Lakshmi Nivasam Serial : సరికొత్త తెలుగు సీరియల్ 'లక్ష్మీ నివాసం'లో పవిత్రా లోకేష్... టెలికాస్ట్ ఎప్పటి నుంచి అంటే ?
9 months ago 7
ARTICLE AD
Zee Telugu Serial Lakshmi Nivasam cast and crew : టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న నటీమణులలో పవిత్రా లోకేష్ కూడా ఒకరు. సీనియర్ నటుడు నరేష్ ను వివాహం చేసుకున్న తర్వాత నుంచి ఆమె ఏదో ఒక వార్తతో అందరి దృష్టిలో పడుతున్నారు. నరేష్ కు ఇది నాలుగవ పెళ్లి కాగా, పవిత్ర కు మూడో పెళ్లి. ఇక వీరిద్దరి రిలేషన్, పెళ్లి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ జంట వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవిత్ర ఒక కొత్త తెలుగు టీవీ సీరియల్ లో కీలక పాత్ర పోషించబోతుందని అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ కావడంతో పవిత్ర లోకేష్ సీరియల్ లో కనిపించడం ఖాయమని కన్ఫర్మ్ అయింది.
'లక్ష్మీ నివాసం'లో పవిత్రా లోకేష్
ఇటీవల కాలంలో ప్రముఖ నటీనటులు వెండితెర నుంచి వెబ్ సిరీస్ ల వైపు యూటర్న్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు మంచి పాపులారిటీ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు సీరియల్స్ వైపు మరలుతున్నారు. అలాగే తాజాగా పవిత్రా లోకేష్ 'లక్ష్మీ నివాసం' అనే తెలుగు సీరియల్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. జీ తెలుగు టీవీ ఛానల్ లో ఈ సీరియల్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. తాజాగా పవిత్ర కు సంబంధించిన ప్రోమోను సదరు ఛానల్ రిలీజ్ చేసింది. ప్రోమోను చూస్తుంటే పవిత్ర, కల్కి రాజా జోడిగా ఇందులో కనిపించబోతున్నారని అనిపిస్తోంది. అలాగే ప్రోమోలో ఉన్న మరో పాప ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఇందులో పవిత్ర రోల్ ఎలాంటిది అనేది తెలియాలంటే సీరియల్ స్టార్ట్ అయ్యేదాకా ఆగాల్సిందే.
'లక్ష్మీ నివాసం' సీరియల్ ఎప్పుడు ప్రసారం అవుతుందంటే?
జీ తెలుగు టీవీలో 'లక్ష్మీ నివాసం' సీరియల్ టెలికాస్ట్ టైమింగ్స్ ఫిక్స్ అయ్యాయి. మార్చ్ 3వ తేది నుంచి టెలికాస్ట్ స్టార్ట్ కాబోతోంది. ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు సోమవారం నుంచి ఆదివారం వరకు టెలికాస్ట్ కానుంది. ఈ సీరియల్లో శ్రీ రంజని, 'ఛత్రపతి' శేఖర్ భార్యా భర్తలుగా నటిస్తుండగా, తమిళ సీరియల్ 'సంధ్యారాగం'లో సిస్టర్స్ గా కనిపించిన ఆధ్యా, రామలక్ష్మి ఈ సీరియల్ లో కూడా నటిస్తున్నారు. అంతర, భావన లాస్య (ఆధ్యా, రామలక్ష్మిల ఒరిజినల్ పేర్లు) లక్ష్మీ నివాసంలో సిస్టర్స్ గా హంగామా చేయబోతున్నారు.'మల్లి' సీరియల్ లో నటించిన భావన లాస్య, 'ఊహలు గుసగుసలాడే' ఫ్రేమ్ శ్రీ రితిక, 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి' ఫేమ్ అభిత, 'వదినమ్మ' ఫేమ్ గణేష్ రెడ్డి తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. భార్యకు సొంత ఇల్లు కట్టించాలనే కలను నెరవేర్చాలనుకున్న శ్రీనివాస్ కి, రిటైర్మెంట్ డబ్బులు చేతికొచ్చే సరికి కొత్త సమస్యలు వచ్చి పడతాయి. పెళ్లి చేయాల్సిన కూతురు, పెళ్లయిన కూతురు కట్నం బాకీ, బండి కోసమని కొడుకు డబ్బులు తీసుకోవడంతో శ్రీనివాస్ భార్యకు కలను ఎలా నెరవేర్చాడు అనే స్టోరీ నేపథ్యంలో ఈ సీరియల్ సాగిపోతుంది.
Read Entire Article