<p>Rayavaram In BR Ambedkar Konaseema District | రాయవరం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బుధవారం నాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటితో పాటు మంటల నుంచి బయటకు రాలేక ఊపిరాడక తీవ్ర కాలిన గాయాలతో ఆరుగురు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాణసంచా కాలడంతో తయారీ కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడ దట్టమైన పొగ అలుముకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పరిస్థితి గమనిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బాణసంచా తయారీ కేంద్రానికి చేరుకుమంటలు ఆర్పేందుకు శ్రమిస్తోంది. </p>