Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode రుక్మిణి అమ్మిరాజు వాళ్ల దగ్గర నుంచి పారిపోతుంది. రుక్మిణిని రౌడీలు తరుముతూ ఉంటారు. రుక్మిణి రౌడీల నుంచి తప్పించుకొని ఓ చోట చెట్టు కింద కూర్చొని కూతురి ఫొటో చూస్తూ ఏడుస్తుంది. నా కూతుర్ని ఎలా అయినా కాపాడుకోవాలి.. లేదంటే అమ్మిరాజు చేతిలో దాని జీవితం నాశనం అయిపోతుంది అని అనుకుంటుంది.

కావేరిని ఎలా కాపాడుకోవాలి.. వీర్రాజుని ఒక్కదాన్నే ఎలా ఎదుర్కోవాలి అని రుక్మిణి ఏడుస్తుంది. నా కూతుర్ని విహారి బాబు మాత్రమే కాపాడగలడు అని అనుకుంటుంది. ఏ చెట్టు దగ్గర రుక్మిణి కూర్చొని ఉంటుందే ఆ పక్క నుంచే విహారి పార్కింగ్ చేసిన కారులో లక్ష్మీని తీసుకొని వెళ్తాడు. ఇక రౌడీలు రుక్మిణిని చూసేస్తారు. రుక్మిణి మళ్లీ పరుగులు తీస్తుంది. మళ్లీ ఓ చోట దాక్కుంటుంది. రౌడీలు వేరే వైపు పరుగులు పెడతారు. ఇంత పెద్ద సిటీలో విహారి బాబుని ఎలా వెతకాలి అని రుక్మిణి ఏడుస్తుంది.

విహారి లక్ష్మీని చూసి డాక్టర్ చెప్పిన మాటలు నీకు చెప్పలేకపోతున్నా.. నీకు చూపు వస్తుందని నువ్వు సంతోషపడుతున్నావ్,, కానీ అది ఎప్పటికీ జరగదు అని ఎలా చెప్పను.. నా ఫ్యామిలీ కోసం చాలా చేశావ్.. నీ కోసం ఎలా అయినా సరే కళ్లు ఇచ్చే దాత కోసం వెతుకుతా.. నీకు మళ్లీ చూపు వచ్చి ప్రపంచాన్ని చూసే వరకు నా ప్రయత్నం చేస్తూనే ఉంటా అని మనసులో అనుకుంటాడు. లక్ష్మీ విహారిని పిలిచి మీరు నాకు చెప్పకుండా ఏమైనా దాస్తున్నారా అని అడుగుతుంది. ఎందుకు అలా అడిగావ్ అని విహారి అంటే మీ మాటల్లో తేడా నాకు తెలుస్తుంది అని అంటుంది.

విహారి కన్నీరు పెట్టుకొని అలాంటిది ఏమీ లేదు అని అనేస్తాడు. లేదు విహారి గారు మీరు ఏదో దాస్తున్నారు అని నాకు తెలుస్తుంది అని అంటుంది. విహారి ఏం మాట్లాడకుండా ఏడుస్తాడు. నా మనసు తెలుసు నా వాయిస్‌లో తేడా తెలుసు అంటున్నావ్.. నా మనసులో ఏం ఉన్నా నీకు చెప్పనా అని అంటాడు. దాంతో లక్ష్మీ మీరు హస్పిటల్‌కి వెళ్లే ముందు ఒకలా మాట్లాడారు ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు అని అంటుంది. కారు ఏదో ట్రబుల్ ఇచ్చింది అని విహారి బయటకు బాధ పడతాడు.

అంబికకు సంబంధించిన రౌడీలకు గతంలో అంబిక రుక్మిణి ఫోటో పంపి ఆవిడను పట్టుకుంటే డబ్బులు ఇస్తా అని అంటుంది. వాళ్లు సరిగ్గా ఆ ఫోటో చూస్తూ ఉంటే రుక్మిణి వాళ్ల కంట పడుతుంది. దాంతో ఆ రౌడీలు కూడా రుక్మిణిని తరుముతారు. ఆమెను తరుముతూనే అంబికకు కాల్ చేస్తారు. అంబిక రుక్మిణిని పట్టుకొని బంధించమని అంటుంది. రెండు గ్రూపుల రౌడీలు కూడా రుక్మిణిని వెతుకుతూ ఉంటారు. ఇంతలో రుక్మిణి పరుగులు పెడుతూ ఓ చోట పడిపోతుంది. అయినా సరే లేచి పరుగులు పెడుతుంది.

ఊరిలో ఉన్న వీర్రాజుకి ఎడమ కన్ను ఒకటే అదురుతూ ఉంటుంది. పానకాలతో విషయం చెప్పగానే మీకు ఏదో కీడు జరుగుతుందని అంటాడు. ఇంతలో అంబిక కాల్ చేస్తుంది. రుక్మిణి ఎక్కడికి వెళ్లి తప్పిపోయింది అన్నావ్ అని అడుగుతుంది. దాంతో వీర్రాజు కాశీకి వెళ్లి తప్పిపోయిందని అంటాడు. అయితే మరి మా సిటీలో నాకు ఎలా కనిపించింది అన్నయ్యా అంటుంది. వీర్రాజు షాక్ అయిపోతాడు. దాన్ని నేను నా మనుషులకు చెప్పి వెతికిస్తున్నా నువ్వు నీ మనుషులకు చెప్పి వెతికించు అని అంటుంది. వీర్నాజు తన మనుషులకు ఫోన్ చేస్తాడు. రుక్మిణి తప్పిపోయింది అని చెప్పకూడదు అని అనుకుంటారు. రుక్మిణి పారిపోయింది అని వాళ్లకి చెప్పి తిడతాడు. అమ్మిరాజు ఫోన్ తీసుకొని అది ఎక్కడున్నా మీరు పట్టుకోవాలి. లేదంటే దాన్ని చంపి తర్వాత మిమల్ని చంపుతా అని అంటాడు. గంటలో అది దొరికింది అని నాకు ఫోన్ రాకపోతే మీ అందరికీ చావు ఖాయం అని వీర్రాజు అంటాడు. రుక్మిణి పరుగెత్తి పరుగెత్తి విహారి ఉన్న దగ్గరకు వస్తుంది. ఇరు వైపులా రౌడీలు ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.