Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో పూర్తవుతుంది. భారీగా భక్తులు స్నానమాచరించేందుకు పోటీపడుతున్నారు. ఇక వారం రోజులే ఉండడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈ సమయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలో 90 వేలకు పైగా ఖైదీలకు త్రివేణిసంగజలంతో స్నానమాచరించే అవకాశం కల్పిస్తామని యూపీ అధికారులు వెల్లడించారు.

ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమం నుంచి జలాన్ని సేకరించి ఆయా జైళ్లకు తీసుకెలతామని..ఆయా కారాగారాల్లో ఉండే నీటి ట్యాంకుల్లో ఈ జలాన్ని కలుపుతామన్నారు. పవిత్ర స్నానాల తర్వాత పూజలు, మిగిలిన క్రతువులు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర జైళ్లశాఖా మంత్రి దారా సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమంలో తాను పాల్గొంటున్నానని చెప్పారు. మొదటిసారి ఖైదీల కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు మంత్రి.

Also Read:  చిన్న రాయి పడితే కోరికలు తీర్చే ఈ చిత్రమైన శివాలయం గురించి మీకు తెలుసా - ఈ శివరాత్రికి దర్శించుకోండి !

జనవరి 13 భోగి రోజు ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ సాగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ముగింపు తేదీని పొడిగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది కానీ అదేం లేదని..అనుకున్న సమయానికి పూర్తవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అసలు మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు కానీ ఇప్పటికే 55 కోట్లు దాటేసింది. కేవలం మౌని అమావాస్య ఒక్కరోజే 8 కోట్లమంది భక్తులు స్నానాలు అచరించారు. మహాశివరాత్రి నాటికి ఈ లెక్క 60 కోట్ల దాటే అవకాశం ఉందని అధికారుల అంచనా.

Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!