Several Accused Arrested In Kerala Athlete Abused Case: కేరళలో (Kerala) ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 44 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని.. నిందితుల్లో ఇద్దరు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామని డీఐజీ ఎస్.అజీతా బేగం తెలిపారు. విదేశాలకు వెళ్లిన నిందితులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని.. ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు పంపేలా ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 13 మంది ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని వెల్లడించారు. నిందితులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిట్ పక్కా ఆధారాలతో విచారణ సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: Notices to Zuckerberg: జుకర్ బెర్గ్‌కు ఎంత దైర్యం - బీజేపీ ఓడిపోయిందని ఫేక్ ప్రచారం - నోటీసులు ఇచ్చిన పార్లమెంటరీ కమిటీ !