Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(అక్టోబరు 24న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీ గుర్తొస్తుంది..

మహా హరికృష్ణ కేసు ఫైల్ స్టడీ చేసి ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే అందరూ వస్తారు. వాళ్లలో అనుమానించొచ్చు అని అనుకుంటుంది. ఇక బయటకి వెళ్లి యమున బాధ పడుతూ ఉంటే యమునమ్మ ఏమైంది అని అడుగుతుంది. పొద్దున్నుంచి ఏం తినడం లేదు మందులు వేసుకోవడం లేదు అని పండు అంటాడు. ఏమైందని మహా అడిగితే యమున మహాతో నువ్వు ఇలా యమునమ్మ అంటుంటే లక్ష్మీ గుర్తొస్తుంది. అని చెప్పి సిరి విహారి మీద వరస అటాక్ల గురించి చెప్తుంది. దాంతో మహా ఇంటి పెద్ద మీరే అలా ఉంటే అందరూ ఏమైపోతారు. దసరా వస్తుంది కదా.. ఇంట్లో బొమ్మల కొలువు చేద్దాం అందరూ యాక్టివ్ అయిపోతారు. సంతోషంగా ఉంటారు అని మహా అంటుంది. విహారి కూడా విని హ్యాపీ అయిపోతాడు.

బొమ్మల కొలువు చేద్దాం..

సహస్ర లేచి పండుకి కాఫీ అడుగుతుంది. పండు కోసం బయటకు వచ్చి యమున వాళ్లందరినీ చూసి అయ్యో బావ ఇక్కడే ఉన్నాడా ఇప్పటి వరకు పడున్నా అని క్లాస్ పీకుతాడు. మెల్లగా జారుకోవాలి అని వెళ్లిపోతుంది. మహా నీకు బొమ్మల కొలువు పెట్టడం వచ్చా అని యమున అంటే వచ్చు అని మహా అంటుంది. ఇంతలో సిరి వచ్చి ఏయ్ మనం బొమ్మల కొలువు చేసుకుంటున్నామా. మహా ఆంటీ ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎవరికీ బొమ్మల కొలువు చేయడం రాక ఎప్పుడూ చేయలేదు. మీ వల్ల ఈ సారి చేసుకుంటాం అని సంతోషపడుతుంది. మనం చాలా గ్రాండ్‌గా చేసుకుందాం అని మహా అంటుంది.

సిరి కోసం సహస్రని తిట్టిన విహారి..

సహస్ర ఫోన్ చూసుకుంటూ ఉంటే సిరి సహస్ర దగ్గరకు వెళ్లి అమ్మా మనం కూడా బొమ్మల కొలువు పెట్టుకుందాం అని అంటుంది. దానికి సహస్ర బొమ్మల కొలువు ఏంటే అది లోక్లాస్ వాళ్లు చేసుకుంటారు. మన లాంటి హైక్లాస్ వాళ్లు చేసుకోరు అని అంటుంది. సిరి బతిమాలడంతో సహస్ర అరుస్తుంది. అది విన్న విహారి సహస్ర అని అరిచి లోపలికి వచ్చి చిన్న పిల్ల అడిగితే అలా చిరాకు పడతావేంటి అని అంటాడు. కన్న కూతురి మీద ఏ తల్లి ఇలా చిన్న విషయానికి చిరాకు పడుతుందా అంటూ తిడతాడు. పద్మాక్షి వాళ్లు వస్తారు. అత్తయ్యా నువ్వు ఇలాగే సహస్ర మీద అరుస్తావా అంటే దానికి సిరి అంటే ఎంత ఇష్టమో తెలీదా.. అని అంటుంది. ఇష్టమైన వాళ్ల మీద అలా చిరాకు పడరు కదా అత్తయ్యా అని విహారి అంటాడు. సహస్ర చిటికీ మాటికి చిన్న పిల్ల మీద అలా అరవకు. ఇంకోసారి సిరితో ఇలా మాట్లాడటం చూస్తే అసలు ఊరుకోను అని అంటాడు. ఇక మహా సిరితో నీకు బొమ్మల కొలువు కావాలి కదా.. మనం బొమ్మల కొలువు పెట్టుకుందాంలే అని అంటుంది.

సిరిని బాగా చూసుకోవే..

పద్మాక్షి సహస్రని పక్కకి తీసుకెళ్లి అసలు నువ్వు సిరిని కన్న కూతురిలా చూసుకుంటున్నావా అని అంటే ఆ బొమ్మల కొలువు లో క్లాస్‌ వాళ్లు చేసుకుంటారు. సిరి ఏ లో క్లాస్‌లో పుట్టిందో నన్ను ఇలాంటివి అడిగింది.. నేను కనని ఆ సిరికి తల్లిగా నటిస్తున్నా.. అని సహస్ర అంటుంది. నలుగురిలో ఇలా అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తే ఎవరికైనా అనుమానం వస్తే విహారికి నిజం తెలిస్తే నిన్ను నన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండు అని పద్మాక్షి అంటుంది. మరోవైపు మహా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి. " href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.