Late-Night Eating : రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
4 days ago 2
ARTICLE AD
Late Night Eating and Digestion Risks : రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం.. తిన్న వెంటనే పడుకోవడం చాలామందికి అలవాటు. పని ఒత్తిడి, ఆలస్యంగా ఇంటికి చేరుకోవడం వంటి కారణాలతో కొందరు తొమ్మిది తర్వాత భోజనం చేస్తుంటారు. వెంటనే రిలాక్స్ అవ్వాలని పడుకుంటారు. ఇలా తిన్న వెంటనే నిద్రపోవడం రెగ్యులర్​గా జరిగితే జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read : అన్నానికి బదులుగా డిన్నర్​లో ఇవి తినండి.. కడుపు నిండటంతో పాటు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి
యాసిడ్ రిఫ్లక్స్
భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల కడుపులోని యాసిడ్స్ తిరిగి అన్నవాహికలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. దీనివల్ల గుండెల్లో మంట, గొంతులో పుల్లటి రుచి, ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉండొచ్చు.
[quote author=డాక్టర్ వెంకటేష్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్]భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొంతసేపు నిటారుగా కూర్చోవాలి లేదా నెమ్మదిగా నడవాలి. పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి తిరిగి వచ్చే ప్రమాదం తగ్గించేందుకు భోజనానికి, నిద్రకు మధ్య తగిన విరామం ఇవ్వడం ముఖ్యం. [/quote]
Also Read : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
కడుపు ఉబ్బరం, అజీర్ణం
రాత్రి సమయంలో ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, నూనెలో వేయించిన, మసాలా ఫుడ్స్ తినడం వల్ల కొందరిలో అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు బరువుగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. అలా తిని భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల ఈ అసౌకర్యం మరింత ఎక్కువగా అనిపించవచ్చు. కాబట్టి రాత్రుళ్లు ఎక్కువగా, హెవీ మీల్స్ తినడం కంటే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
[quote author=డాక్టర్ వెంకటేష్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్]రాత్రి భోజనంలో వేయించిన పదార్థాలు, అధిక కొవ్వు ఉన్న ఆహారాలు, మంటను పెంచే మసాలా పదార్థాలను తగ్గించాలి. ప్రతి ఒక్కరికీ ఈ ఫుడ్స్ సమస్య కలిగించకపోవచ్చు. కాబట్టి మీ శరీరాన్ని బట్టి ఏ పదార్థాలు తిన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందో గుర్తించి వాటిని కంట్రోల్ చేయాలి.  [/quote]
Also Read : తప్పులు చిన్నవే ఆరోగ్య సమస్యలు మాత్రం పెద్దవి.. బ్రేక్​ఫాస్ట్​తో మధుమేహం, డిన్నర్​తో బరువు, జాగ్రత్త
నిద్రకు ఆటంకం
రాత్రి భోజనం చేసిన తర్వాత యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వస్తే నిద్ర మధ్యలో మెలకువ రావచ్చు. నిద్ర నాణ్యత తగ్గడంతో మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీటివల్ల జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయి.
[quote author=డాక్టర్ వెంకటేష్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్]నిద్రపోయే సమయానికి దగ్గరగా భారీ భోజనం చేయకూడదు. తరచూ రాత్రిపూట గుండెల్లో మంటతో నిద్ర లేస్తుంటే దానిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. [/quote]
Also Read : రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. డిన్నర్ 8 గంటలలోపే ముగిసిపోవాలట, ఎందుకంటే
మధుమేహంపై ప్రభావం
ఒక అధ్యయనంలో 12 మందిని పరిశీలించగా.. సాయంత్రం 6 గంటలకు బదులుగా రాత్రి 11 గంటలకు భోజనం చేసినప్పుడు మరుసటి రోజు అల్పాహారం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఈ అధ్యయనం చాలా చిన్నది. కాబట్టి దీని ఆధారంగా ప్రతి ఒక్కరిలోనూ ఇదే ప్రభావం ఉంటుందని చెప్పలేం.
[quote author=డాక్టర్ వెంకటేష్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్]కాబట్టి ప్రతిరోజూ అర్ధరాత్రి సమీపంలో భారీ భోజనం చేసే అలవాటు ఉంటే దాన్ని మార్చుకోవడం మంచిది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు భోజన సమయాలు, ఆహార పరిమాణంపై వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సూచనలు పాటించాలి. [/quote]
Also Read : బరువు తగ్గడానికి రాత్రుళ్లు డిన్నర్ మానేస్తున్నారా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
బరువు పెరగవచ్చు
బరువు పెరగడంలో రోజంతా తీసుకునే మొత్తం క్యాలరీలు, శారీరక శ్రమ, నిద్ర, ఆహారపు అలవాట్లు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే రాత్రుళ్లు తరచుగా ఎక్కువ ఆహారం తీసుకుంటుంటే.. కేలరీల మోతాదు పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇలాంటి అలవాట్లు జీవక్రియల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
బరువు తగ్గేందుకు రాత్రి భోజనం మానేయాల్సిన అవసరం లేదు. బదులుగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, తగిన ప్రోటీన్, ధాన్యాలు ఉండేలా భోజనం చేసుకోవాలి. భోజనం చేసిన సమయం ఒక్కటే బరువు పెరుగుదలను నిర్ణయించదని గుర్తించాలి.
Also Read : రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. డిన్నర్ 8 గంటలలోపే ముగిసిపోవాలట, ఎందుకంటే
భోజనం తర్వాత ఎంతసేపటికి నిద్రపోవాలి?
సాధారణంగా రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోవడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల విరామం ఇవ్వడం మంచిది. ఈ సమయంలో కడుపులోని ఆహారం కొంతవరకు ముందుకు కదిలేందుకు సమయం లభిస్తుంది. అలాగే పడుకున్నప్పుడు యాసిడ్స్ అన్నవాహికలోకి తిరిగి వచ్చే ప్రమాదం తగ్గవచ్చు. తరచుగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు తమ లక్షణాలను బట్టి వైద్య సహాయం తీసుకోవాలి.
డాక్టర్ వెంకటేష్ ప్రకారం.. వీలైనంత వరకు ప్రతిరోజూ ఒకే సమయానికి రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించాలి. నిద్రపోయే సమయానికి అనుగుణంగా భోజన సమయాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలి. పని కారణంగా ఆలస్యమైతే పెద్ద భోజనం చేయకుండా తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
Also Read : బరువు తగ్గాలనుకుంటే డిన్నర్​లో ఈ మిస్టేక్స్ చేయకపోవడమే మంచిది.. లేదంటే ఇట్టే పెరిగిపోతారట
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
Read Entire Article