Konda Surekha Vs Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక వివాదం తర్వాత ఒక వివాదం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇందులో రెండు వివాదాల్లో మంత్రి కొండా సురేఖ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఉన్న వచ్చిన సమస్యలో కొండా సురేఖ కుమార్తె ఉండటం పార్టీలో మరింత దుమారం రేపుతోంది. ఓ కేసు విషయంలో ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని గుమ్మంలోనే నిలబెట్టి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి ఆమె ప్రైవేటు ఓఎస్డీ సుమంత్‌ గురించి ఆరా తీశారు. కేసు వివరాలు ఏంటో చెప్పకుండా ఆయన్ని ఎలా అప్పగిస్తామని పోలీసులను కొండా సురేఖ కుమార్తె ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అసలు కేసు ఏంటో చెప్పాలని నిలదీశారు. అక్కడే నిలబెట్టి ఏం జరిగిందో ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారో చెప్పాలని అడిగారు.

కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ఆయన డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో ఎవర్నో బెదిరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ అతన్ని విధుల నుంచి తప్పించిందని అంటున్నారు. ఆ కేసులో విచారించేందుకు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

SHOCKING 🚨

A Clash of Extortion from Deccan Cements by Congress Minister Konda Surekha's OSD involving CM Revanth's close aide Rohin brings out a ugly spat in open after Congress Minister Konda Surekha's daughter accuses CM Office involvement in Extortion ... pic.twitter.com/S4vrQslyxX

— Dr.Krishank (@Krishank_BRS) October 15, 2025

సుమంత్‌ను విధుల నుంచి తప్పించిన తర్వాత ఆయన సురేఖ ఇంట్లో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. అందుకే ఆయన్ని పట్టుకునేందుకు సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్కడ ఉన్న సురేఖ కుమార్తె కేసు వివరాలు చెప్పకుండా సుమంత్‌ను అప్పగించడం కుదరదని చెప్పేశారు. చాలా సమయం పోలీసులు అక్కడ ఉండి తర్వాత వెళ్లిపోయారు.

పోలీసులతో వాగ్వాదానికి దిగిన సురేఖ కుమార్తె సుస్మిత తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని ప్రశ్నించారు. కేసు వివరాలు చెప్పకుండా తని కోసం ఎందుకు వెతుకుతున్నారని నిలదీశారు. అసలు పోలీసులు ఎవర్ని అరెస్టు చేయడానికి వచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Big Breaking -

Congress Minister Konda Surekha's daughter obstructs Telangana Police Officers from arresting the Minister's OSD who was removed from the services...

Will Congress Govt book a case against Congress Minister's daughter for obstructing Government Officer from… pic.twitter.com/4LeJhl6Drb

— Dr.Krishank (@Krishank_BRS) October 15, 2025

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ సుమంత్ బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ కుమార్తెకు వివరించారు. దీనిపైనే తాము నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన తాను అలా చేయలేదని చెప్పినట్టు సురేఖ కుమార్తె పేర్కొన్నారు. బీసీలను తొక్కేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మొత్తం ఎపిసోడ్ వెనుక నరేంద్రరెడ్డి, కడియం శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉందని సురేఖ కుమార్తె ఆరోపించారు.ఈ వివాదం నడుస్తున్న క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్‌ను తన కారులోనే బయటకు తీసుకెళ్లారు సురేఖ.