Late Dinner Side Effects : రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? బ్లడ్ షుగర్ నుంచి నిద్ర వరకు.. ఎలాంటి ప్రభావం పడుతుందంటే
1 week ago 2
ARTICLE AD
Best Time to Eat Dinner : ఉద్యోగాలు, ఇతర పనుల కారణంగా చాలామంది రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తుంటారు. కొందరికి రాత్రి 9, 10 గంటలైనా భోజనం చేసే సమయం ఉండదు. అయితే ఇలా రోజూ ఆలస్యంగా తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయులు, జీర్ణక్రియ, నిద్ర, బరువుపై ప్రభావం పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. మరి రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి? ఆలస్యంగా తింటే ఎలాంటి సమస్యలు రావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లడ్ షుగర్​పై ప్రభావం
శరీరం పగటిపూట ఆహారాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. అయితే సాయంత్రం, రాత్రి సమయాల్లో ఇన్సులిన్ పనితీరులో మార్పులు రావచ్చు. దీంతో పగలు తీసుకున్న అదే ఆహారాన్ని రాత్రి ఆలస్యంగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి 10 గంటలకు భోజనం చేయడం, సాయంత్రం 7 గంటలకు తినడంతో పోలిస్తే రక్తంలో చక్కెర నియంత్రణపై ఎక్కువ ప్రభావం చూపవచ్చని చెప్తున్నారు.
జీర్ణక్రియపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే..
రాత్రి సమయంలో జీర్ణక్రియకు సంబంధించిన ప్రక్రియల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో ఎక్కువగా, డీప్ ఫ్రై చేసినా, కారంగా ఉండే ఆహారం తీసుకుని వెంటనే పడుకుంటే అసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. పడుకున్నప్పుడు కడుపులో ఎసిడిటీ పెరిగి.. అన్నవాహికలోకి తిరిగి వచ్చే అవకాశం పెరుగుతుంది.
Also Read : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
[quote author=డాక్టర్ దిలీప్ గూడె]రాత్రి భోజనానికి, నిద్రపోవడానికి మధ్య కనీసం రెండు నుంచి మూడు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు రాత్రి 10 గంటలకు నిద్రపోవాలనుకుంటే.. వీలైనంత వరకు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య భోజనం పూర్తి చేయడం మంచిది. [/quote]
నిద్ర నాణ్యత దెబ్బతింటుందా?
[quote author=డాక్టర్ దిలీప్ గూడె]ఆలస్యంగా భోజనం చేసే కొందరు రాత్రి మధ్యలో నిద్ర లేవడం లేదా ఉదయం లేచినప్పుడు తాజాగా అనిపించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మరుసటి రోజు ఆకలి, తీపి పదార్థాలు లేదా ఇతర స్నాక్స్ తినాలనే కోరిక పెరగవచ్చు. ఇలా ఆలస్యంగా తినడం, నిద్ర సరిగా లేకపోవడం, మరుసటి రోజు ఎక్కువగా తినాలనిపించడం రొటీన్గా మారిపోవచ్చు.[/quote]
Also Read : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
బరువు పెరుగుతారా?
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల నేరుగా బరువు పెరుగుతారని చెప్పలేం. కానీ ఈ అలవాటు వల్ల ఆహారం తీసుకునే విధానం మారుతుంది. రోజంతా బిజీగా ఉండి రాత్రి ఎక్కువ మొత్తంలో భోజనం చేయడం, టీవీ లేదా ఫోన్ చూస్తూ స్నాక్స్ తినడం వల్ల అదనపు కేలరీలు పెరుగుతాయి. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు భోజనం చేసే సమయంతో పాటు, ఆహారం పరిమాణం, దాని నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలి.
రాత్రి భోజనం ఎప్పుడు చేస్తే మంచిది
రాత్రి భోజనాన్ని వీలైనంత వరకు రాత్రి 8 గంటలలోపు ముగించడం మంచిదని డాక్టర్ దిలీప్ గూడె సూచిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి పని వేళలు, నిద్ర సమయం ఒకేలా ఉండవు. కాబట్టి కనీసం నిద్రపోవడానికి రెండు నుంచి మూడు గంటల ముందే భోజనం పూర్తి చేయాలని సూచించారు.
Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?
రాత్రి భోజనంలో పప్పు, కూరగాయలు, కిచిడీ లేదా ప్రోటీన్ అందించే పదార్థాలతో రొట్టెలు వంటి తేలికపాటి, సమతుల్య ఆహారాన్ని తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంతో పోలిస్తే రాత్రి భోజనాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవడం, నూనెలో వేయించిన ఫుడ్స్, అతిగా కొవ్వు లేదా మసాలాలు ఉన్న ఆహారాన్ని తగ్గించడం మంచిది. అలాగే ఆలస్యంగా భోజనం చేస్తే.. తక్కువ పరిమాణంలో తినాలని చెప్తున్నారు. భోజనం చేసిన తర్వాత వీలైతే కొద్దిసేపు నడవాలి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..
తరచూ అసిడిటీ రావడం, రాత్రిపూట ఆకలితో నిద్ర లేవడం లేదా రక్తంలో చక్కెర స్థాయుల గురించి ఆందోళన ఉండటం వంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ దిలీప్ గూడె సూచిస్తున్నారు. అలా అని ఆహారాన్ని పూర్తిగా మానేయడం మంచిది కాదని చెప్తున్నారు.
Also Read : వినికిడి, నిద్ర తగ్గినా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట.. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
Read Entire Article