Lucknow Coaching Centre Fire Accident | లక్నోలోని అలీగంజ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో పలువురు విద్యార్థులు, అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. కోచింగ్ సెంటర్ బిల్డింగ్‌లో జరిగిన ప్రమాదంలో 14 మంది మృతిచెందగా, మరికొందరికి కాలిన గాయాలయ్యాయి. కొందరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 అందజేయనున్నామని ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన సందేశంలో 'ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు మరణించడం పట్ల నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నారు' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Anguished by the loss of lives in a fire mishap in Lucknow, Uttar Pradesh. My condolences to the bereaved families. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance.

An ex-gratia of Rs. 2 lakh from…

— PMO India (@PMOIndia) June 22, 2026

ఈ ప్రమాద బాధితులకు ప్రధాని నష్ట పరిహారం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మరణించిన వారి ప్రతి కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం అందజేస్తామని గాయపడిన వారికి రూ. 50 వేల సాయం అందుతుందని తెలిపారు.

#WATCH | Uttar Pradesh Deputy CM Brajesh Pathak breaks down as he speaks on the Lucknow coaching institute fire incident.

He says, "I have seen 14 bodies with my own eyes." pic.twitter.com/WuLhFpXIUw

— ANI (@ANI) June 22, 2026

అగ్నిప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది బిల్డింగ్ నుండి బయటపడగలిగారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దట్టమైన పొగ, మంటల కారణంగా మరికొందరు లోపల చిక్కుకుపోయారని తెలిపారు. అయితే, లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయినట్లు పోలీసులు లేదా అగ్నిమాపక శాఖ నుంచి ప్రకటన రాలేదు. అగ్నిమాపక సిబ్బంది మరొక బృందం పక్కనే ఉన్న బిల్డింగ్ నుండి పైకి దారి చేసుకుని లోపలికి ప్రవేశించి మంటల్ని ఆర్పివేయడం ప్రారంభించారు.

సీనియర్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. 'లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ప్రాణనష్టం అత్యంత దురదృష్టకరం. ఇది హృదయ విదారక ఘటన. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను' అని స్పందించారు. సంఘటనా స్థలానికి 8 అగ్నిమాపక వాహనాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడి గోడను పగలగొట్టి చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చారు.

లక్నోలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ భావోద్వేగానికి గురయ్యారు. నా కళ్ళతో 14 మంది మృతదేహాలను చూశాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోచింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.