Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(ఆగస్టు 19న) రాత్రికి ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రుజువులు అడుగుతాడు చూడు..

జ్యోత్స్నతో దీప, కార్తీక్‌లు లవ్ గురించి చెప్పావా అంటే చెప్పాను కానీ తను ఫోన్ మాట్లాడుకుంటూ వినలేదు.. అని జ్యోత్స్న చెప్తుంది. వినే వరకు చెప్పాలి కదా.. అని దీప, కార్తీక్ అంటారు. నేను ఒక మెట్టు దిగుతూ మాట్లాడుతూ ఉంటే.. వాడు ఒక మెట్టు ఎక్కుతున్నాడు.. నా మనసు మారాలి అన్నాడు మారాను.. నేను ఎంత మారానో మీకు అర్థమవుతుంది.. కానీ సూరజ్‌కి అర్థమవ్వడం లేదు.. నా మనసులో మాట చెప్పాలి అనుకున్నా కానీ ఛాన్స్ ఇవ్వడం లేదే.. సూరజ్ అసలు నాకు చెప్పనివ్వలేదు.. నా మాటలు గోడలకు తప్ప ఎవరికీ వినాలి అని లేదు అని జ్యోత్స్న అంటుంది. భర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సూరజ్ వస్తాడు.. అది తన కోసమే అని తనకి తెలీదు.. అందరి ముందు చెప్పు అని కార్తీక్ అంటాడు. చెప్తాను కానీ రుజువు అడిగితే ఏం చూపించాలి అని జ్యోత్స్న అంటుంది. దీప, కార్తీక్‌లు నిజమే కదా.. అనుకుంటారు.

Also Read: Balakrishna Koratala Siva Movie - కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?

నేనే రమ్మని చెప్పా..

సూరజ్ పుట్టిన రోజు కోసం జ్యోత్స్న అన్ని ఏర్పాట్లు చేస్తుంది.. అందరూ సూరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో దాసు వస్తాడు. నువ్వు వచ్చావేంట్రా అని పారిజాతం అడిగితే మనకి ఏమైనా మంచి జరిగితే అయినవాళ్లు అందరూ ఉంటే మంచిది.. నా కూతురికి మంచి జరుగుతుంటే నా తమ్ముడు ఉండాలి అని కార్తీక్ పిలిచాడు అని దశరథ్ అంటాడు. ఇంతలో సూరజ్ వస్తాడు. తన పుట్టిన రోజు కోసమే ఏర్పాటు చేశారని తెలుసుకొని షాక్ అవుతాడు. జ్యోత్స్ననే అంతా చేసిందని తెలుసుకొని నాకు ఇలాంటివి నచ్చవు అని అంటాడు. కార్తీక్ జ్యోత్స్నతో ఇంత కంటే మంచి టైం రాదు అని మనసులో మాట చెప్పమని అంటాడు. భర్త్‌డే కంటే ముందు ఇక్కడ ఇంకో విషయం జరుగుతుంది అని చెప్పి సూరజ్‌ని జ్యోత్స్న ముందు నిలబెడతాడు.

నువ్వంటే నాకు ఇష్టం..

