కనకంతో నీ వల్లే ఈ మట్టి విలువ తెలిసింది.. అని అంటాడు. ఇక ఆ బొమ్మల్లో ఒకటి నేను ఇంకొకటి ఎవరో నీకు నాకు ఆ దేవుడికి తెలుసు అని అంటాడు. ఇది మీరు ఇంకొకటి సహస్ర అని లక్ష్మీ చెప్పబోయే టైంకి విహారి ఆపి వేరే పేరు చెప్పి మూడ్ పాడు చేయకు అంటాడు. ఆ బొమ్మ ఎవరో నాకు నేను మనసులో అనుకున్నా కనకం.. మీ అత్తగారి కోసం 200 ఎకరాలు కూడా రాసిచ్చేయాలి అనుకున్నావ్ అని అంటాడు. అలా అనొద్దు అని లక్ష్మీ అంటుంటే నేను నీ భర్త మరి మా అమ్మ నీకు అత్తే కదా అని అంటాడు. యమునమ్మ నాకు జీవితం ఇచ్చారు ఆవిడ కోసం ఆస్తే కాదు నా ప్రాణం అయినా ఇచ్చేస్తా అని లక్ష్మీ అంటుంది.
విహారి లక్ష్మీ భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకొని అయితే నీకు దేవతలాంటి అత్త దొరికింది నాకు దేవకన్య లాంటి భార్య దొరికింది అని అంటాడు. విహారి గారు ఎవరైనా చూస్తే బాగోదు వదలండి అంటుంది లక్ష్మీ నా భార్యని నేను పట్టుకున్నా ఎవరు చూస్తే నాకు ఏంటి అని విహారి వెళ్తూ ఈ బొమ్మ నువ్వు అని చెప్పి వెళ్లిపోతాడు. సహస్ర బయట కూర్చొని కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటే విహారి చూసి దగ్గరకు వస్తాడు. సహస్ర ఇప్పుడెలా ఉంది అని అడుగుతాడు. సహస్ర విహారితో బావ నాకు యాక్సిడెంట్ అయి ఎన్ని రోజులు అయిందో గుర్తుందా.. నువ్వు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఇన్ని రోజులు ఎందుకు అడగలేదు అని అంటుంది.
పద్మాక్షి వచ్చి వాడికి నీకు ఎందుకు పట్టించుకుంటాడే బయట వాళ్లు ఎక్కువ అయిపోయారు అని అంటుంది. ఎందుకు అత్తయ్యా అలా అంటారు నాకు బాధ్యత ఉండే కదా ఇప్పుడు అడిగాను అని విహారి అంటాడు. ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఎలా ఉంది అని అడుగుతున్నావా అని పద్మాక్షి అడిగితే నేను సహస్రని అడగకపోవచ్చు కానీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను అని అంటాడు. యమున, కాదాంబరి, వసుధ వాళ్లు విహారి ఎలాంటి వాడో మనకు తెలుసు కదా అని అంటారు. ఇక కాదాంబరి విహారితో వీధి చివర ఉన్న మంత్రసానిని తీసుకురమ్మని చెప్తుంది. పద్మాక్షి షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకమ్మా అని అడిగితే ఆవిడ పెళ్లి అయిన ఆడపిల్ల ఎప్పుడు పురుడు పోసుకుంటుందో చెప్తుంది.
పద్మాక్షి వద్దు అన్నా కాదాంబరి ఆవిడను పిలిపించమని చెప్తుంది. సహస్ర నాడి పట్టుకొని చూసింది అంటే అన్నీ చెప్పేస్తుందని కాదాంబరి అంటుంది. విహారి వెళ్తాడు. ఇక వీధిలో వీర్రాజు కొడుకు అమ్మిరాజు ఊరు వస్తాడు. బులెట్ బండి మీద వచ్చిన అమ్మిరాజు దారిలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు. ఓ కావేరి కూరగాయలు తీసుకొని వెళ్తుంటే అమ్మిరాజు వెళ్లి ఆ అమ్మాయి మీద చేయి వేసి తడుముతూ కావేరి నువ్వా అని టీజ్ చేస్తాడు. మీద మీదకు వెళ్లి నీ అందం నాకు దక్కాలి అని తప్పుగా మాట్లాడుతాడు. కావేరి వెళ్లిపోవాలని అనుకుంటే కొంగు పట్టుకొని లాగి మీద మీద చేతులు వేస్తాడు. అది చూసిన లక్ష్మీ దగ్గరకు వెళ్లి అమ్మిరాజుని లాగిపెట్టి కొడుతుంది.
అమ్మిరాజు వెళ్లి బురదలో పడతాడు. లక్ష్మీతో కూడా తప్పుగా మాట్లాడి నువ్వే మా మీద పడిన బురద తుడవాలి అంటాడు. చంపేస్తా అని లక్ష్మీ అంటే నువ్వు తుడవవా నేనే తుడుస్తా అని లక్ష్మీ ఓణీ పట్టుకోబోతే విహారి వచ్చి అమ్మిరాజుని కొడతాడు. కావేరి వెళ్లిపోతుంటే ఏంటి తను అంత భయపడుతుంది అని విహారి అంటే దానికి అమ్మిరాజు అది నాకు కాబోయే పెళ్లాంరా అని అంటాడు. తను ఎవరైనా సరే ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నీ తోలు తీసి నీకే చెప్పులు కుట్టిస్తా అంటాడు. ఇక విహారి లక్ష్మీతో పాటు మంత్రసాని ఇంటికి తీసుకెళ్తాడు.
మంత్రసాని ఇంటికి వస్తుంది. పద్మాక్షి చాలా కంగారు పడుతుంది. కాదాంబరి ఆమెతో సహస్రని చూపించి విహారి భార్య అని చెప్పి తనని చూడమంటుంది. మంత్రసాని విహారిని సహస్ర పక్కనే కూర్చొమంటుంది. పద్మాక్షి చెమటలు పట్టేస్తుంది. మంత్రాసాని సహస్ర చేయి పట్టుకొని చూస్తుంది. సహస్రకి గర్భం లేదని మంత్రసానికి తెలిసిపోయినట్లుందని పద్మాక్షి టెన్షన్ పడుతుంది. మంత్రసాని చేయి పట్టుకొని నాడి చూసి సహస్రకు నాడి కొట్టుకునే విధానం చూస్తే గర్భం దాల్చే అవకాశం లేనట్లు ఉందని అనుకొని పైకి మాత్రం మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్తుంది. అందరూ చాలా సంతోషపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.