Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode | బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జూన్ 17న) రాత్రికి ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదీ పద్ధతి అంటే..

జ్యోత్స్న తనకి వచ్చిన ఆర్డర్ వదులుకోవడంతో ఆ ఆర్డర్‌ని దీప దక్కించుకుంటుంది. రేపటి 1000 మందికి భోజనాలు ఇవ్వమని అడగటంతో దీప సరే అంటుంది. అందుకు పది లక్షలు అడ్వాన్స్ తీసుకుంటుంది. కస్టమర్ అడ్రస్‌ వివరాలు రాసుకుంటుంది. కస్టమర్ జ్యోత్స్నని చూసి ఇది పద్ధతి అంటే.. కొందర్ని చూసి కొందరు నేర్చుకోవాలి అని అంటాడు.

వాతావరణం ఏంటి వేడిగా ఉంది..

జ్యోత్స్న కోపంగా ఉంటే కార్తీక్ అప్పుడే వచ్చి ఏమైంది వాతావరణం వేడిగా ఉంది అని అంటాడు. దానికి దీప సంతోషంగా బావ ఆర్డర్ వచ్చింది.. వెయ్యి మందికి అని అంటుంది. కార్తీక్ కాంగ్రాట్స్ చెప్పడానికి చేయి అందిస్తే వద్దు అన్నట్లు జ్యోత్స్న బావ అని అరుస్తుంది. కంగ్రాట్స్ చెప్పడం తప్పు కాదు.. కదా అయినా వాతావరణం వేడిగా ఉంది అంటే ఏసీ ఆపేశారు అనుకున్నా కానీ కొందరి కడుపు మంటా అని కార్తీక్ సెటైర్లు వేస్తాడు. జ్యోత్స్న కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జ్యోత్స్న వెనకాలే సూరజ్ వెళ్తాడు. కార్తీక్ దీపకి పార్టీ అడుగుతాడు. ఇంటికి వెళ్లాక ఇస్తా అని దీప అంటే సిగ్గు పడినట్లు చూస్తాడు. దాంతో దీప స్వీట్ చేసి ఇస్తా బావ అని అంటుంది. క్లారిటీ ముఖ్యం లేదంటే అందరూ వేరే అనుకుంటారు అని దీపని ఆటపట్టిస్తాడు.

నువ్వేంటో నాకు తెలుసురా..

జ్యోత్స్న కేఫ్ దగ్గరకు వెళ్లి కాఫీ తెచ్చుకొని పక్కన పెట్టుకొని ఫోన్ చూస్తుంటే సూరజ్ వచ్చి ఆ కాఫీ తీసుకుంటాడు. నా కాఫీ నువ్వు తీసుకున్నావేంటి అని జ్యోత్స్న అంటే దీని మీద ఎవరి పేరు రాసుంటే వాళ్లదే అని అంటాడు. కోతల రాయుడా మాటలు ఆపరా.. నువ్వు స్మార్ట్.. ఇన్నోసెంట్ అని అందరూ అనుకుంటున్నారు కానీ నువ్వు ఏంటో నాకు తెలుసు అని జ్యోత్స్న అంటుంది. దానికి సూరజ్ కాసేపట్లో నాకు మీ తాత నుంచి ఫోన్ వస్తుంది రెడీగా ఉండు అని అంటాడు. ఎందుకు అని జ్యోత్స్న అడిగితే వీడియో మీ తాతకి పంపించాను అని సూరజ్ అంటాడు. జ్యోత్స్న షాక్ అయిపోతుంది.

చిన్నప్పుడే మంచి డాక్టర్‌ని చూపించాల్సింది..

ఎవరీ పంపను అని మాటిచ్చావ్ కదరా అని జ్యోత్స్న అంటే నేనేం మాట ఇవ్వలేదు.. నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్తా అని అన్నాను అంతే ఇప్పుడు వీడియో మీ తాతకి ఇచ్చాను అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలి అని అలా చెప్పా అని అంటాడు. నువ్వు ఇంత పెద్ద శాడిష్ట్‌వి ఏంట్రా.. చిన్నప్పుడే నిన్ను ఎవరైనా మంచి డాక్టర్‌కి చూపించాల్సింది.. వదిలేసి తప్పు చేశారు అని జ్యోత్స్న అంటుంది. అసలు ఎవర్రా నువ్వు మా తాతని నన్ను కాపాడినట్లు నటించి మా అవుట్ హౌస్‌లో ఉండాల్సిన అవసరం ఏంట్రా అని అడుగుతుంది. కాఫీ తాగుతావా అని సూరజ్ అడుగుతాడు. దానికి జ్యోత్న్న నేను అడుగుతుంది ఏంటి నువ్వు అడుగుతుంది ఏంటి అని అంటుంది. నీకు అడగాలి అనిపించింది అడిగావ్.. నాకు చెప్పాలి అనిపిస్తే చెప్తా అని అంటాడు.

నీకు టైం దగ్గర పడిందిరా..

