Karthika Deepam 2 Serial Today March 4th: కార్తీకదీపం 2 సీరియల్: నా కూతుర్ని కొట్టడానికి నువ్వు ఎవరే? ఆధారాలు తీసుకురా.. దీపపై సుమిత్ర ఫైర్!
9 months ago 7
ARTICLE AD
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్నని దీప చావబాదుతుంది. మతిలేని దానిలా అరుస్తూ నా కూతురిని ఎందుకు కొడుతున్నావ్ అని సుమిత్ర దీపని కొట్టి అడుగుతుంది. రౌడీలు తనని చంపాలని చూశారని తనకు మత్తు పెట్టింది జ్యోత్స్ననే అని దీప చెప్తుంది.
శివన్నారాయణ: అయితే నువ్వు ఇంకా ఆ మత్తులోనే మాట్లాడుతున్నావ్.
దీప: లేదు తాతయ్య  గారు.
సుమిత్ర: లేకపోతే ఏంటే ఉదయం నుంచి నా కూతురు నా గదిలోనే ఉంది. నేను దగ్గరుండి దానికి సేవలు చేశాను. నా కూతురు నా దగ్గర ఉంటే నీ కూతురిని చంపడానికి వచ్చిన మనుషులు ఎవరు. నీ కూతురు ఎవర్ని చూసింది.
దీప: జ్యోత్స్ననే.
సుమిత్ర: నీ కూతురు ఎవర్ని చూసిందో
దీప: నా కూతురు అబద్ధం చెప్పదు.
సుమిత్ర: నా కూతురు చెప్పదు.
దీప: మరి నా కూతురు చూసింది ఎవర్ని
సుమిత్ర: అది వెళ్లి నీ కూతుర్ని అడుగు.
దశరథ్: మనసులో దీప చెప్పేసి మామూలుగా అయితే నేను నమ్మేవాడిని కానీ ఉదయం నుంచి జ్యోత్స్న ఇంట్లోనే ఉందిగా. అలా ఉండటం వెనక ఏదైనా ప్లాన్ ఉందా.
శివన్నారాయణ: ఇది వరకు నీ మీద ఇలాంటి దాడే జరిగింది అని విన్నాను. అది నీ భర్తే చేయించాడు కదా. అదే నీ మాజీ భర్తే చేశాడు కదా.
దీప: నేను అలాగే అనుకున్నా తాతయ్య గారు జ్యోత్స్నని నా కూతురు చూడకపోయి ఉంటే అదే నిజం అనుకునేదాన్ని.
జ్యోత్స్న: చూశావా మమ్మీ నేను నీ కళ్లు ముందే ఉన్నా దీప నా మీద ఇలాంటి నిందలు వేసింది. ఇప్పటికే నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నీ ముందే నన్ను కొడుతుంది.
దీప: నాటకాలు ఆడితే మరో నాలుగు తగులుతాయి.
సుమిత్ర: దీప నా కూతురి మీద చేయి వేస్తే నేను ఊరుకోను.
దీప: నా కూతిరి జోలికి వస్తే నేను ఊరుకుంటానా.
సుమిత్ర: నా కూతురి ఇంట్లో లేకపోయి ఉంటే నీ మీద నమ్మకంతో అయినా ఏం జ్యోత్స్న దీప చెప్పేది నిజమేనా అని అడిగేదాన్ని. కానీ అది ఉదయం నుంచి నా కళ్ల ముందే ఉంటే ఏమని అడగాలి. ఎలా నమ్మాలి.
దీప: పోలీసులకు అప్పగిస్తే వాళ్లే నమ్మిస్తారమ్మా. ఈవిడ మీ కూతురు కాదు. మనుషుల్ని చంపడానికి తెగించిన ఓ హంతకురాలు.
