BRS Leader KTR | హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR)పై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై మరో కేసు నమోదు చేసింది. రెండు రోజుల కిందట ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ఆఫీసుకు వెళ్లి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అయితే ఏసీబీ ఆఫీసు నుంచి నగరంలోని బీఆర్ఎస్ ఆఫీసు తెలంగాణ భవన్ వరకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించడంతో కేటీఆర్ మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కేటీఆర్ ర్యాలీపై కేసు నమోదు

ఎలాంటి అనుమతి లేకుండా కేటీఆర్ ర్యాలీ నిర్వహించారని, ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్, మన్నె గోవర్ధన్, జైసింహ, క్రిశాంక్, తదితరులపై 305, R/W బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ వరకు కేటీఆర్ ర్యాలీపై నమోదు చేసిన కేసులో ఏ1గా కేటీఆర్ పేరు చేర్చారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఏసీబీ ఆఫీసు నుంచి వస్తున్న తమ నేతకు వెదురుగా వెళ్లి.. ఆయనతో కలిసి ఫార్టీ కార్యాలయానికి వెళ్లిన తమపై బూటకపు కేసులు పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదివరకే ఏసీబీ, ఈడీ నుంచి ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి. ఏసీబీ ఆఫీసుకు విచారణకు వెళ్లగా లాయర్ ను అనుమతించకపోవడంతో కేటీఆర్ అరగంట పాటు వేచిచూసి తిరిగి వెళ్లిపోయారు. తన విచారణలో లాయర్ ను అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. లాయర్ సమక్షంలో కేటీఆర్ ను విచారణ జరిపి, ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. దాంతో కేటీఆర్ మరోసారి ఏసీబీ ఆఫీసుకు వెళ్లి విచారణకు హాజరయ్యారు. కానీ తిరిగి వెళ్లే సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేశారంటూ ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది.

Also Read: Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి