kalavari kodalu kanaka Mahalakshmi serial today episode కనకం, యమున ఇంట్లో అందరూ రాములోడి కల్యాణానికి ఏర్పాట్లు చేస్తుంటారు. వసుధ యమున దగ్గరకు వెళ్లి వదిన ఇంట్లో శ్రీరామనవమి చేస్తున్నారు కదా వదిన పీటల మీద ఎవరిని కూర్చొపెడతావు అని అడుగుతుంది. సహస్ర, విహారిలు కలిసి వ్రతం చేయిస్తే లక్ష్మీ బాధ పడుతుంది అని తెలీదా అని అడుగుతుంది. లక్ష్మీ గురించి నేను ఆలోచించడం లేదు అనుకుంటున్నావా.. నువ్వు లక్ష్మీ వైపు మాత్రమే ఆలోచిస్తున్నావ్.. సహస్ర కూడా నీకు కూతురి వరసే నాకు మేనకోడలు అలా అని నేను సహస్రకు లబ్ధి చేయడం లక్ష్మీకి అన్యాయం చేయాలి అని కాదు ఈ ఏర్పాట్లు చేసింది.. సహస్ర గర్భవతి.. విహారి తప్పు చేయడం లేదు అన్నా సహస్ర ఈ ఇంటి వారసుడిని కడుపులో మోస్తుంది అన్నది నిజమే కదా.. ఈ ఇంటి కోసమే ఇన్ని చేస్తున్నా అని అంటుంది.

లక్ష్మీ విషయంలో నాకు బాధగా ఉంది కానీ ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నేను చేయాల్సి వస్తే నా పని నేను చేయాలి కదా అని అంటుంది. లక్ష్మీ దగ్గరకు విహారి వెళ్లి ఏం చేస్తున్నావని అడుగుతాడు. మన ఇంటి పనే కదా విహారి గారు అని లక్ష్మీ అంటుంది. నువ్వు నా పక్కన లేకుండా నేను రాములవారి పెళ్లి చేస్తాను అని విహారి అడిగితే చేయాలి విహారి గారు తప్పదు అని లక్ష్మీ అంటుంది. ఎవరి ఆనందం కోసమో నేను ఇలా చేయలేను అని అంటాడు. మీరు ఇలా చేస్తే సహస్రమ్మ ఎంత బాధ పడుతుందో తెలీదా.. ఇదంతా నా తల రాత అని లక్ష్మీ అంటుంది. నువ్వు నా పక్కన లేకపోతే నేను పీటల మీద కూర్చొను అని అంటాడు. విహారి వెళ్లిపోయిన తర్వాత పండు వచ్చి లక్ష్మీతో నువ్వే విహారి భార్య అని విహారి గారు అంటున్నారు.. మరోవైపు సహస్రమ్మ పూజ చేయడానికి రెడీ అవుతుంది అని అంటుంది. ఏం చెప్పలేను అని లక్ష్మీ అనేసి వెళ్లిపోతుంది. దేవుడా నువ్వే నా చెల్లి గర్భవతి అని ఇంట్లో తెలిసేలా చేయమని అంటాడు.

స్వామీజీ ఇంటికి వస్తారు. స్వామీజీకి దివ్య దృష్టితో మొత్తం చూసి సమస్య పోతే సమస్య కొలిక్కి వెళ్లేది ఎప్పుడు అని అనుకుంటారు. స్వామీజీ రావడంతో అందరూ వెళ్లి ఆహ్వానిస్తారు. సహస్ర తల్లితో స్వామీజీకి నా గురించి తెలిసిపోతుంది కదా అని కంగారు పడుతుంది. ఏం కాదులే అని పద్మాక్షి అంటుంది. ఇద్దరూ స్వామీజీ దగ్గరకు వెళ్తారు. స్వామీజీ సహస్రని చూస్తారు. ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి.. మీకు చెప్పుకుందామని అంటే మీరు లేరు అని అంటుంది యమున. ఇంతలో విహారికి ఫోన్ వస్తుంది. విహారికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లడం అంబిక చూస్తుంది.

భుజంగం విహారితో ఇంట్లో శుభకార్యం చేస్తున్నావ్ కదా అని అంటాడు. నిన్ను వదలనురా నిన్ను చంపేస్తా అందుకు నేను ఎలాంటి శిక్ష అయినా అనుభవిస్తా అని విహారి అంటాడు. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసుకోలేవురా.. నీకు కౌంట్డౌన్ స్టార్.. ఈ రోజు నువ్వు ఇంట్లో విషాదం చూస్తావురా.. వెళ్లి నీ ఇంట్లో వాళ్లని కాపాడుకో అని అంటాడు. విహారి పరుగులు పెడతాడు. అంబిక మొత్తం చూసి విహారి ఎవరితో అంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు. వాడు ఎవడు అయింటాడు. వాడు ఎవడో తెలిస్తే నాకు ఉపయోగపడతాడు. వాడు ఎవడో తెలుసుకోవాలి అని అనుకుంటాడు.

అంబిక సుభాష్‌కి కాల్ చేస్తుంది. విహారి విషయంలో చాలా డౌట్‌గా ఉంది.. టెండర్ విషయంలో టెండర్ మాకు రాకుండా చేసింది విహారినే.. విహారిని ఎవరో ఫోన్‌లో బెదిరిస్తున్నారు. వాడు ఎవడో మనం తెలుసుకోవాలని అంబిక చెప్తుంది. విహారిని బెదిరిస్తున్నారా అని సుభాష్ అంటే అవును వాడు ఎవడో మనం తెలుసుకోవాలి అప్పుడు మనకు చాలా లాభం ఉంటుందని అంటుంది. సరే తెలుసుకుంటా అని సుభాష్ అంటాడు. స్వామీజీ విహారిని పిలవమని అంటారు. అందరూ విహారి కోసం చూస్తారు. ప్రతీ సారి ఏదో ఒకటి అయినప్పుడు సహస్రతో ఏం చేయాలి అన్నా వాడు ఇలా తప్పించుకుంటాడని అంటుంది పద్మాక్షి కోపంగా. సహస్ర బాధగా అదే లక్ష్మీతో అయితే పరుగున చేస్తాడు అని అంటుంది. ఏం మందు పెట్టిందో ఈ మహాతల్లి అని పద్మాక్షి అంటుంది. సహస్రమ్మా, పద్మాక్షమ్మా పూజకి టైం అయింది మీరు వెళ్లండి విహారి గారు ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తా అని లక్ష్మీ వెళ్తుంది. విహారి ఇంటి లోపలే ఉంటాడు. పండుని పిలిచి ఇంట్లోకి ఎవరూ కొత్త వాళ్లు రాకూడదు.. ఎలాంటి అనుమానం వచ్చినా పూర్తి డిటైల్స్ తీసుకొని నాకు చెప్పు అని అంటాడు. ఇంతలో లక్ష్మీ వచ్చి ఏంటిఅలా చెప్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు మామూలుగా చెప్పా అనేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.