Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పూజ చేసుకోవడానికి అమ్మవారి విగ్రహం మట్టితో చేసుకుంటుంది. నాకు పోటీ రావాలి అనే కదా ఇదంతా చేస్తున్నావ్ అని సహస్ర లక్ష్మీ చేయి మెలిపెట్టేస్తుంది. లక్ష్మీ చేతికి గాయం అవుతుంది. లక్ష్మీ బాధ పడటం విహారి చూసి ఏమైంది అడుగుతాడు.

లక్ష్మీ చేతికి గాజు పెంకు గుచ్చు రక్తం రావడం విహారి చూస్తాడు. ఏమైంది లక్ష్మీ అని అడుగుతాడు. గాజు తీస్తుంటే లక్ష్మీ విలవిల్లాడిపోతుంది. అది చూసి విహారి చాలా బాధ పడతాడు. లక్ష్మీ చేతికి గుచ్చుకున్న గాజు ముక్కలు తీసి రుమాలుతో చేతికి కట్టు కడతాడు. విగ్రహం నువ్వే చేశావా అని అడుగుతాడు. అవును అని లక్ష్మీ అంటే ఎందుకు చేశావ్ అని అడుగుతాడు. ఎవరి కోసం పూజ చేస్తావ్.. రేపు అందరూ భార్యలు భర్తల కోసం పూజ చేస్తారు.. నువ్వు కూడా నా కోసం పూజ చేయాలని ఇలా చేస్తున్నావ్.. నువ్వు ఎన్నాళ్లు ఇలా నా మీద ప్రేమ దాచేసి ఇలా కాలం గడుపుతావో నేను చూస్తానని అంటాడు.

పూజారి గుడికి వెళ్లే సరికి అమ్మవారి విగ్రహం కనిపించదు.. అమ్మవారి విగ్రహం ఏది అమ్మవారి విగ్రహం ఎక్కడ వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయ్ విగ్రహం ఏమైందని పంతులు అనుకొని ఊరి పెద్దలతో పాటు విహారి ఫ్యామిలీకి విషయం చెప్తాడు. ఇది చాలా అరిష్టం అని కాదాంబరి అంటుంది. పోలీసులకు చెప్పారా అని విహారి అంటే చెప్పామని పంతులు అంటారు. ఇంతలో పోచమ్మ వస్తే విషయం చెప్తారు. పోచమ్మ తన దివ్య దృష్టితో చూస్తుంది. లక్ష్మీ విగ్రహం లక్ష్మీకి ప్రమాదం జరగడంతో విహారి ఎత్తుకొని లక్ష్మీని తీసుకురావడం విగ్రహానికి పూజ జరగడం గుర్తు కనిపిస్తుంది.

పోచమ్మ పసుపు ముద్ద తీసుకొని వచ్చి ఇది అమ్మ వారి పరీక్ష. అమ్మవారిని ఎవరూ పొలిమేర దాటించలేరు. అమ్మవారు ఎక్కడున్నా సారె అందుకోవడానికి తిరిగి వస్తుంది. మీ పూజలు పనులు మానొద్దు అన్నీ చేయండి అని చెప్తుంది. అంత వరకు అందరం వెతుకుదాం అని తలా ఓ వైపు వెళ్తారు. వీర్రాజు, ప్రకాశ్, పానకాలు మీటింగ్ పెడతారు. ఎవరూ లేని టైంలో విగ్రహం ఊరు దాంటించేయాలని అనుకుంటారు. పోచమ్మ అమ్మవారి స్థానంలో పసుపు గౌరమ్మని పెట్టి పూజలు చేయమని చెప్తుంది.

సహస్ర రాత్రి వేళ ప్రకాశ్‌ని పిలిచి లక్ష్మీ చేసిన అమ్మవారి విగ్రహం చూపించి లక్ష్మీ రేపు పూజ చేయకుండా ఆపాలని అంటాడు. విగ్రహాన్ని మాయం చేమమని అంటుంది. ఇక పానకాలు, వీర్రాజు అమ్మవారి విగ్రహం పట్టుకొని పరుగులు పెడుతుంటారు. ఇంతలో పోలీసులు రావడంతో విహారి వాళ్లు ఉన్న ఇంటి వైపు దాక్కుంటారు. అక్కడే ఊరి వాళ్లు అమ్మవారి విగ్రహం వెతుకుతూ ఉండటంతో వెనక వైపు నుంచి వెళ్దామని అనుకుంటారు. సహస్ర లక్ష్మీ చేసిన విగ్రహం బావిలో పడేద్దాం అని ప్రకాశ్‌తో చెప్పి తీసుకెళ్తుంది. అదే బావి పక్కన వీర్రాజు, పానకాలు విగ్రహం పట్టుకొని దాక్కుంటారు. దొరికిపోయేలా ఉన్నాం ఇప్పుడెలా అని అనుకుంటారు. వీర్రాజు కూడా ఈ విగ్రహాన్ని బావిలో పడేసి నింద లక్ష్మీ మీద పడేయాలని అనుకుంటారు.

లక్ష్మీ చేసిన విగ్రహాన్ని సహస్ర వాళ్లు బావలో వేయడం.. వీర్రాజు వాళ్లు అమ్మవారి విగ్రహం బావిలో ఒకేసారి వేస్తారు. అమ్మవారి విగ్రహం కూడా బావిలో పడేసినట్లు సహస్రకు తెలీదు. ఇక అందరూ బయటకు వచ్చి ఏదో నీటిలో పడినట్లు సౌండ్ వచ్చింది ఏంటా అనుకుంటారు. ఊరి జనం విగ్రహం కోసం వెతుకుతున్నారని అనుకొని అందరూ వెళ్లిపోతారు. లక్ష్మీ పడుకోగానే విగ్రహం లక్ష్మీ కొట్టేసిందని ఊరు జనం అనుకోవాలని ప్రకాశ్ లక్ష్మీ పట్టీ తీసుకెళ్లి అమ్మవారి గుడికి తీసుకెళ్తాడు. అయితే ఓ పాప నీరు తాగడానికి లేచి ముసుగులో ఉన్న ప్రకాశ్‌ని చూసేస్తుంది. భయంతో తల్లిని పట్టుకొని పడుకుంటుంది. ప్రకాశ్ పట్టీ అక్కడ పెట్టేసి వెళ్లిపోతాడు.

లక్ష్మీ ఉదయం పూజ చేసుకోవాలని విగ్రహం చూడటానికి వస్తుంది. అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో షాక్ అయి అందరితో విషయం చెప్తుంది. తను ఎప్పుడూ ఇంతే ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉంటుంది. తను ఇప్పుడు పూజ చేయకపోతే ఏమవుతుంది పని చేయడానికి వచ్చింది కదా అని సహస్ర అంటుంది. పద్మాక్షి లక్ష్మీతో నువ్వు నా కూతురికి పోటీ రావాలి అనుకున్నావ్ అందుకే ఇలా అయింది మూసుకొని పని చేసుకో అని అంటుంది. యమున లక్ష్మీని ఓదార్చుతుంది.

లక్ష్మీ యమునతో నాకు ఎందుకో ఎవరో విగ్రహాన్ని బావిలో వేశారేమో అనిపిస్తుందని అంటుంది. అలా ఎవరు చేస్తారమ్మా ఎక్కువ ఆలోచించకు గుడిలో పూజ చేసుకుందాంలే అంటుంది. విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్లి నా కోసం పూజ చేయాలి అనుకున్నావా అందుకే ఆగిపోయిందని ఏడుస్తున్నావా అని అంటాడు. మనకు ఈ పూజకి ముడి పెట్టొద్దు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.