Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 16th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విడాకుల మలుపు: లక్ష్మీపై ప్రకాష్ దాడి, అమ్మవారి అవతారంలో లక్ష్మీ! పద్మాక్షికి ఏం తెలిసింది!
2 months ago 3
ARTICLE AD
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode  విహారి విడాకుల కేసు గురించి గుడికి వెళ్తూ తల్లిని దీవించమని అంటాడు. విజయోస్తు అని దీవించమని అంటాడు. యమున కంగారు పడుతుంది. విహారి తల్లితో దీవించు అమ్మా అని అంటే యమున ఇబ్బందిగానే దీవిస్తుంది. ఎందుకు అలా దీవించమని అంటే అగ్నిపరీక్షకు వెళ్తున్నా అందులో సక్సెస్ అయితే నా జీవితంలో సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని అంటాడు.
యమున మనసులో విడాకులు అయిపోతే నీ సగం ప్రాబ్లమ్స్ పరిష్కారం అయిపోయినట్లే అని అనుకుంటుంది. ఇక లక్ష్మీ మార్కెట్ బ్యాగ్ తీసుకొని బయల్దేరుతుంది. యమునతో మాట్లాడుతుంది. యమున లక్ష్మీతో ఆ జడ్జి ఏం చెప్పినా.. విహారి ఏం చెప్పినా నువ్వు మాత్రం వెనక్కి తగ్గకుండా ఎలా అయినా విడాకులు వచ్చేలా చూడు అని అంటుంది. లక్ష్మీ ఎలా అయినా విడాకులు తీసుకుంటా అని చెప్తుంది. విహారి వెళ్తూ లక్ష్మీకి కాల్ చేస్తాడు. ఇద్దరూ గుడి దగ్గరకు చేరుకుంటారు. లక్ష్మీ ఎలా అయినా తమకు విడాకులు వచ్చేలా చూడమని కోరుకుంటుంది.
జడ్జి అక్కడో పూజకి ఏర్పాటు చేయిస్తుంది. ఇద్దరికీ బట్టలు ఇచ్చి మార్చుకొని రమ్మని చెప్తుంది. ఇద్దరూ వెళ్తారు. లక్ష్మీ వస్తుంటే ప్రకాశ్ చెట్టు కింద ఉన్న అమ్మవారి ఎదుట లక్ష్మీని ఆపుతాడు. నువ్వేంటి ఇక్కడ అని లక్ష్మీ అంటే ఈ రోజు తాడోపేడో తేల్చుకోవడానికి వచ్చా అని లక్ష్మీ చేయి పట్టుకుంటాడు. చేయి వదులు లేకపోతే పళ్లు రాలు తాయ్ అని లక్ష్మీ అంటుంది. ప్రకాశ్ లక్ష్మీ చేయి పట్టుకొని వదలడానికి పట్టుకోలేదు.. ఈ రోజు ఈ గుడిలో విహారి కట్టిన తాళి నీ మెడలో నుంచి తీసేసి నేను తాళి కడతా అని అంటాడు. నా తాళి జోలికి వస్తే ప్రాణాలు తీస్తా అని లక్ష్మీ అంటుంది.
యమున పూజ గదిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రకాశ్ లక్ష్మీ మెడలో తాళి కట్టడానికి చాలా ప్రయత్నిస్తాడు. విహారి అటు వైపు వస్తుంటాడు. సహస్ర చాటుగా అదంతా చూస్తుంటుంది. విహారి వైపు ఓ వ్యాన్ దూసుకొస్తూ ఉంటుంది. విహారికి వ్యాన్ ఢీ కొట్టే టైంకి లక్ష్మీ ప్రకాశ్ మీద తిరగబడుతుంది. ఇంట్లో కూడా దీపాలు వెలుగుతాయి. లక్ష్మీ తాళితోనే విహారికి ప్రాణాలు ఉన్నాయన్నట్ల సీన్ చూపిస్తారు. నా మాంగల్యం జోలికే వస్తావారా అని లక్ష్మీ అమ్మవారి త్రిశూలం పట్టుకొని ప్రకాశ్ మీదకు వెళ్తుంది. సాక్ష్యాత్తు అమ్మవారి దిగివచ్చినట్లు లక్ష్మీ కనిపిస్తుంది. సహస్ర కూడా
చూసి బిత్తరపోతుంది. కనకం ప్రకాశ్ పొట్టమీద కాలు వేసి అమ్మవారిలా నాలుక బయట పెట్టి పొడవడానికి రెడీ అయిపోతుంది. ప్రకాశ్ పారిపోతాడు. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు లక్ష్మీని పట్టుకొని అమ్మా శాంతించు అని అంటారు.
జడ్జి లక్ష్మీ దగ్గరకు వచ్చి లక్ష్మీని తీసుకెళ్తుంది. ఇంతలో విహారి వెళ్తూ పద్మాక్షి ఫ్రెండ్ వాళ్లు విహారిని చూసి గుర్తు పట్టి పిలుస్తుంది. విహారి చూడకపోవడంతో పద్మాక్షికి కాల్ చేస్తుంది. మీ అల్లుడు పట్టు పంచెతో గుడికి వచ్చాడు మీరు వచ్చారేమో అని కాల్ చేశానే అని చెప్తుంది. పద్మాక్షి షాక్ అయిపోతుంది. యమునను పిలిచి విహారి ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతుంది. బయటకు వెళ్లాడని యమున చెప్తుంది. విహారికి కాల్ చేస్తుంది. విహారి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సహస్రకు కాల్ చేస్తుంది. సహస్ర గుడిలో ఉన్నాను అని అంటుంది. విహారి కూడా నీతో ఉన్నాడా అని అంటే లేడు అని సహస్ర చెప్తుంది. పద్మాక్షి ఏం మాట్లాడకుండా యమునతో రా వదినా బయటకు వెళ్దాం అని తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Read Entire Article