Lenin Release Date: జూలై 10న అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన 'లెనిన్' థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని అఖిల్ తండ్రి, కింగ్ అక్కినేని నాగార్జున - మరో నిర్మాత సూర్యదేవర నాగవంశీ సహా చిత్ర బృందమంతా ధీమాగా ఉంది. ఈ సినిమా విజయం అఖిల్ అక్కినేనికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆయన ఒక్కరికే కాదు... హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి కూడా! ఎందుకో తెలుసా?

మూడేళ్ళ విరామం తర్వాత అఖిల్ సినిమా!
Akhil Akkineni Upcoming Movie After Agent: అఖిల్ అక్కినేని ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమా 'ఏజెంట్'. బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. ఆ తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నారు. ఒక ఇంజ్యూరీ కావడంతో పాటు పెళ్ళి అవ్వడం వల్ల సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఈ కాలంలో తెలుగు సినిమాల ట్రెండ్ కూడా మారింది. అవన్నీ గమనించి 'లెనిన్' చేశారు.

Also Read: Nagadurga Tamil Debut - తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?

అఖిల్ తెల్లగా కనిపించడం లేదు, అదే పెద్ద మాస్ - 'లెనిన్' రిలీజ్ ప్రెస్‌మీట్‌లో నాగవంశీ చెప్పిన మాట. అందుకు కారణం లేకపోలేదు. అఖిల్ చాలా అంటే చాలా తెల్లగా ఉంటారు. ఆయన స్కిన్ టోన్, కలర్ అంతా హాలీవుడ్ హీరోల టైపులో ఉంటుంది. అందువల్ల ఆయన్ను మాస్ ఆడియన్స్ ఓన్ చేసుకోవడం లేదా? అనే సందేహం కూడా ఉంది. 'హాలో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'కు హిట్ టాక్ వచ్చినా అవి అర్బన్ స్టోరీలు, క్లాస్ సినిమాలు. మాస్ ప్రేక్షకుల్లో అఖిల్ అక్కినేనికి సరైన సక్సెస్ లేదు. అందువల్ల, 'లెనిన్' ఆయనకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఈ సినిమా విజయం సాధించడం ఎంతో అవసరం. ప్రేక్షకుల ఆదరణ లభిస్తే అఖిల్ కెరీర్‌లో 'జానకి రాముడు' తరహా సినిమా అవుతుందని నాగార్జున చెప్పడానికి కారణం కూడా అదే.

Also Read: Why Was Rajesh Sharma Hospitalised - ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?

భాగ్యశ్రీ బోర్సేకి ఎందుకు ఇంపార్టెంట్!?
అఖిల్ అక్కినేనితో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి కూడా 'లెనిన్' విజయం చాలా ముఖ్యం. దీనికి ముందు తెలుగులో మాస్ మహారాజా రవితేజ 'మిస్టర్ బచ్చన్', ది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్', రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాల్లో కథానాయికానా చేశారు. తమిళ్ నుంచి తెలుగుకు డబ్ అయిన 'కాంత' సినిమాలోనూ మెయిన్ లీడ్ ఆవిడే. అయితే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఓ సక్సెస్ భాగ్యశ్రీ బోర్సేకి ఎంతో అవసరం. అదీ సంగతి. ప్రస్తుతానికి తమిళ హీరో శివ కార్తికేయన్ 'సియోన్'లో భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. అది కాకుండా స్టార్ హీరోల సరసన మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి అవకాశాలకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. కానీ హిట్స్ వస్తే ఉండే క్రేజ్, ఆ రెమ్యూనరేషన్ వేరు కదా.

Also Read: Preity Mukhundhan - అల్లు అర్జున్ 'రాకా' సినిమా ఛాన్స్ వదులుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ... ఎందుకో తెలుసా?