KTR, Akhilesh Yadav breakfast in hyderabad: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శుక్రవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో చేశారు. ఈ భేటీ రామేశ్వరం కేఫ్ మాధాపూర్ బ్రాంచ్ లో జరిగింది. దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఈ కేఫ్‌లో ఇడ్లీ, దోసెసెలు తిన్నారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సన్నిహిత భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.

Political meet-up over idlis-Dosa! Former #UttarPradesh CM and #SamajwadiParty chief #AkhileshYadav joined #BRS Working President #KTR for lunch at the famous Rameshwaram Cafe in #Hyderabad today. The cafe is a popular Bengaluru-based brand known for its South Indian cuisine. pic.twitter.com/D3N8SADZ8w

— Ashish (@KP_Aashish) December 13, 2025

అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం కేటీఆర్ నంది నగర్ నివాసంలో బీఆర్‌ఎస్ నేతలు టి హరీష్ రావు, ఇతరులతో సమావేశమయ్యారు. శనివారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్ మధ్యాహ్నం లంచ్ కు రామేశ్వరం కేఫ్ కు వెళ్లారు. అక్కడ కేటీఆర్ తో కలిసి లంచ్ చేస్తూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ భేటీలో దేశ రాజకీయ పరిస్థితులు, తెలంగాణ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ టీమ్ నుంచి విడుదల చేసిన వీడియోలో ఇద్దరూ కలిసి టేబుల్ వద్ద కూర్చుని దోసెలు తింటూ కనిపిస్తున్నారు.

Former UP CM @yadavakhilesh had breakfast with BRS Working President @KTRBRS at the popular Rameshwaram Café in Madhapur, Hyderabad. pic.twitter.com/0pkVtivCbO

— KTR News (@KTR_News) December 13, 2025

ఈ భేటీ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలను మరోసారి హైలైట్ చేసింది. అఖిలేష్ యాదవ్ హైదరాబాద్‌లో యాదవ సమాజం సమావేశంలో కూడా పాల్గొన్నారు. రామేశ్వరం కేఫ్, బెంగళూరు నుంచి విస్తరించిన ప్రముఖ చైన్, దక్షిణ భారతీయ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌కు పేరొందింది. ఈ భోజన భేటీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కేటీఆర్ ఉదయం తాజ్ కృష్ణ హోటల్ లో సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో విజన్ ఇండియా సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరిగింది. మొదట సమావేశాన్ని బెంగళూరు లో నిర్వహించిన సమాజ్ వాది పార్టీ.. రెండో సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. టెక్నాలజీతో పాటు వస్తున్న సవాళ్లు, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్న అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఆ తర్వాత లంచ్ మాత్రం తాజ్ కృష్ణాలో చేయకుండా.. రామేశ్వరం కేఫ్ ను ఎంచుకున్నారు. అఖిలేష్ యాదవ్ కు దక్షిణాది వంటకాలంటే ఇష్టం. ఆయన బెంగళూరులోనే ఎక్కువ కాలం చదువుకున్నారు.