తెలంగాణ జానపద గీతాలతో యూట్యూబ్‌లో పాపులరైన తెలుగమ్మాయి నాగదుర్గ (Naga Durga Folk Dancer). ఇప్పుడు యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై అడుగు పెట్టారు. కథానాయికగా సినిమాలు చేస్తున్నారు. నాగదుర్గ నటించిన తాజా సినిమా 'లవ్ ఓ లవ్' (Love Oh Love). ఇందులో ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ (Pavish Narayan) హీరో. త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధమైందీ సినిమా.

జూలై 31 నుంచి ప్రైమ్ వీడియోలో...
పవిష్ నారాయణ్ కథానాయకుడిగా, నాగదుర్గ కథానాయికగా నటించిన ప్రేమకథా చిత్రం 'లవ్ ఓ లవ్'. జూలై 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకాదరణ లభించలేదు. దాంతో థియేట్రికల్ రిలీజ్ అయిన మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు.

Also Read: Jana Nayakudu First Day Collection - జన నాయకుడు కలెక్షన్లు... తెలుగులో ఎంత? తమిళ్ & వరల్డ్ వైడ్ ఎంత? ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

జూలై 31వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో 'లవ్ ఓ లవ్' స్ట్రీమింగ్ కానుంది. సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసినా... ఓటీటీకి వచ్చేసరికి మలయాళ, కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్ చేశారు. నాలుగు భాషల్లో ఈ మంత్ ఎండ్ నుంచి వీక్షకులకు అందుబాటులోకి రానుందీ సినిమా.

Also Read: Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?

'కలివనం' సినిమాతో నాగదుర్గ తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ... ఆ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే... తమిళ చిత్ర పరిశ్రమలోకి 'లవ్ ఓ లవ్' సినిమాతో అడుగు పెట్టారు. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ సరసన నాగదుర్గ హీరోయిన్‌గా నటించారు. దీని తర్వాత ప్రియదర్శి 'ఇడుపు కాయితం'లో కథానాయికగా నటించే అవకాశం అందుకున్నారు. సెట్స్ మీదకు వెళ్ళకముందు టైటిల్ చుట్టూ వివాదం నెలకొనడంతో సినిమాకు ప్రచారం లభించింది.

'లవ్ ఓ లవ్' కథ విషయానికి వస్తే... రఘు (పవిష్), అవంతిక (నాగదుర్గ) లవర్స్. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు షాపింగ్, సినిమాలు, షికార్ల పేరుతో రఘు జీతం అంతటినీ అవంతిక ఖర్చు చేయిస్తుంది. జీతం చాలక శక్తికి మించి అప్పులు చేసి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతాడు రఘు. నాలుగు నెలల పాటు తన స్థానంలో ఉంటే తన కష్టాలు తెలుస్తాయని చెబుతాడు. తర్వాత ఏమైంది? చివరకు ఎలా ఒక్కటి అయ్యారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Read: Nagabandham OTT: నాగబంధం ఓటీటీ రిలీజ్ డేట్... థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ - ఎందులోనంటే?