Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పేరు మీద భక్తవత్సలం 200 ఎకరాలు రాస్తారు. దాంతో లక్ష్మీ ఆ పొలాలు అమ్మడానికి నిరాకరిస్తుంది. లక్ష్మీతో ఎలా అయినా పొలం అమ్మించాలని అంబిక పథకం వేసి అందుకు యమునని కిడ్నాప్ చేసి లక్ష్మీని బ్లాక్ మెయిల్ చేయాలి అనుకుంటుంది. వీర్రాజుతో చేతులు కలిపిన అంబిక రాత్రి అందరూ పడుకున్న తర్వాత యమునకి కిడ్రాప్ చేయించి ఓ మూటలో కట్టి ఇంట్లో నుంచి తీసుకెళ్లడానికి సాయం చేస్తుంది.

వీర్రాజు అతని మనుషులు యమునని తీసుకెళ్లిపోతారు. హాల్‌లోనే లక్ష్మీ, పండు పడుకొని ఉంటారు కానీ ఎవరూ గుర్తించరు.. అయితే వెళ్తూ వెళ్తూ వీర్రాజు బయట బిందె తన్నేయడంతో పండు లేచి ఎవరా అని బయటకు వెళ్లి చూస్తాడు. వీర్రాజు, పానకాలు దాక్కుంటారు. తప్పించుకోవడానికి పనకాలు పిల్లలా అరుస్తాడు. దాంతో పండు ముంతిచ్చి కొడతాడు. వీర్రాజు నెత్తికి తగులుతుంది. మొత్తానికి పండుని డైవర్ట్ చేసి యమునని తీసుకెళ్లిపోతారు.

లక్ష్మీ ఉదయం లేచి యమునకు టీ ఇవ్వడానికి గదికి వెళ్తుంది. యమున కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లిందా అని ఇళ్లంతా వెతుకుతుంది. విహారి రావడంతో యమునమ్మ గదిలో లేదని చెప్తుంది. బయటకు వెళ్లుంటుందేమో అని విహారి అంటే ఉదయం నుంచి కనిపించడం లేదని అంటుంది. అంబిక రావడంతో విహారి అడుగుతాడు. దాంతో అంబిక గుడికి వెళ్తా అని చెప్పింది వెళ్లిందేమో అని అంటుంది. గుడికి వెళ్లిందా అని విహారి రిలాక్స్ అయిపోతాడు. ఇక విహారి, లక్ష్మీలు వీకే ఇండ్రస్టీస్ గురించి మాట్లాడుకుంటారు. అందరికీ పొలాలు అమ్మొద్దని కన్విన్స్ చేద్దామని వెళ్లాలి అనుకుంటారు.

యమున కాళ్లు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి ఓ చైర్‌ మీ కట్టేసుంటారు. యమునకు మెలకువ వస్తుంది. పానకాలు యమునని చూడటానికి వెళ్లే సరికి యమున ఊపిరి అందక విలవిల్లాడిపోతుంది. పానకాలు అది చూసి వీర్రాజుకి చెప్తాడు. వీర్రాజు చూసి షాక్ అయిపోతాడు. కంగారుగా వెంటనే అంబికకు కాల్ చేస్తాడు. అమ్మా చెల్లమ్మా యమున ఏంటి ఊరిరాడకున్నట్లు విలవిల్లాడిపోతుంది అంటే దానికి అంబిక ఆమెకు ఆస్తమా ఉంది అన్నయ్య అని చెప్పి మెడిసిన్ వివరాలు సెండ్ చేస్తుంది. వీర్రాజు ఓ వ్యక్తితో ఆ మెడిసిన్ తెప్పిస్తాడు. అయితే అతను వెళ్తూ విహారిని ఢీకొడతాడు. విహారి ఇన్‌హెలర్ కింద పడటంతో తీసి అతనికి ఇస్తాడు.

లక్ష్మీ ఆడవాళ్లకి పొలాల గురించి చెప్పబోతే వాళ్లు వినరు. ఏ ఇంటికి వెళ్లినా వాళ్లు అమ్ముతామని మాకు అడ్డు రావొద్దని లక్ష్మీతో చెప్తారు. ఇక లక్ష్మీ యమున ఉన్న ఏరియాకి వస్తుంది. యమున లక్ష్మీని చూసి లక్ష్మీకి తన గురించి తెలియాలి అని వాచ్ లైట్ లక్ష్మీ మీద వేస్తుందిలక్ష్మీ వీర్రాజు ఇంటికి వెళ్లే టైంకి వీర్రాజు అడ్డుకుంటారు. నువ్వేం చెప్పకు వెళ్లు అని వీర్రాజు లక్ష్మీని పంపేస్తాడు. వెంటనే అంబికకు కాల్ చేసి ప్రతీ ఇంటికి తిరిగి పొలాలు అమ్మొద్దని చెప్తుందని అంటాడు. ఇక వీర్రాజు వేరే నెంబరు నుంచి కాల్ చేస్తాడు. గొంతు మార్చి లక్ష్మీతో మాట్లాడుతాడు. యమునని మేం కిడ్నాప్ చేశామని చెప్తాడు. యమున మీ ఇంటికి రావాలి అంటే నువ్వేం మాట్లాడకుండా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలని బెదిరిస్తాడు. యమున కూడా ఆ మాటలు వింటుంది. సంతకాలు పెట్టకపోతే యమున బాడీ మీ ఇంటికి వస్తుందని బెదిరిస్తాడు. లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. నన్ను కిడ్నాప్ చేసి లక్ష్మీ చేత సంతకం పెట్టిస్తారా ఎలా అయినా తప్పించుకోవాలి అని యమున అంటుంది.

లక్ష్మీ యమున గదికి మరోసారి వెళ్లి ఇళ్లంతా వెతికి నిజంగానే యమునమ్మని కిడ్నాప్ చేశారా అని అనుకుంటుంది. ఇంతలో విహారికి పంతులు కనిపిస్తే అమ్మ గుడి దగ్గర ఉందా అని అడుగుతాడు. లేదు రాలేదు అని పంతులు చెప్పడంతో విహారి కంగారు పడి యమునకు కాల్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.