Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 19వ తేదీన) రాత్రికి ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చూడరా మా పరిస్థితి..

సూరజ్‌ని చూసిన జ్యోత్స్న కోపంగా వెళ్లి లాగి పెట్టి సూరజ్‌ని కొట్టి ఎందుకు వచ్చావ్‌రా.. నేను ఎలా ఏడుస్తున్నానో చూడటానికి వచ్చావా.. చూడరా నా కాళ్లు ఏడ్చి ఏడ్చి ఏలా ఎరుపెక్కాయో చూడు... రాత్రి అంతా నిద్ర లేక కళ్ల మీద రక్తపుచారలు ఎలా వచ్చాయో చూడరా.. నా కళ్లముందే నా కుటుంబం నా కారణంగా ఇన్ని బాధలు పడుతుంటే ఏం చేయాలో తెలీక..ఎవరికి సాయం అడగాలో తెలీక.. తల తిరుగుతుందిరా.. నా చేతులు చూడరా.. ఎలా వణుకుతున్నాయో చూడరా.. 3 రోజుల నుంచి ఎక్కడ ఉండాలో తెలీక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాంరా.. ఏదో గుడిలో స్థానం దొరికింది అంటే అదీ పోయింది.. గుడిలో అన్నదానం చేసిన నా కుటుంబం అదే గుడిలో ప్రసాదం తింటూ కడుపునింపుకుంటుంది. ఇలాంటి దేవాలయాలకు ఎన్నో విరాళాలు ఇచ్చిన కుటుంబం నా కారణంగా అవమానం పడుతుంది. ఏంటి ఇది తప్పులన్నీ నీ వల్ల అనకుండా నా వల్ల అంటున్నా అనుకుంటున్నావా.. నిన్ను నమ్మి నేను మనసిచ్చా కాబట్టి నిన్ను అల్లుడిలా చూశారు.. గుడ్డిగా నమ్మారు. నా కంటే ముందు తప్పు ఎక్కడ జరిగింది అంటే దీప, బావ నిన్ను నమ్మడం.. తప్పులన్నీ మేమే చేశాం కానీ పాపలు మీరు చేశారు.. నువ్వు కత్తితో పొడిస్తే ఒక్కసారి చనిపోయేదాన్ని కానీ ఇలా క్షణం క్షణం చంపేస్తున్నావ్‌.. నాకు తెలిసి గుడిలో కూడా గెంటేయడానికి నువ్వే కారణం అని అంటుంది. ఇంత పగ ఎలా పడతారురా.. అని జ్యోత్స్న అంటుంది. సూరజ్ తనని తాను సమర్థించుకొని జ్యోత్స్న చేతిలో తన ఫోన్ పెట్టి ఇది నీకు చాలా అవసరం అని చెప్పి వెళ్లిపోతాడు.

తాత బతకడు దీప..

కార్తీక్, దీపలు జరిగింది తలచుకొని బాధ పడతారు. ఇదంతా మాలిని పిన్ని పనే దీప. లేదంటే ధర్మకర్తకి గుడిలో ఉన్న వీళ్ల గురించి ఎలా తెలుస్తుంది. పిన్ని పగ ఇంకా తీరలేదు.. నాకు తెలిసి వీళ్లు ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి.. మాలిని పిన్ని వెంటాడుతూనే ఉంటుంది. తాతకి పరువే ప్రాణం.. వెళ్లిన ప్రతీ చోట ఇలా అవమానం జరిగితే తాత బతకడు దీప అని కార్తీక్ అంటాడు.

కార్తీక్ నాటకం మొదలు..

కార్తీక్ శివన్నారాయణ ఫ్యామిలీ దగ్గరకు వెళ్లి ఏంటి తాత ఇది చిన్న గొడవలకే ఇలా వచ్చేశారు అని అడుగుతాడు. వీధిలో అందరూ వచ్చి ఏమైంది అంటే వీళ్లు నా భార్య కుటుంబం.. ఆయన నా భార్య తాత.. వాళ్లు నా భార్య కన్నతల్లిదండ్రులు.. ఆవిడ నా భార్య చెల్లి, నానమ్మ.. ఇప్పుడు ఏదో చిన్న గొడవకి వీళ్లు మా ఇంటికి రావడం లేదు అని అందరితో చెప్తారు. శివన్నారాయణ ఏంట్రా ఇది ఎక్కడికి వెళ్లినా వదలవా అని అంటాడు. బావ వదిలేయ్ అని జ్యోత్స్న అంటే ఏంటి జ్యోత్స్న వదిలేది నా చెల్లి చాలా బాధ పడుతుంది అని మీ అక్క బాధ పడుతుంది అని చెప్తాడు. ఇక కార్తీక్ అక్కడున్న 5 మందిని పెద్దమనుషులుగా నటించమని అంటారు. ఇద్దరూ ఇంటికి రమ్మని పెద్దాయన్ను బతిమాలుతారు.

పోలీస్ ఎంట్రీ..

ఇంతలో కార్తీక్‌ ఫ్రెండ్‌ అయిన ఓ పోలీస్‌ ఎంట్రీ ఇస్తాడు. అంతా విన్నాను.. ఏంటి ఇది మీ మనవడు రమ్మంటే వెళ్లరేంటి అని పోలీసులు అడుగుతారు. ఇలా రోడ్ల మీద పడి తిరిగితే దొంగలు అంటారు. మేం అదే పనిలో తిరుగుతున్నాం.. ఇప్పుడు దొంగలు ఎక్కువయ్యావి ఇలా తిరిగితే మేం కేసు పెడతాం అని పోలీస్ అంటాడు. ఏమైనా ఉంటే ఇంటి దగ్గరకు వెళ్లి మాట్లాడుకోండి.. లేదంటే పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్తాం అని ఆయన అనడంతో దశరథ్, పారు వెళ్దాం పదండి అని కార్తీక్, దీపలు అందర్ని తీసుకెళ్తారు. పోలీస్‌ వాళ్లతో పాటు వెళ్తాడు. పోలీస్‌ వాళ్లతో నేను వెళ్లిపోయిన తర్వాత మీరు వెళ్లిపోతే మిమల్ని దొంగలు అనుకుంటారు. అరెస్ట్ చేస్తారు. పెళ్లికాని ఆడపిల్లని ఆడవాళ్లతో తిరగడం తప్పు.. మీ పెద్ద అల్లుడు మంచోడిలా ఉన్నాడు ఇక్కడే ఉండండి.. ప్రతి రోజు ఉదయం వీళ్లు ఉన్నారు అని నువ్వు నాకు మెసేజ్ చేయాలి.. వాళ్లు లేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తా అని కార్తీక్‌తో పోలీస్ అంటాడు. కార్తీక్ తన ఫ్రెండ్‌తో పక్కకి వెళ్లి మాట్లాడి.. అయిన వాళ్లే రాజులా బతికిన కుటుంబాన్ని బికారుల్ని చేశారు అని మొత్తం చెప్తాడు. సూరజ్ ఆవేశంగా తల్లి దగ్గరకు వెళ్లి జ్యోత్స్న కుటుంబాన్ని నడి రోడ్డు మీదకు ఎందుకు లాగావ్ అని ప్రశ్నిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.