Local Reservation In Telangana: తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్

1 month ago 2
ARTICLE AD
<p>న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో పదే పదే స్థానికతకు సంబంధించిన కేసులు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి సుప్రీంకోర్టుకు వ్యవహారం వెళ్లగా తెలంగాణలో స్థానికత అంశంపై సర్వోన్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో స్థానికత రిజర్వేషన్ పొందాలంటే నాలుగేళ్లు వరుసగా చదవాలన్న రూల్ తప్పనిసరి అని పేర్కొంది. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును జస్టిస్ పీఎస్ నరసింహ బెంచ్ గుర్తుచేసింది.&nbsp;</p> <p><br />తెలంగాణలో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో స్థానికత రిజర్వేషన్ (Local Reservation) కోసం 4 ఏళ్ల విద్యాభ్యాసం అనే నిబంధన పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జెల్ల అంకిత అనే అభ్యర్థి స్థానిక రిజర్వేషన్ కోసం నాలుగేళ్ల విద్యాభ్యాసం నిబంధనను చాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఎంబీబీఎస్ అర్హత పరీక్ష (NEET UG Exam)కు ముందు వరుసగా నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదువుకుంటేనే స్థానికత వర్తిస్తుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్ కోసం జారీ చేసిన జీవోను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం సమర్థించింది. స్థానికత నిబంధన ఏకపక్షంగా ఉందన్న పిటిషనర్ వాదనను సుప్రీంకోర్టు కొట్టివేసింది.&nbsp;</p>
Read Entire Article