేలా ఉండేలా చూసుకోవాలట. సాత్వికంగా ఉండే ఆహారం తీసుకుంటే.. జ్ఞానేంద్రియాలు కూడా చేసే పూజపై నిమగ్నమై ఉంటాయట. ఇంద్రియములు సహకరించడానికి, శరీరం నీరసపడిపోకుండా ఉండేందుకు సాత్వికమైన ఆహారాన్ని.. అతి తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చని చాగంటి తెలిపారు. ఎంత తిని భగవంతునియందు అనురక్తం కావాలో తెలిసుకుని సమతుల్యం చేసుకోవడమే ఉపవాసం.

ఉపవాసం అలా చేయకూడదట

ఏమి తినకుండా కూర్చొని.. ఇతర పనులు చేసుకోవడం ఉపవాసమే కాదట. ఆహార నియంత్రణ చేస్తూ.. దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. చాలామంది ఆఫీస్‌కి వెళ్తూ.. దేవుడికి దూరంగా ఇతరపనులకు దగ్గరగా ఉంటారు. అలాగే జాగారం కూడా దేవుడికి సంబంధించిన పనుల్లో, పూజల్లో నిమగ్నమై ఉండాలి కానీ.. ఇతర పనుల్లో బిజీగా ఉంటూ పడుకోకుండా ఉండడం అసలు జాగరణే కాదట. ఈ పద్ధతిలో ఉపవాసం, జాగరణ చేస్తేనే అది మంచిదిట. అందుకే జన్మానికొక్క శివరాత్రి అనేది.

నిజమైన ఉపవాసం అదే..

మధుమేహమున్నవారు సాత్వికమైన పదార్థం తీసుకుంటే అది భంగమైనట్లు కాదట. శరీరాన్ని నిలబడడానికి ఓ పండు లేదా పాలు తీసుకున్నాడని భగవంతుడు అనుకుంటాడట. అది ఉపవాసం భంగంలోకి రాదని చెప్తున్నారు. అవసరం లేకుండా కడుపు నిండా తినేస్తే దోషం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎంతవరుకు సాత్వికమైన ఆహారం తీసుకుంటారో భగవంతుని సేవల్లో ఉంటారో అదే నిజమైన ఉపవాసమని చెప్తున్నారు.

Also Read : మహా శివరాత్రి 2025 తేది, చరిత్ర, ప్రాముఖ్యత ఇదే.. "ఓం నమః శివాయ" అంటూ పండుగ చేసుకోండిలా