Madanapalle News: మదనపల్లె రేప్‌ కేసు నిందితుడికి దిక్కులేని చావు; చెత్త బండిలో కులవర్ధన్ అంతిమ యాత్ర, సమాజానికి గట్టి మెసేజ్ ఇచ్చిన కుటుంబం!

3 months ago 11
ARTICLE AD

Madanapalle News: సభ్య సమాజం తలదించుకునేలా అఘాయిత్యానికి పాల్పడిన వారికి సమాజం ఎలాంటి శిక్ష విధిస్తుందో చెప్పడానికి మదనపల్లెలో జరిగిన ఈ ఘటనే ఒక గట్టి నిదర్శనం. హత్యాచారంతో అరాచకం సృష్టించిన మదనపల్లె రేపిస్టు కులవర్ధన్ అంతం అత్యంత దారుణంగా ముగిసింది. బతికి ఉన్నప్పుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న ఆ కామాంధుడికి, చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూడా దక్కలేదు. కన్నతల్లి, బంధువులు కూడా మొహం చాటేయడంతో అతని మృతదేహం అనాథగా మిగిలిపోయింది. చివరికి మున్సిపల్ సిబ్బంది చెత్త తరలించే బండిలో శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

కన్నవారే రాకుండా సందేశం

సాధారణంగా ఎవరైనా చనిపోతే శత్రువు అయినా వచ్చి కడసారి చూపు చూస్తారు. కానీ కులవర్ధన్ చేసిన పాపాలు అలాంటివి, అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కన్నతల్లి కానీ, ఇతర బంధువులు కానీ ముందుకు రాలేదు. రక్తం పంచుకు పుట్టిన వారు కూడా అతని ముఖం చూడటానికి ఇష్టపడలేదంటే, అతను చేసిన నేరం ఎంత ఘోరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రి మార్చురీలో అతని శవం గంటల తరబడి పడి ఉన్న ఎవరూ పట్టించుకోలేదు. సమాజం అతన్ని ఎంతగా అసహ్యించుకుంటుందో ఈ ఘటనతో స్పష్టమైంది.

చెత్త బండిలో అంతిమ యాత్ర

చివరికి చేసేది లేక మున్సిపల్ సిబ్బందే కులవర్ధన్ అంత్యక్రియల బాధ్యత తీసుకున్నారు. అయితే అతనికి ఇచ్చే వీడ్కోలు కూడా ఒక గుణపాఠంలా ఉండాలని భావించారో ఏమో కానీ, సాధారణంగా శవాలను తీసుకెళ్లే వాహనంలో కాకుండా, పట్టణంలోని చెత్తను సేకరించే ఆటోలో మృతదేహాన్ని పడేశారు. కుళ్లిన చెత్తతో సమానంగా అతని శవాన్ని ఆటోలో వేసుకొని శ్మశానానికి తరలించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు, ఆడపిల్లల ఉసురు తగిలితే ఇలా నే ఉంటుందని అంటున్నారు.

సమాజానికి గట్టి మెసేజ్

ఈ ఘటన కేవలం ఒక అంత్యక్రియల విషయం మాత్రమే కాదు. ఇది ఒక గట్టి మెసేజ్. బాలికలు, మహిళల పట్ల హత్యాచారాలకు పాల్పడే కామాంధుల శవాలు సమాజానికి కేవలం చెత్తతో సమానమనే సంకేతాన్ని మున్సిపల్ సిబ్బంది ఈ చర్య ద్వారా పంపారని స్థానికులు అంటున్నారు. క్రూరమైన నేరాలకు పాల్పడే వాికి చనిపోయిన తర్వాత కూడా ఈ భూమి మీద గౌరవం ఉండదని, వారికి ముగింపు ఇంతే దారుణంగా ఉంటుందని ఈ ఘటన నిరూపించింది.

నేరం చేసిన వాడు చట్టం నుంచి తప్పంచుకోవచ్చేమోగానీ, ప్రకృతి ఇచ్చే శిక్ష నుంచి తప్పించుకోలేడని ఈ ఉదంతం చెబుతోంది. ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే ఏ మృగాడికైనా ఇదే గతి పడుతుందని ప్రజలు అంటున్నారు.

Read Entire Article