NYPD Stopped France Turkey Presidents: వీవీఐపీలు వెళుతున్నప్పుడు.. సామాన్య జనాలు ఇబ్బందులు పడుతుండటం సహజమే.. వాళ్లు వస్తున్నారని రోడ్లు మూసేయడం.. ట్రాఫిక్ నిలిచిపోవడం… ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక దేశాధ్యక్షుడి కోసం మరో రెండు దేశాధ్యక్షులు రోడ్డు మీద నడిచివెళ్లాల్సి వచ్చింది. అవును.. డోనాల్డ్ ట్రంప్ కోసం న్యూయార్క్ పోలీసులు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్- Emmanuel Macron, టర్కీ అధ్యక్షుడు రిషెప్ థాయిప్ ఎర్డోవాన్ Recep Tayyip Erdoğan ను నడిపించారు.

Emmanuel Macron, Recep Tayyip Erdoğan Stopped on Streets

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చారు. సోమవారం రాత్రి ఆయన అక్కడ నుంచి ఆయన ఫ్రెంచ్ ఎంబసీకి వెళుతుండగా ఆయన కాన్వాయ్‌ను నిలిపేశారు. వాహనం దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లిన మాక్రాన్.. న్యూయార్క్ NYPD పోలీసులతో మాట్లాడారు. వీఐపీ మోటార్ కాన్వాయ్ మూమెంట్ ఉండటం వల్ల వాహనాన్ని ఆపేశామని వారు చెప్పడంతో మెక్రాన్ దగ్గరలో ఉన్న తమ ఎంబసీకి నడుచుకుంటూ వెళ్లారు.

ట్రంప్‌కు ఫోన్ చేసిన మెక్రాన్..

పోలీసులు తనను ఆపేయడంతో మెక్రాన్ నేరుగా ట్రంప్‌కు ఫోన్‌కాల్ చేశారు. “మీ వాళ్లు నన్ను న్యూయార్క్ రోడ్ల మీద నిలబెట్టేశారని” జోక్‌గా చెప్పారు. ఆ తర్వాత ట్రంప్‌తో మాట్లాడుతూనే నడుచుకుంటూ వెళ్లారు. దాదాపు ౩౦నిమిషాలు ఆయన నడుచుకుంటూ వెళ్లారని .. లోకల్ మీడియా రిపోర్ట్ చేసింది.

టర్కీ అధ్యక్షుడికీ అదే పరిస్థితి

అమెరికాలో ఉన్న టుర్కియే ప్రెసిడెంట్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. మెక్రాన్‌ను అక్కడ సోమవారం రాత్రి నిలిపేస్తే.. మరుసటి రోజు మంగళవారం ఉదయం టర్కీ ప్రెసిడెంట్‌కు అదే అనుభవం ఎదురైంది. ట్రంప్ కాన్వాయ్ వెళుతోందంటూ.. ఆయన్ను కూడా అలాగే రోడ్డు మీదు నించోబెట్టారు. చుట్టూ భారీగా మొహరించిన బాడీగార్డులతో టర్కీ అధ్యక్షుడు రిషెప్ థాయిప్ ఎర్డోవాన్ Recep Tayyip Erdoğan రోడ్డు మీద నిలుచుండిపోవడం వీడియోల్లో కనిపించింది.