<p>హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ తనమీద సస్పెన్షన్ వేటు వేయడంతో ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీమానా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. హరీష్ రావు వల్లే ఎందరో పార్టీని వీడారని ఇప్పటికైనా పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ గమనించాలన్నారు. విజయశాంతి, విజయరామారావు అందుకే పార్టీని వీడారని చెప్పారు.</p>
<p>కేటీఆర్‌ను ఎన్నికల్లో ఓడించేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నించారని.. ఆరడుగుల బుల్లెట్ మీకు గాయం చేయాలని చూసింది. సిరిసిల్లలకు రూ.60 లక్షల రూపాయలు సైతం పంపారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి హరీష్ రావు కారణం. ఇప్పటికైనా మన కుటుంబం మీద జరుగుతున్న కుట్రలను గమనించాలని లేకపోతే మరింత డ్యామేజీ జరుగుతుందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. </p>
<p> </p>
<p> </p>