Land Auction In Hyderabad: హైదరాబాద్ ఐటీ హబ్ సమీపంలో 400 ఎకరాల భూమి వేలం, ప్రభుత్వానికి భారీ ఆదాయం

9 months ago 8
ARTICLE AD
<p>Telangana government | హైదరాబాద్: ఆదాయం సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హైదరాబాద్&zwnj;లో ఐటీ హబ్ సమీపంలో గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భూములకు పెరుగుతున్న డిమాండ్, ధర ఉన్న భూమి కావడంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ భూమికి సంబంధి మాస్టర్ లే ఔట్ డిజైన్ చేసి విక్రయించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్&zwnj;ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) రంగంలోకి దిగింది. ఈ భూముల వేలానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ ఇదివరకే మొదలైంది.</p> <p>ఐటీ హబ్ సమీపంలో రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వచ్చే కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను దశలవారీగా వేలం వేయనున్నట్లు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్&zwnj;ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తెలిపింది. నగరానికి సమీపంలో ఐటీ హబ్, రెసిడెన్షియల్ హబ్ గా ఉన్న గచ్చిబౌలిలో భూముల వేలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అది పెద్ద వేలంపాట కానుంది. ఆ వేలం వేసే భూములు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో, పంజాగుట్ట సర్కిల్ నుంచి 15 నుంచి 18 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉందని బిడ్ కు ఇచ్చిన డాక్యుమెంట్లలో TGIIC పేర్కొంది. సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో జాబ్ చేస్తున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాకు సమీపంలో అంత పెద్ద మొత్తంలో నాలుగు వందల ఎకరాలు అందుబాటులో ఉండటం విశేషం.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>
Read Entire Article