శివన్నారాయణ: దీప ఇక్కడితో ఆగకపోతే నిన్ను అరెస్ట్ చేయిండానికి నేను పోలీసుల్ని పిలిపించాల్సి ఉంటుంది. ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు నీ భర్తకి ఎలాంటి హక్కు లేదు. సరే ఏదో ఆవేశంతో ఉన్నావ్ అని అనుకుంటే ఎవరితో మాట్లాడాలి ఇంటి పెద్ద నేను ఇంకా బతికే ఉన్నాను కదా.
దీప: కులాశాగా మాట్లాడటానికి ఇది మామూలు విషయం కాదు తాతయ్య గారు ఈ జ్యోత్స్న నా కూతుర్ని చంపాలి అనుకుంది.
అందరూ సాక్ష్యం అడుగుతారు. జ్యోత్స్న చూశావా అని అడుగుతారు. లేదని దీప అంటుంది. జ్యోత్స్న తప్పు చేసింది అనడానికి ఆధారం ఏంటి అని అంటారు. ఇది నిజం అయితే నిరూపించు అంటారు. నేనే ఎప్పుడూ నా మనవరాలిని కొట్టలేదు నువ్వు నా ఇంటికి వచ్చి నా మనవరాలిని కొట్టావ్ నిన్ను అస్సలు క్షమించను.. నా మనవరాలికి అన్యాయం చేసిందే నువ్వు.. నీ మాజీ మొగుడే చంపాలి అనుకొని ఉంటాడని శివన్నారాయణ అంటారు. నా మనవరాలని పోలీసులకు అప్పగిస్తా అంటావా. సుమిత్ర కంటే నేనే నీ చెంప పగల గొట్టాల్సింది ఛీ ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఏ గొడవకు పద్ధతి ఉండదు అని తాతగారు దీపని తిడతారు. ముందు వేసిన నిందకు ఆధారాలు చూపించకపోతే నేనే నిన్ను జైలులో వేస్తానని తాత అంటారు. ఆధారాలు తీసుకొస్తాను అని దీప అంటాడు. సుమిత్రతో పాటు అందరూ దీపని పొమ్మని అంటారు. ఆధారాలు తీసుకొస్తా అప్పుడు నిన్ను మీ అమ్మా తాత, నాన్న ఆ దేవుడు కూడా బతికించలేదని దీప ఛాలెంజ్ చేసి వెళ్తుంది. దీప వెళ్తుంటే దశరథ్ దీప దగ్గరకు వస్తాడు.
దీప: మీరు అనాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా
దశరథ్: నువ్వు చెప్పాలి అనుకున్నది నాకు అర్థమైంది నువ్వు ఇప్పుడు జ్యోత్స్న చేసిన దానికి సాక్ష్యాలు తీసుకొస్తే రెండు కుటుంబాలు ఇక జీవితంలో కలవు. శౌర్య చూసిన దానిలో ఏమైనా పొరపాటు జరిగితే ఇప్పుడు జరిగింది అంతా నువ్వు వెనక్కి తీసుకోలేవు. జ్యోత్స్న పెళ్లితో రెండు కుటుంబాలను కలపాలి అన్నది నా ఆశ. ఆలోచన ఇప్పుడు ఏం చేస్తే నేను అనుకున్నది జరుగుతుందో ఆలోచించు. ఏం జరిగిందో నాకు తెలీదు. నువ్వు అనుకున్నదే అయితే నా కూతురు తరఫున నన్ను క్షమించమ్మా. ఏం చేస్తే ఈ రెండు కుటుంబాలు కలుస్తాయో కాస్త ఆలోచించు అమ్మా.  తప్పు చేసిన వాళ్లకి దేవుడు శిక్ష వేస్తాడు. ఏం చేసినా నా చెల్లిని దృష్టిలో పెట్టి చేయ్. వెళ్లమ్మా.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: చెల్లిని చావగొట్టిన దీప.. కన్నకూతురి చెంప పగలగొట్టిన సుమిత్ర.. దీప విశ్వరూపం!
Read Entire Article