Rishab Shetty Kantara Chapter 1 OTT Deal Locked: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి అవెయిటెడ్ డివోషనల్ పీరియాడిక్ డ్రామా 'కాంతార చాప్టర్ 1'. 2022లో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా... రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బిజినెస్ డీల్ జరగ్గా... డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఓటీటీ డీల్ ఎంతో తెలుసా?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.125 కోట్ల మేర డీల్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఇది కేవలం సౌత్ లాంగ్వేజెస్ వరకేనా లేక హిందీ భాషకు కూడా కలిపేనా అనేది తెలియాల్సి ఉంది. అటు, తెలుగు రాష్ట్రాల్లోనూ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.100 కోట్లకు ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా... ఇది టాలీవుడ్ టాప్ హీరోల పెద్ద చిత్రాల బడ్జెట్‌కు సమానం. నైజాంలో రూ.40 కోట్లు, కోస్తాంధ్రలో రూ.45 కోట్లు, సీడెడ్‌లో రూ.15 కోట్లకు డీల్ కుదిరినట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read: కట్టె కాలే వరకూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే నా లైఫ్ - 'కిష్కింధపురి' అసలైన గూస్ బంప్స్ అన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్