Kerala hospital emergency room turns into wedding venue: పెళ్ళిళ్లు స్వర్గంలోనే నిర్ణయం అవుతాయని కొంత మంది అంటూ ఉంటారు. ఎక్కడ జరగాలో కూడా అక్కడే నిర్ణయిస్తారని అనుకోవచ్చు. కేరళలో ఈ జంట పెళ్లి చూస్తే అదే నిజమనిపిస్తుంది.

కేరళలోని అలప్పుజాలోని కుమారకాం వద్ద బ్రైడల్ మేకప్ కోసం వెళ్తుండగా మధ్యరాత్రి 3 గంటల సమయంలో కారు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన అవని జగదీష్‌కు హాస్పిటల్ బెడ్‌పైనే తాళి కట్టారు. ఆమె కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్న వీఎమ్ షారన్, ముహూర్తం మిస్ కాకుండా చూసుకోవడానికి VPS లేక్‌షోర్ హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్‌ను వెడ్డింగ్ వెన్యూగా మార్చడానికి అనుమతి తెచ్చుకున్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం అలప్పుజాలోని థుంబోలి వద్ద పెళ్లి జరగాలని ప్లాన్ చేసిన అవని కుటుంబం, బ్రైడల్ మేకప్ కోసం మధ్యరాత్రి 3 గంటలకు కుమారకాం దిశగా బయలుదేరింది. రోడ్డు మీద కారు కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. దీంతో అవనికి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో మొదట కోట్టాయం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. తీవ్రత కారణంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోచ్చిన్‌లోని VPS లేక్‌షోర్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.

അപകടം തളർത്തിയില്ല; ആശുപത്രി വാർഡിൽ മംഗളമുഹൂർത്തം, അവണിക്ക് താലിചാർത്തി ഷാരോൺ

വിവാഹത്തിന് തൊട്ടുമുമ്പ് വധുവിന് വാഹനാപകടത്തിൽ പരിക്കേറ്റതിനെത്തുടർന്ന് കൊച്ചിയിലെ ആശുപത്രി കല്യാണവേദിയായി മാറി. കൊച്ചി ലേക്ക്‌ഷോർ ആശുപത്രിയിലാണ് (Lakeshore Hospital) ഈ അപൂർവ്വ വിവാഹം നടന്നത്.… pic.twitter.com/S1pMlPe6dX

— Kerala9.com News & Gallery (@kerala9) November 21, 2025

పెళ్లి ముహూర్తం మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 వరకు ఫిక్స్ అయి ఉండటంతో, షారన్ , ఇరువైపు కుటుంబాలు పెళ్లిని పోస్ట్‌పోన్ చేయకుండా జరిపించాలని నిర్ణయించాయి. షారన్ హాస్పిటల్ అధికారులను సంప్రదించగా, న్యూరోసర్జరీ టీమ్‌తో కన్సల్ట్ చేసిన తర్వాత అనుమతి ఇచ్చారు. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లోనే, మెడికల్ ఎక్విప్‌మెంట్ తో ఉన్న అవనికి షారన్ తాళి కట్టాడు. డాక్టర్లు, నర్సులు , అవనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు.

కేరళలో అరుదైన ఘటన జరిగింది. ఓ యువకుడు ICUలో ఉన్న యువతికి తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. తంబోలికి చెందిన వీఎం శరణ్‌, అలప్పుళలోని కొమ్మాడికి చెందిన అవనికి శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఈనేపథ్యంలో వధువును అలంకరణ కోసం కుమారకోమ్‌కు తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.… pic.twitter.com/23VaYKiasP

— ABP Desam (@ABPDesam) November 22, 2025

ఈ ఘటన కేరళలోని ఫ్యామిలీ వాల్యూస్, మెడికల్ టీమ్ సపోర్ట్‌ను హైలైట్ చేసింది. ముహూర్తం మిస్ కాకుండా చూసుకునే సంస్కృతి, కష్టాల్లో కలిసి నిలబడే లవ్ – ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. అవని రికవరీలో ఉందని, షారన్ ఆమెకు పక్కనే ఉంటూ కేర్ తీసుకుంటున్నాడని కుటుంబం తెలిపింది.