మొయినాబాద్: చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. అర్చకులు రంగరాజన్‌‌కు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. వీడియోలు, ఫొటోలు ఆధారాలున్నా నిందితులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయానికి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లింది. దాడికి గురైన చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్‌ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ పరామర్శించారు.

రంగరాజన్‌పై దాడి చేసిన వీరరాఘవరెడ్డి అరెస్ట్
ఇక్ష్వాకు వంశం వారసులుగా ప్రకటించుకుని ప్రకటించుకున్న వీరరాఘవరెడ్డి(Vera Raghavareddy) చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి రామరాజ్యం ఏర్పాటు అంటూ గట్టిగానే ప్రచారం చేసుకుంటున్నాడు. తన అనుచరులతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయానికి శుక్రవారం ఉదయం వీరరాఘవరెడ్డి వచ్చాడు. ఆలయ పూజారి రంగరాజన్‌తో మాట్లాడాలని పిలిచి.. రామరాజ్య స్థాపనకు ఆయన చేసిన ప్రతిపాదనను రంగరాజన్‌ తిరస్కరించారు. దాంతో ఆవేశానికి లోనైన వీరరాఘవరెడ్డి, అతడి అనుచరులు రంగరాజన్ పై దాడి చేయగా, అర్చకుడి కన్నుకు తీవ్ర గాయమైంది. రంగరాజన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అతడి అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.