Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode | బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(అక్టోబరు 28న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అఖండ దీపం ఇలా అయిందేంటి..

మహా అఖండ దీపంలో నూనె పోయడంతో మహాని పద్మాక్షి లాగిపెట్టి కొడుతుంది. దాంతో అఖండ దీపం కింద పడిపోతుంది. అందరూ అక్కడికి చేరి అఖండ దీపం ఇలా అయిందేంటి అని అనుకుంటారు. ఇక సహస్ర మరో దీపంలో ఆ దీపం పెడుతుంది. మహాని ఎందుకు కొట్టారు అని విహారి అంటే ఈ ఇంటి కోడలు చేయాల్సిన పని అదెలా చేస్తుందని అని పద్మాక్షి అంటుంది. దానికి విహారి నిన్న ఇదే మహా సహస్ర చేసిన పనికి దీపం కొండెక్కకుండా చేసినప్పుడు ఒక న్యాయం ఈ రోజు ఒక న్యాయమా.. ఒక మనిషిని కొట్టడం హింసించడం అనాగరికం ఇంకెప్పుడూ ఇలాంటివి చేయొద్దు అని అంటారు.

ఆ మిస్టరీ చేధించాలి..

యమున ఇంట్లో జరిగిన విషయం వెంటనే స్వామీజీకి చెప్పాలని వెళ్తుంది. మరోవైపు విహారి బయటకు వెళ్తూ బొమ్మల కొలువు దగ్గర కారు తీసి పట్టుకొని తండ్రిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతాడు. ఇంతలో ఫోన్ రావడంతో మాట్లాడుతూ సిరి గురించి తెలిసిందా.. వెంటనే ఆ మిస్టరీ మీరు తెలుసుకోవాలి అంటూ మాట్లాడటం అంబిక చూసి మిస్టరీ అనడం చేతిలో కారు బొమ్మ చూసి కంగారు పడుతుంది. ఇంతలో ల్యాండ్‌లైన్ రిపేర్ చేసిన వ్యక్తి వచ్చి ఫోన్ పని చేస్తుందా అని అంబికను అడుగుతాడు. ఎవరు రిపేయ్ చేయమన్నారు అంటే విహారి గ్రూఫ్ ఆఫ్ కంపెనీలు అని చెప్పడంతో అంబికకు కంగారు పెరిగిపోతుంది.

విహారినే ఆ పని చేస్తున్నాడు..

విహారి తన అన్న డెట్ మిస్టరీ చేధిస్తున్నాడని వాడో పట్టు వదలని విక్రమార్కుడు అని జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది. వెంటనే సుభాష్‌కి కాల్ చేసి ఇదంతా విహారినే చేస్తున్నాడు. వెంటనే విహారిని చంపేయాలి అని అంటుంది. కచ్చితంగా ఈ సారి వాడు చచ్చిపోవాలి.. నేను ఎప్పుడు వాడిని చంపాలో చెప్తా నీ మనుషులతో రెడీ గా ఉండు అని అంటుంది.

అంబిక వణుకు..

మహా ఓ చోట ఆ మిస్టరీ కారు బొమ్మ పెడుతుంది. అంబిక అది చూసి గతం గుర్తు చేసుకొని వణికిపోతుంది. ఆ బొమ్మే పట్టుకొని చూస్తూ టెన్షన్ పడుతుంటే మహా వెళ్లి ఏమైందని ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది. ఏం లేదు అని అంబిక కంగారు పడితే ఏసీలో కూడా చెమటలు పట్టేస్తున్నారు. మీ టెన్షన్ అంతా ఈ బొమ్మని చూశా అని మహా అడుగుతుంది. అంత లేదు అని అంబిక అంటే నేనే ఏదో అనుకున్నా అని మహా అంటుంది. అంబిక విహారిని త్వరగా చంపేయాలని అడ్డు వస్తే మహాని కూడా చంపేయాలి అనుకుంటుంది. మరోవైపు యమున స్వామీజీని కలిసి విషయం చెప్తుంది. సమస్యలు పెరుగనున్నాయి. ఊహించని విషయాలు జరుగుతాయని స్వామీజీ అంటారు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి. " href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.