Kishan Reddy Letter To Revanth Reddy: సింగరేణిలో రూ. 1600 కోట్ల బొగ్గు మాయం? సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖపై దుమారం !
4 months ago 11
ARTICLE AD
హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో బొగ్గు నిల్వల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.  ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి, బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జూన్ 10న రాసిన లేఖలో కిషన్ రెడ్డి.. సింగరేణి నుండి దాదాపు రూ. 1600 కోట్ల విలువైన సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనట్లు నివేదికలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు మాయం కావడం, ఇతర అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయని, వీటిపై తక్షణమే దర్యాప్తు జరగాలని కిషన్ రెడ్డి తన లేఖలో కోరారు. ఈ లేఖ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ ఆరోపణలు, విమర్శలకు తెరలేపింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో భారీ అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
"సింగరేణికి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తూ, రూ. 1600 కోట్ల విలువైన బొగ్గు మాయం కావడంపై వస్తున్న నివేదికలను మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిజమైతే, అవి కంపెనీ ఆర్థిక స్థితిగతులను, దాని భవిష్యత్తు వృద్ధిని దెబ్బతీస్తాయని కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.
"తెలంగాణ ప్రభుత్వం నుండి రూ. 51,500 కోట్లకు పైగా బకాయిలు రాకపోవడం వల్ల సింగరేణి ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఆరోపణలు సింగరేణి ఆర్థిక స్థిరత్వాన్ని మరింత దెబ్బతీస్తాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి యాజమాన్యంలో 51:49 ఈక్విటీ నిష్పత్తిలో ఉంది. నిజానిజాలను సరిచూసుకోవాలని, కంపెనీ పర్యవేక్షణ వ్యవస్థలను సమీక్షించాలని, సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలి. ఆరోపించిన అక్రమాలలో ఎంతవరకు నిజం ఉందో, సింగరేణి బోగ్గు నిల్వలకు తగిన రక్షణలు, అంతర్గత నియంత్రణలు ఉన్నాయో లేదో అంచనా వేయడానికి అత్యవసరంగా విచారణ జరపాలని’ పేర్కొన్నారు.
‘సింగరేణిలో కొన్ని బొగ్గు నిల్వల జవాబుదారీతనం లోపించింది, మోసాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించిన నివేదికలు మీడియాలో కనిపిస్తున్నాయి. దాంతో పాటు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, స్థానిక కార్మికులు నాకు లేఖలు రాసి, ఈ సమస్యపై నిజాలు కావాలని కోరారు. తెలంగాణలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతగా నడుచుకుంటూ కేంద్రానికి సహకరించి సింగరేణి అభివృద్ధిలో తోడ్పాడు అందించాలని’ అన్నారు.
ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న సింగరేణిలో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, దేశ ఇంధన భద్రతలో ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తోందని కిషన్ రెడ్డి తన లేఖలో గుర్తుచేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ. 51,500 కోట్లు దాటిపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి సమయంలో రూ. 1600 కోట్ల బొగ్గు కుంభకోణం ఆరోపణలు నిజమైతే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
టెక్నాలజీతో నిఘా పెట్టాలని సూచన
ఈ వ్యవహారంలో పారదర్శకతను నిరూపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రి కోరారు. ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారించడానికి తక్షణ విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ సాధనాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. లోపాలను ముందే గుర్తించేందుకు క్రమబద్ధమైన సమీక్షలు నిర్వహించాలని, తద్వారా సంస్థ విశ్వసనీయతను కాపాడాలని లేఖలో కోరారు.
Read Entire Article