Lakshimi Raave Maa Intiki Serial Today March 23th: త్రిష చేసిన పనికి శ్రీలక్ష్మీపై చేయిచేసుకున్న మ్యాడీ..? అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేసేందుకు సింధూ ఏం చేసింది..?

3 weeks ago 4
ARTICLE AD
<p>Lakshimi Raave Maa Intiki &nbsp;Serial Today Episode: శ్రీలక్ష్మీ కాలేజీకి వచ్చేసరికి కాలేజీ మొత్తం మ్యాడీ, శ్రీలక్ష్మీ ఫొటోలు, ఫోస్టర్లతో నిండిపోయి ఉంటుంది. వాటిపై ఐలయూ మధుబాబు, శ్రీలక్ష్మీ వెడ్స్ మధుబాబు అని రాసి ఉంటుంది. వాటిని చూడగానే శ్రీలక్ష్మీ కంగారుపడిపోతుంది. ఎవరు ఇవన్నీ రాశారని, ఈ ఫొటోలు అంటించారని లక్ష్మీ అడుగుతుంది. నువ్వే ఇదంతా &nbsp;చేసి మమ్మల్ని అడుగుతున్నావేంటని త్రిష అంటుంది. ఇంతలో మ్యాడీ అక్కడికి రావడం...ఆ పోస్టర్లు చూసి కోప్పడటం జరుగుతుంది. ఎవరు ఇదంతా చేశారని నిలదీయగా...ఈ శ్రీలక్ష్మీ పనేనని త్రిష అంటుంది. నిజంగా నాకు తెలియదని శ్రీలక్ష్మీ చెప్పిన వినకుండా ఆమెపై మ్యాడీ చేయిచేసుకుంటాడు. నన్ను మధుబాబు అని నువ్వు తప్ప ఎవరూ పిలవరని...అంటే ఇదంతా చేసింది నువ్వేనని కోప్పడతాడు. శ్రీలక్ష్మీ ఎంత చెప్పినా వినకుండా ఆమెపై మండిపడతాడు.</p> <p>శ్రీలక్ష్మీపై కోపం మరింత పెంచాలని భావించిన త్రిష...ఈ గొడవ పెద్దది చేయాలని అనుకుంటుంది. దీంతో శ్రీలక్ష్మీని రెచ్చగొడుతుంది. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలకు ఇదే పనని....ఒకటి, రెండుసార్లు టౌన్&zwnj;కు వచ్చి బాగా డబ్బులు ఉన్న అబ్బాయిలను చూసి బుట్టలో వేసుకోవాలని చూస్తారని అంటుంది. కుదరకపోయేసరికి వాళ్లను బ్లాక్&zwnj;మెయిల్ చేసి డబ్బులు గుంజాలనుకుంటారని అంటుంది.అదీకాకపోతే ఇలా ఒకరి వెంట పడి తమ పనులు అయిపోయిన తర్వాత వేరొకరి చూసుకుంటారని అనడంతో శ్రీలక్ష్మీకి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. త్రిష చెంపపై లాగిపెట్టి కొడుతుంది. తను అనుకున్నదే జరిగిందని త్రిష సంతోషపడుతుంది. ఇదంతా చేసి టాఫిక్ డైవర్ట్ చేయడం కోసం శ్రీలక్ష్మీ కావాలనే నాతో గొడవ పెట్టుకుంటుందని త్రిష అంటుంది.</p> <p>త్రిష అన్నదానిలో తప్పేముందని...అసలు నిన్ను కాదని నిన్ను ఇలా పెంచిన మీ అమ్మానాన్నలను అనాలని మ్యాడీ అంటాడు. నిన్ను నాకు అంటగట్టిన మా తాతయ్యను అనాలని తిడతాడు. నీలాంటి లోక్లాస్&zwnj; అమ్మాయిలు అంటేనే నాకు చెడ్డ చిరాకని అంటాడు.పల్లెటూరు నుంచి వచ్చిన నీలాంటి లోక్లాస్&zwnj; తెలివితేటలు నా దగ్గర చూపించొద్దని అంటాడు.దీంతో శ్రీలక్ష్మీ మ్యాడీని అడ్డుకుంటుంది. పల్లెటూరు అమ్మాయిల గురించి ఇలా చెడుగా మాట్లాడొద్దని అంటుంది.ఇంతలో త్రిష సైగ చేయడంతో ఆమె వెనక ఉన్న స్నేహితులంతా ఈ పోస్టర్లు శ్రీలక్ష్మీ అంటిస్తుంటే మేం చూశామని అంటారు. దానికింద రాతలు రాసింది కూడా తనేనని అబద్ధం చెబుతారు. దీంతో మ్యాడీకి కోపం వచ్చి మళ్లీ నాకు కనిపించొద్దని...ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పడంతో శ్రీలక్ష్మీ ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో త్రిష ఆనందపడుతుంది. నిన్ను వదిలేస్తే...మ్యాడీ జీవితంలోకి మళ్లీ వస్తావని నిన్ను పైకి పంపించడానికి ఇదే సరైన సమయమని అంటుంది. అవమానంతో నువ్వే ఆత్మహత్య చేసుకున్నావని అందరూ &nbsp;అనుకుంటారని అంటుంది.</p> <p>ఆరునెలల్లో విడాకులు రాబోతున్నాయన్న ఆనందంతో అంతవరకు మీ అమ్మ, చెల్లి వద్ద మనం మంచిగా ఉంటున్నట్లు నటిద్దామని సింధూ చెప్పడంతో గోపీ సరేనంటాడు. వాళ్ల దగ్గర మార్కులు కొట్టేసేందుకు తనకు ఇష్టం లేకపోయినా పేడ ఎత్తి పిడకలు చేసి గోడకు కొడుతుంది సింధూ. అది చూసిన గోపీ వాళ్ల అమ్మ ఎంతో మురిసిపోతుంది. నాకోడలు ఎంత మారిపోయిందోనని అనుకుంటుంది. దగ్గరకు వచ్చి నేనే పాపిస్టిదాన్నని...మా మంగ మాటలు విని నిన్న అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నానని అంటుంది. పర్వాలేదు అత్తయ్యగారు అని సింధూ అనడంతో గోపీ తల్లి మురిసిపోతుంది.&nbsp;</p>
Read Entire Article