Srikakulam Kasibugga Temple Stampede: కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోయారు. మరో 13 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇదివరకే అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధితులు, వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు శ్రీకాకుళం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08942 240557 నెంబర్లో సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతం, ఆలయంలో రద్దీకి కారణాలు, భక్తుల భద్రత వివరాలు ఆరా తీశారు. నేటి దర్శనాల సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందని అధికారులను, ఆలయానికి సంబంధించిన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుండి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గకు చేరుకున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రులు సమీక్షిస్తారు.

మృతుల వివరాలు
ఎదురు చిన్నమ్మ (50) టెక్కలి మండలం రామేశ్వరం గ్రాం
రాపాక విజయ (48) టెక్కలి మండలం పిటాల సరియా
మురిపింటి లీలమ్మ (60) వజ్రకొత్తూరు మండలం దుక్కువాని పేట
దువ్వ రాజేశ్వరి (60) మందస మండలం బెల్లుపాటియా
చిన్ని యశోదమ్మ (56) నందిగామ, శివరాంపురం
రూప - మందస మండలం గుడ్డబద్ర
లొట్ల నిఖిల్ (13) సోంపేట మండలం బెక్కిలి
మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.