Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక, సుభాష్ కలిసి విహారి పరువు పోయేలా విహారికి చెందిన కంపెనీల్లో నలుగురు ఐదుగురు చనిపోయేలా ప్లాన్ చేసి ఆ నింద మ్యానేజ్మెంట్ మీద పడేలా చేస్తే విహారి జైలుపాలవుతాడని ప్లాన్ చేస్తారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానని సుభాష్‌ అంటాడు.

లక్ష్మీ దగ్గరకు యమున వెళ్లి బయటకు వెళ్దాం రా అని అంటుంది. ఎక్కడికి అమ్మా అని లక్ష్మీ అడిగితే లాయర్ దగ్గరకు వెళ్దామని అంటుంది. నువ్వు సంతకాలు పెట్టిన పేపర్లు తీసుకెళ్లి లాయర్‌కి నువ్వు అడిగినట్లు విడాకులు అడుగుదాం త్వరగా రా మళ్లీ ఎవరైనా చూస్తారని పొద్దు పొద్దున్నే లక్ష్మీని తీసుకొని యమున వెళ్తుంది. పద్మాక్షి, అంబికలు రావడం చూసి ఇద్దరూ దాక్కొని వెళ్తారు.

అంబిక పద్మాక్షితో అక్క లక్ష్మీని ప్రకాశ్‌తో పంపేస్తా అన్నావ్ కదా అని అంటుంది. పద్మాక్షి ప్రకాశ్‌ని పిలిచి నీ భార్యని తీసుకెళ్లాలి గుర్తుందా అని అంటుంది. నేను రెడీ కానీ నా లక్ష్మీ లేదు అని అంటాడు. లక్ష్మీ లేదా ఎక్కడికి వెళ్లింది వెళ్లడం ఇష్టం లేక ఎక్కడికో వెళ్లిపోయినట్లు ఉందని అంబిక అంటుంది. దానికి ప్రకాశ్ ఈ ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టం లేదు ఇళ్లు నచ్చిందో లేక ఇంట్లో ఎవరైనా నచ్చారో అని అంటాడు. అప్పుడే విహారి వచ్చి ప్రకాశ్ లక్ష్మీ గురించి ఏం మాట్లాడుతున్నావ్‌రా లక్ష్మీ గురించి ఒక్క తప్పు మాట మాట్లాడినా మెడకాయ్ మీద తలకాయ్ ఉండదు అని అంటాడు. ఇంతలో అందరూ వస్తారు. లక్ష్మీ ఎక్కడికి వెళ్లిందా అనుకుంటారు. యమన కూడా లేదని తెలియడంతో పద్మాక్షి కోపంగా గురుశిష్యులు ఇద్దరూ ఎక్కడికి వెళ్లారు.. అని గన్‌ తీసి ఎలా ఈ రోజు ఇంటి నుంచి వెళ్లదో నేను చూస్తానని అంటాడు.

యమున లక్ష్మీని తీసుకొని లాయర్ దగ్గరకు వెళ్తుంది. వాళ్లు వెళ్లి ఏరియాలో సుభాష్‌ కూడా ఉంటాడు. లాయర్ ఇంటికి కోర్టు నోటీస్ వస్తుందని చెప్తారు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా నోటీస్ మేం తీసుకుంటాం.. కానీ మీరు విషయం ఎవరికీ చెప్పొద్దని యమున లాయర్‌తో చెప్తుంది. ఇక లక్ష్మీ విహారికి ఎలా పెళ్లి అయింది అని లాయర్ అడిగితే లక్ష్మీ మొత్తం లాయర్‌తో చెప్తుంది. యమున లక్ష్మీతో నిన్ను సెటిల్ చేసే బాధ్యత నాది అని చెప్తుంది. ఇంట్లో అందరూ లక్ష్మీ కోసం ఎదురు చూస్తారు.

పద్మాక్షి గన్ తీసుకొని రెడీగా ఉంటుంది. అంబిక కోపంగా ఆ లక్ష్మీ అంతు చూడాలి ఇంటి వారసుడ్ని మనకు కాకుండా చేస్తుంది అని అంటుంది. ఇంతలో యమున, లక్ష్మీ వస్తారు. అందరూ హాల్‌లో ఉండటం చూసి ఇద్దరూ షాక్ అవుతారు. పద్మాక్షి లక్ష్మీకి గన్ గురి పెడుతుంది. విహారి చాలా కంగారు పడతాడు. ఏంటి వదిన గన్‌తో ఉంది నిజం తెలిసిపోయిందా అని యమున కంగారు పడుతుంది. ఈ రోజు ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పాం కదా ఇంకా వెళ్లలేదు ఏంటి ఇష్టం లేదా అని పద్మాక్షి అడుగుతుంది. ప్రకాశ్ లక్ష్మీని ఇరికించడానికి నాతో చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్లావ్ అంటే యమున నాతో వచ్చిందని చెప్తుంది. అందరికీ నీ మీద అనుమానంగా ఉంది నాకు కూడా అనుమానం ఉంది.. నేను మొగుడు అని నువ్వు నమ్మేలోపు రంకు మొగుడులు ఎంత మంది వస్తారో అని అంటాడు. అందరూ చాలా కోపంగా చూస్తారు.

విహారి కోపంతో ప్రకాశ్‌ని చితక్కొడతాడు. మీరు అనుమానిస్తే అర్థముంది. వీడు ఎలా అనుమానిస్తాడు. లక్ష్మీ గురించి ఏం తెలుసు అని పిచ్చి కూతలు కూస్తాడు అని చారుకేశవ అంటాడు. ఇంత అనుమానం ఉన్న వాడు లక్ష్మీని ఏం చేస్తాడో అని విహారి అంటాడు. ఇలాంటి అనుమానం ఉన్న వాడితో లక్ష్మీని పంపను అని విహారి అంటాడు. లక్ష్మీని పంపిచొద్దు అని నేను అంటున్నా అని విహారి అంటాడు. దాంతో సహస్ర లక్ష్మీని లోపలికి పంపేస్తుంది. పద్మాక్షి సహస్ర మీద చిరాకుపడుతుంది. సహస్ర ప్రకాశ్‌తో వెళ్లి ఆ దెబ్బలకు మందు రాసుకో ఒక్క మాటతో అంతా నాశనం చేశావ్ అంటుంది. అంబిక తన ప్లాన్ గురించి సుభాష్తో మాట్లాడుతుంటే లక్ష్మీ వినేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.