హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను విడుదల చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తల్లికి బువ్వ పెట్టనోడు- చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావడానికి తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపిన రేవంత్ రెడ్డి- ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో నికృష్ట పాలన కొనసాగుతోందని, ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాగే చేయిస్తానని పులకేశి బయలుదేరాడని సీఎం రేవంత్ ను ట్రోల్ చేశారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉచిత కరెంటు ఎవరికి ఇచ్చారు ? -గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ? అని ప్రశ్నించారు. హామీ ప్రకారం తెలంగాణలో రూ.2500 తీసుకుంటున్న మహిళలు ఎవరు ? పెళ్లిళ్ల సమయంలో తులం బంగారం అందుకున్న ఆడబిడ్డలు ఎవరు ? రైతు భరోసా రూ.7500 ఎక్కడ ఇచ్చారు ? వృద్ధులను మోసం చేసిన ఆసరా ఫించన్లు (Asara Pension) రూ.4000 చేసిందెక్కడ. రూ.5 లక్షల విద్యాభరోసా ఇచ్చారా, పోనీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అన్న హామీ ఏమైంది ? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ప్రశ్నించారు.

తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు

తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు

తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన - ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి

ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? -గ్యాస్… pic.twitter.com/JhIIxXW4fw

— KTR (@KTRBRS) January 17, 2025

తెలంగాణలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు
పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఎన్నికల సమయంలో తెలంగాణలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు గాని పోయి ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు, ఏదో చేస్తాం అన్నట్లుగా ఢిల్లీలో హస్తం పార్టీ ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా ? అని మండిపడ్డారు. ఢిల్లీ గల్లీల్లో కాదు రేవంత్ రెడ్డి.. మీకు దమ్ముంటే ఉద్యోగాలు ఇచ్చామని మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు చూద్దాం. నవ్విపోదురు గాక, నాకేంటి సిగ్గు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని.. జాగో ఢిల్లీ జాగో అని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.