<p>Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode: లక్ష్మీని యమున, విహారి ఇంటికి తీసుకొస్తే పద్మాక్షి అడ్డుకొని నోటితో చెప్పలేని కేసులో ఇరుక్కొని స్టేషన్‌కి వెళ్లిన దాన్ని ఇంటికి తీసుకొస్తున్నారు.. అది నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటుంది. లక్ష్మీ ముద్దాయి కాదు బాధితురాలు అని విహారి అంటాడు. అది బాధితురాలు అని మీరే అనుకుంటున్నారు కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పండి అప్పుడు ఏం మాట్లాడను.. అది అమాయకురాలు అంటున్నారు కదా.. మరి అది ఎందుకు ఆ ఇంట్లోకి వెళ్లింది అని పద్మాక్షి అడుగుతుంది. ఎందుకు ఆ ఏరియాకు వెళ్లావ్ లక్ష్మీ అని సహస్ర అడుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే నేనే దానికి హారతి పడతా అని పద్మాక్షి అంటుంది. </p>
<p>పద్మాక్షి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పకుండా అలా ఉండిపోతారు. మచ్చ లేని మా కుటుంబంలోకి నువ్వు రావాలి అంటే నీకు ఏ మచ్చ లేదు అని నేను నమ్మాలి అంటుంది. లక్ష్మీ ఏం తప్పు చేయలేదు అని విహారి మళ్లీ చెప్తాడు. అదో మేడి పండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది. కానీ లోపల మాత్రం కుళ్లు అని అంటుంది. లక్ష్మీని టార్గెట్ చేయొద్దని విహారి అంటాడు. లక్ష్మీ విహారితో నా వల్ల మీ కుటుంబంలో కలహాలు రావడం నాకు ఇష్టం లేదు.. నేను ఇంట్లోకి రావడం సమస్య అయితే నేను వెళ్లిపోతాను అని అంటుంది. యమున, విహారి ఆపాలని చూస్తారు. వద్దని పద్మాక్షి చెప్తుంది. లక్ష్మీ వెళ్తూ వెళ్తూ కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారు పడి లక్ష్మీ దగ్గరకు వెళ్తారు. విహారి లక్ష్మీని ఎత్తుకొని తన గదిలోకి తీసుకెళ్తాడు. డాక్టర్‌ని పిలుస్తారు. పద్మాక్షి చూసి మొగుడు లేని పని మనిషి కోసం అందరూ పరుగులు పెడతారు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా అని విహారి అంటే ఇంట్లో పెళ్లాన్ని పట్టించుకోవడం లేదు కానీ పని మనిషి కోసం నువ్వు ఇలా తాపత్రయ పడితే అందరూ ఏమనుకుంటారురా అని అడుగుతుంది. </p>
<p>డాక్టర్ లక్ష్మీని చూస్తుంది. అందరినీ బయటకు వెళ్లమని చెప్పి లక్ష్మీకి ఇంజెక్షన్ వేస్తుంది. యమున వెళ్తుంటే పద్మాక్షి పిలిచి నీ కొడుకుని నువ్వు అదుపులో పెట్టవా అని అంటుంది. వాడేం చేశాడు వదినా అని యమున అంటే పద్మాక్షి లాగి పెట్టి కొడుతుంది. సహస్ర తల్లితో అత్తయ్యని ఎందుకు కొట్టావమ్మా అంటే తన కళ్ల ముందే విహారి సొంత పెళ్లాన్ని ఎత్తుకెళ్లినట్లు లక్ష్మీని ఎత్తుకెళ్తే చూస్తూ ఏం అనడం లేదు అని అంటుంది. ఇక డాక్టర్ విహారి కోసం అడుగుతుంది. విహారి యమున దగ్గరకు వచ్చి ఏమైందని అడిగితే ఏమని అడుగుతావేంట్రా నేను అవమానపడటానికి లక్ష్మీకి ఈ పరిస్థితికి నువ్వే కారణం అని అంటుంది. ఇక లక్ష్మీకి కూడా మెలకువ వస్తుంది. పండు లక్ష్మీతో డాక్టర్‌ని విహారి తీసుకొచ్చారని చెప్తాడు. లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. డాక్టర్ ప్రెగ్నెన్సీ కోసం చెప్పేస్తుందేమో అని లక్ష్మీ పరుగులు తీస్తుంది. తీరా డాక్టర్ దగ్గరకు పరుగున లక్ష్మీ వస్తే డాక్టర్ లక్ష్మీ ప్రెగ్నెన్సీ గురించి చెప్పదు. విహారి వాళ్లతో లక్ష్మీ చాలా వీక్‌గా ఉంది జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. పద్మాక్షి, సహస్రలకు లక్ష్మీ ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్ వచ్చి డాక్టర్కి విషయం అడిగితే డాక్టర్ చెప్పదు. </p>
<p>విహారిని చారుకేశవ పక్కకు తీసుకెళ్లి నీకు వ్యతిరేకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టారు అని విషయం చెప్తాడు. నా మీద వ్యతిరేకత ఎందుకు అని విహారి అంటే ఎవరికీ చెప్పకుండా లక్ష్మీని సీఈఓని చేశావ్ కదా అని అంటాడు. దాంతో విహారి మా నాన్న నుంచి వస్తున్న ప్రస్టేజియస్ టెండర్ ఉంది కదా అది మనం దక్కించుకుంటే అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో నేను మాట్లాడుతా అంటాడు. ఇక పద్మాక్షి రెస్ట్ తీసుకుంటున్న లక్ష్మీని తీసుకొని బయటకు తీసుకొస్తుంది. సహస్రతో పాటు అందరూ లక్ష్మీని ఎందుకు తీసుకొచ్చావని అడుగుతారు. ఇది ఈ ఇంట్లో ఉండటానికి వీల్దేదు అని పద్మాక్షి అంటుంది. లక్ష్మీ ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.</p>