నీకు టైం దగ్గర పడిందిరా అని జ్యోత్స్న అంటే అవును పెద్ద ఆర్డర్ వచ్చింది కదా అని అంటాడు. ఈ కాంట్రాక్ట్ నువ్వు తీసుకొని ఉంటే నువ్వే ఈ పోటీలో గెలిచేదానివి అని సూరజ్ అంటాడు. దానికి జ్యోత్స్న దీప మా ఇంట్లో వంటలు చేసుకునేది.. నువ్వు జ్యూస్‌లు అమ్ముకునేవాడివి మీకు ఇది పెద్దదే కానీ నాకు కాదు.. కార్పొరేట్ సంస్థల్లో సంవత్సరానికి కాంట్రాక్ట్ తీసుకుంటే నేను పెట్టే సంతకానికి కనీసం విలువ ఉన్నట్లు అని జ్యోత్స్న అంటుంది. దాంతో సూరజ్ ఆల్‌ది బెస్ట్ అని చెప్తాడు.

నాకు ఎవరి సాయం అవసరం లేదు..

నా టైం సార్ట్ అయింది నాకు ఎవరి సాయం అవసరం లేదు.. నన్ను ఎవరూ ఆపలేరు అని జ్యోత్స్న వెళ్తూ కాలు జారి పడిపోతుంది. సూరజ్ అలా చూస్తూ ఉంటే కనీసం సాయం చేయవా ఏంట్రా అని అడుగుతుంది. ఇప్పుడే కదా ఎవరి సాయం వద్దు అన్నావ్ అయినా ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అని సూరజ్ అంటే ఈ విషయం ఎవరికైనా చెప్పావు అంటే ఊరుకోను అని జ్యోత్స్న అంటుంది. నీ డ్రస్ చాలా బాగుంది అని సూరజ్ అంటాడు. జ్యోత్స్న కోపం అవుతూ ఉంటే చందమామ కంటే నువ్వు చాలా అందంగా ఉంటావ్ అని అంటాడు. నీతో ఉంటే నా బుర్ర పాడైపోతుంది.. నేను పోతా.. నేను పడిపోయినట్లే ఎవరికైనా చెప్తే ఊరుకోను అని అంటుంది. నా మాట గోడ అని సూరజ్ అంటే దూకకుండా ఉండు చాలు అని జ్యోత్స్న అంటుంది.

మొగుడు పెళ్లాలు ఎక్కడికో పోయారు..

జ్యోత్స్న కుంటుకుంటూ వచ్చి దీప లేకపోవడం చూసి ఈ మొగుడు పెళ్లాలు ఎక్కడికో పోయారు అనుకుంటుంది. ఇక జ్యోత్స్న దగ్గరకు పెద్దాయన వచ్చి జ్యోత్స్న కింద పడిపోయావ్ అంట ఎలా ఉంది అని అడుగుతాడు. సూరజ్ చెప్పాడు అని జ్యోత్స్న తిట్టుకుంటుంది. తర్వాత కార్తీక్ వచ్చి పెద్ద మేడం పెద్డ మేడం గారు జారి కింద పడ్డావు అంటాడు. దీప కూడా వచ్చి నాకు తెలుసు అంటుంది. ఇక కార్తీక్ జ్యోత్స్న మీద సెటైర్లు వేస్తాడు. నీ మోకాలికి దెబ్బ తగిలి గతం మర్చిపోయి ఉంటే నీకు గతం గుర్తు చేయలేక నేను పోయే వాడిని అని కార్తీక్ అంటాడు. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు బావ అని జ్యోత్స్న అడిగితే లోకమే కోడై కూస్తుందని అంటాడు. తర్వాత మేనేజర్ వంశీ కూడా వచ్చి మేడం దెబ్బ తగిలిందా అని ఏడుస్తాడు. తర్వాత జ్యోత్స్నకి సుమిత్ర కాల్ చేసి కింద పడ్డావ్ అంట ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. అందరూ వరస పెట్టి అడగటంతో జ్యోత్స్న చాలా ఫ్రస్టేట్ అవుతుంది. ఇదంతా సూరజ్ పనే అని రగిలిపోతుంది. ఇంతలో ఫ్యూన్ వచ్చి రెస్టారెంట్ స్టాఫ్ మొత్తం బొకే తీసుకొని వస్తామని అంటున్నారు అని చెప్తే జ్యోత్స్న చాలా చిరాకుపడుతుంది.

రేయ్ ఎందుకు చెప్పావురా..

సూరజ్ ఫోన్ చూసి నవ్వుకుంటూ ఉంటే జ్యోత్స్న వెళ్లి రేయ్ ఎందుకు చెప్పావురా.. అని తిడుతుంది. మనసులో ప్రేమ ఉంటేనే మాటల్లో తిట్లు వస్తాయి అని సూరజ్ అంటాడు. అయినా ఎవరైనా నేను నువ్వు కింద పడిపోయాను అని చెప్పారా.. నేను అయితే ఎవరికీ చెప్పలేదు అని సూరజ్ అంటే అయితే ఏం చేశావ్ చెప్పు అని జ్యోత్స్న అంటుంది. దాంతో సూరజ్ నీలా ఇంకెవరూ పడిపోకూడదు అని మన గ్రూప్‌లో పెట్టానని అంటాడు. నీకో దండంరా బాబు..అని జ్యోత్స్న అంటుంది. ఇక దీప తన వాళ్లకి పిలిచి క్యాటరింగ్ గురించి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.