దీప జ్యోత్స్నకి మనసులో మాట చెప్పమని అంటుంది. జ్యోత్స్న సూరజ్‌తో నీతో ఒకటి చెప్పాలి.. సూరజ్.. నేను మనుషుల్ని పుస్తకం చదివినట్లు చదవలేను.. నాకు ఎదుటి వాళ్ల గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన కానీ అలవాట్లు కానీ లేవు.. కానీ నీ కోసం తెలీకుండానే తెలుసుకున్నాను.. నీలాంటి తెలివైన మనిషికి నా ప్రయత్నం అర్థం కాకపోవడం ఏంటో.. నేను ఈ ఇంట్లో ఈ తరం ఆడపిల్లని.. చాలా గారాబంగా పెంచారు.. దేనికీ లేటు లేదు.. ఇవ్వడమే తప్ప తీసుకోవడం లేదు.. నాకు ఇది కావాలి అని ఏ రోజు ఎవరినీ అడిగింది లేదు.. జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు అని మా బావ దీప చెప్పేవరకు అర్థం కాలేదు.. అందుకే అందరి ముందు నీకు ఓ మాట చెప్పాలి అనుకుంటున్నాను..దాన్ని ఎవరు ఎలా తీసుకుంటారో .. ఎవరు ఎంత వరకు నమ్ముతారో నాకు తెలీదు.. నాకు తెలిసింది ఒక్కటే నాకు అనిపించింది చెప్పడం.. నా చుట్టూ ఉన్న వాళ్లంతా నా వాళ్లు.. నా మేలు కోరుకునే వాళ్లు.. నా సొంతవాళ్లు.. నా కన్నవాళ్లు.. నా సంతోషం కోసం ఆలోచించేవాళ్లు.. నా కోసం ఏదైనా చేసేవాళ్లు.. నేను తప్పు చేస్తే సరి దిద్దే వాళ్లు.. నేను మంచి చేస్తే మెచ్చుకునేవాళ్లు.. నేను భయంతో ఉంటే ధైర్యం చెప్పేవాళ్లు.. ఇలాంటి వాళ్లు ముందు నేను ఏం చెప్పడానికి అయినా ఆలోచించాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా చెప్పగలను.. సూరజ్ నువ్వంటే నాకు ఇష్టం.. మీ అందరికీ చెప్తున్నా సూరజ్ అంటే నాకు ఇష్టం.. సూరజ్‌తో జీవితాంతం బతకగలను అన్న నమ్మకం నాకు ఉంది.. నా మనసు ఇది అని ఇంత కంటే బాగా నేను చెప్పలేను.. తాత నేను చెప్పాల్సింది చెప్పాను.. నేను అంటే ఇష్టమో కాదో సూరజ్ చెప్పాలి అని జ్యోత్స్న అంటుంది.

Also Read: Ravi Teja Irumudi Censor Review - 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

జ్యోత్స్న అంటే నాకూ ఇష్టమే..

పెళ్లే అంటే ఇష్టం లేదు అని చెప్పిన మనిషి అందరి ముందు తన మనసులో మాట చెప్పింది.. నువ్వు నీ మనసులో మాట చెప్పు అని దశరథ్, పెద్దాయన అంటారు. దీప, కార్తీక్‌లు కూడా సూరజ్‌కి నీ మనసులో మాట చెప్పు అని అడుగుతారు. దాంతో సూరజ్ జ్యోత్స్నని చూసి నాకు జ్యోత్స్న అంటే ఇష్టమే.. తనని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు.. తన మాటల వల్ల కాదు కళ్లని చూస్తే నాకు ప్రేమ అర్థమవుతుంది. ఆ రోజు మీ అందరితో చెప్పాను నేను తన మనసులో లేను అని చెప్పాను.. ఇప్పుడు చెప్తున్నా నేను మాత్రమే తన మనసులో ఉన్నాను.. తన ప్రేమ నాకు స్పష్టంగా తెలుస్తుంది. మీ అందరి ఆశీర్వాదంతో తనతో కలిసి బతకాలి అనుకుంటున్నా అని అంటాడు. అందరూ క్లాప్స్‌ కొట్టి కంగ్రాట్స్ చెప్తారు.

ఈ రోజు నేను పుట్టినట్లు ఉంది..

శివన్నారాయణ సంతోషంలో కన్నీరు పెట్టుకొని ఈ రోజు నా సూరజ్ నిజంగానే నా చిన్న మనవడు అయిపోయాడు.. పెద్ద మనవడు కార్తీక్, చిన్న మనవడు సూరజ్.. పెద్ద మనవరాలు దీప, చిన్న మనవరాలు జ్యోత్స్న అని అంటాడు. అందరూ సంతోషంగా సూరజ్‌ పుట్టిన రోజు కేక్‌ కట్ చేస్తారు. పెద్దాయన సూరజ్‌తో ఎవరికి ఇష్టమైతే వాళ్లకి పెట్టు అని అంటే నాకు అన్నయ్య కార్తీక్, వదిన దీప వాళ్లకే ముందు తినిపిస్తా అని సూరజ్ అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి ఎందుకులే అని అంటాడు. దీన సూరజ్‌తో ముందు అన్నయ్య తర్వాత వదిన ఆ తర్వాత కాబోయే అత్తామామలు అనుకుంటూ వెళ్తే జ్యోత్స్నకి ఎప్పుడు తినిపిస్తావ్.. ముందు జ్యోత్స్నకి తినిపించు అంటాడు. సూరజ్ సిగ్గు పడుతూ జ్యోత్స్నకి తినిపిస్తాడు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. సీన్ చూస్తే శుభం కార్డు వేసేస్తారేమో అనిపించేలా ఉంటుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title=" ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self"> ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.