భారత జాతిపిత, మహాత్ముడు గాంధీ మీద నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దాంతో అతను నటించిన 'అరి: మై నేమ్ ఈజ్ నోబడీ' పోస్టర్లు చించి వేయడంతో పాటు అతడిని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. సినిమాను సినిమాగా చూడాలని కోరుతూ ఆర్ఆర్ఆర్ సేన సినిమా పోస్టర్లు అంటించారు. ఆ వివాదం పక్కన పెడితే చిత్ర దర్శకుడికి కేంద్ర మంత్రి నుంచి అభినందన లభించింది.

జయశంకర్‌ను అభినందించిన కిషన్ రెడ్డి!
వార్తల్లో నిలుస్తున్న 'అరి: మై నేమ్ ఈజ్ నోబడీ' చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. 'పేపర్ బాయ్' తర్వాత ఆయన తీసిన చిత్రమిది. మొదటిది లవ్ స్టోరీ అయితే రెండో సినిమాకు మైథలాజికల్ కథను ఎంపిక చేసుకున్నారు. శుక్రవారం (అక్టోబర్ 10న) థియేటర్లలో విడుదలైన చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు... రాజకీయ ప్రముఖుల నుంచి దర్శకుడికి అభినందనలు లభిస్తున్నాయి.

Also Read: సమంత కొత్త ఇల్లు చూశారా? త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఫోటోస్ షేర్ చేసిన బ్యూటీ

'అరి' విడుదలకు ముందు మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సినిమా చూశారు. ఈతరం ప్రేక్షకులకు అర్థం అయ్యేలా మంచి కథతో తీశారని దర్శకుడిని మెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుడు జయశంకర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) నుంచి అభినందలు లభించాయి. ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని ఆయన కొనియాడారు. దాంతో జయశంకర్ హ్యాపీగా ఉన్నారు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్, ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, హర్ష చెముడు, సురభి ప్రభావతి, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ 'అరి'లో ప్రధాన తారాగణం. ప్రతి ఒక్కరిలో కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు ఉంటాయని, వాటిని ఎలా అదుపులో ఉంచుకోవాలో చెప్పే చిత్రమిది. దీనికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడం వల్ల ఇతర భాషల్లోనూ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉంది.

Also Read: రవితేజ బయోపిక్... మాస్ మహారాజా ఓపెన్ అయితే టిల్లు భాయ్ రెడీ!