Low BP Diet : రక్తపోటు తక్కువగా(Low Blood Pressure/Hypotension) ఉన్నప్పుడు రోజూవారి జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలని చెప్తున్నారు. అవేంటో.. వాటిని తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆల్కహాల్‌ మానేయండి..

బీపీ తక్కువగా ఉన్నవారు మందుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ రక్తనాళాలను విస్తరించేలా చేస్తుంది. దీనివల్ల కొంతమందిలో బ్లడ్ ప్రెజర్ మరింత తగ్గవచ్చు. దీనివల్ల తల తిరగడం, బలహీనంగా అనిపించడం, నిలబడినప్పుడు కళ్లు తిరగడం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ తక్కువగా ఉండేవారు ఆల్కహాల్ తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు.

Also Read : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

పొటాషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్

అరటిపండ్లు, కొబ్బరి నీరు, అవకాడో, బంగాళాదుంపలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి మంచివే. అయినా బీపీ తక్కువగా ఉండేవారు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు లేదా కొన్ని మందులు వాడేవారు అధిక పొటాషియం తీసుకుంటే ఎక్కువ ప్రమాదం ఉండొచ్చు. కాబట్టి వ్యక్తిగత పరిస్థితిని బట్టి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.

కార్బోహైడ్రేట్లు లైట్ తీసుకోండి..

వైట్ రైస్, బ్రెడ్, పాస్తా, స్వీట్లు వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తినడం కొందరిలో బీపీ తగ్గడానికి కారణం అవుతుంది. దీనిని postprandial hypotension అంటారు. లో బీపీ సమస్య ఉన్నవారు ఒకేసారి భారీ భోజనం తినడం కంటే చిన్న మోతాదుల్లో, సమతుల్యంగా భోజనం చేయడం మంచిది.

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

ప్రాసెస్డ్ ఫుడ్స్‌ జోలికిపోవద్దు

లో బీపీ ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా అని చిప్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్డ్ మీట్ వంటి అధిక సోడియం ఉన్న ఆహారాలను ఎక్కువగా తినడం మంచిది కాదు. వీటిలో ఉప్పుతో పాటు అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక కేలరీలు కూడా ఉండొచ్చు. కాబట్టి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

కెఫీన్ ఎక్కువగా తీసుకోకండి..

కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫీన్ ఉన్న పానీయాలు.. కొంతమందిలో బీపీను తాత్కాలికంగా పెంచవచ్చు. కానీ వాటిని లో బీపీకి చికిత్సగా తీసుకోవడం మంచిది కాదు. అధికంగా కెఫీన్ తీసుకోవడం వల్ల గుండె దడ, ఆందోళన, నిద్ర సమస్యలు రావచ్చు. కాబట్టి రోజంతా కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్‌పై ఆధారపడకుండా తగినంత నీరు, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టాలి.

Also Read : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?

స్వీట్స్ మానేయండి

స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు, షుగర్తో కూడిన పానీయాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్ద మొత్తంలో స్వీట్స్ తీసుకుని వెంటనే భారీ భోజనం చేయడం వల్ల భోజనం తర్వాత బీపీలో మార్పులు కనిపించవచ్చు. కాబట్టి లో బీపీ ఉన్నవారు షుగర్స్ తింటే బీపీ పెరుగుతుందనుకోవడం మంచిది కాదంటున్నారు.

నీళ్లు తాగకపోతే కష్టమే..

డీహైడ్రేషన్ లో బీపీకి ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. అందుకే నీరు తక్కువగా తాగడం, ఎక్కువగా చెమట పట్టినా వాటర్ తీసుకోకపోవడం సమస్యను మరింత పెంచుతుంది. కాబట్టి వేసవి, వర్షాకాలంలోనూ తగినంత ద్రవాలు తీసుకోవాలి.

లో బీపీ ఉన్నవారు ఈ ఆహారాలన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ లిమిటెడ్గా తీసుకుంటూ వైద్యుల సూచనలు ఫాలో అయితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తల తిరగడం, మూర్ఛ, తీవ్రమైన బలహీనత, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.