Lakshimi Raave Maa Intiki Serial Today Episode: సింధూపొద్దున్నేలేచి స్నానం చేసి ఇంట్లో దేవుడికి పూజ చేయడం చూసి వాళ్ల అత్త, ఆడబిడ్డ కంగుతింటారు.ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇలా చేస్తుందని అనుకుంటారు. కానీ సింధూ మాత్రం ఈ జైలు నుంచి ఎప్పుడు బయటపడేస్తావు దేవుడా అంటూ దేవుడిని మొక్కుకుంటుంది. వీలైనంత త్వరగా ఈ 6నెలలు గడిచిపోయేలా చూడమని కోరుకుంటుంది.ఆ తర్వాత ఎంచక్కా ఆస్ట్రేలియా వెళ్లిపోవచ్చని భావిస్తుంది. అటు గోపీ కూడా దేవుడిని ప్రార్థిస్తాడు. నా భార్యకు మంచి బుద్ధి ప్రసాదించి ఇక్కడే ఉండిపోయేలా చూడమని కోరుకుంటాడు. ఈ 6నెలల్లో తన మనసు మారిపోవాలని కోరుకుంటాడు.
అటు మెట్లపై నుంచి ఎత్తుకుని మరీ గుడికి చేరుకున్న మ్యాడీ,శ్రీలక్ష్మీని పూజారి ఆశీర్వదిస్తాడు. మీరు ఇద్దరూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తే పూజ జరిపిస్తానని చెబుతాడు. దీంతో వాళ్లిద్దరూ గుడిచుట్టూ తిరుగుతుండగా....మ్యాడీ లక్ష్మీని తన వెనక రావొద్దని కోప్పడతాడు. ఇది చూసిన పూజారి వాళ్లిద్దరికీ తువాలు కట్టి ఒకరి వెనక ఒకరు నడిచేలా ఏర్పాట్లు చేస్తాడు. అప్పటికీ మ్యాడీ త్వరగా వెళ్లిపోవాలని అంటుండగా...మీ తాతయ్యకు చెబుతానని పూజారి బెదిరించి అన్ని పూజలు చేస్తాడు. శ్రీలక్ష్మీ నుదుట బొట్టుపెట్టమని చెప్పగా....పెట్టనని మ్యాడీ మొండికేస్తే పూజారి బలవంతంగాపెట్టిస్తాడు. అలాగే ప్రసాదం కూడా తినిపించాలని ఇది ఈగుడి ఆచారమంటూ బలవంతంగా మ్యాడీతో ప్రసాదం తినిపిస్తాడు. ఇంతలో మ్యాడీకి త్రిష దగ్గర నుంచి ఫోన్‌కాల్‌ వస్తుంది.అసలు ఎన్నిరోజులు నుంచి ఫోన్‌ చేయడంలేదని, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం లేదని మండిపడుతుంది. అసలు సింధూను తప్పించావా లేదా అని అడుగుతుుంది. కుదరలేదని చెప్పగా..అప్పుడే శ్రీలక్ష్మీ వచ్చి పంతులుగారు పిలుస్తున్నారని చెప్పడంతో ఆ ఎర్రబస్సు ఎందుకు వచ్చిందని అడుగుతుంది త్రిష. తాతయ్య బలవంతంగా తీసుకొచ్చాడని చెబుతుంది.అది నీవెంట ఎందుకు ఉందని...మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నిస్తుండగా శ్రీలక్ష్మీ ఫోన్‌లాక్కుని కట్‌చేస్తుంది.గుడిలోఫోన్‌ మాట్లాడకూడదని చెప్పి పంతులుగారి వద్దకు లాక్కెళ్తుంది. గుడిలో హడావుడి చేయకూడదని ప్రశాంతంగా ఉండాలని పంతులుగారు చెబుతారు. పూజ పూర్తయిన వెంటనే పంతులుగారు సూర్యనారాయణకు ఫోన్‌చేసి మొత్తం మీరు చెప్పినట్లే చేశానని చెబుతాడు.
శ్రీలక్ష్మీ వచ్చిందని తెలుసుకున్న త్రిష....మ్యాడీని తన ప్లాట్‌కు రప్పించుకునేందుకు కిందపడిపోయినట్లు నాటకం ఆడుతుంది. మళ్లీ మ్యాడీకి ఫోన్‌చేసి వెంటనే రావాలని నేను పడిపోయానని చెబుతుంది. కాలుబాగా నొప్పిగా ఉందని అబద్ధం చెప్పడంతో మ్యాడీ శ్రీలక్ష్మీని గుడిలోనే వదిలేసి ఇంటికి వెళ్లిపోమ్మని చెప్పి పరుగుపరుగున వెళ్లిపోతాడు. నాకు అడ్రస్‌తెలియదని,ఎలా వెళ్లాలో కూడా తెలియదని చెబుతున్నా వినకుండా త్రిష వద్దకు పరుగెత్తికెళ్తాడు.అక్కడ త్రిష మ్యాడీని చూసి అబ్బా,అమ్మాఅంటూ నాటకం ఆడుతుంది. డాక్టర్‌వద్దకు వెళ్దామని అంటే అవసరం లేదని చిన్న దెబ్బ తగిలింది అంతేనంటూ బామ్ రాసుకుంటే తగ్గిపోతుందని అంటుంది. అటు శ్రీలక్ష్మీ ఇంటికి వెళ్లలేక గుడివద్దే ఉండిపోతుంది.