Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జూన్ 24న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంత జ్వరం ఏంటమ్మా..

సిరి, హరికృష్ణ ఒకరిని ఒకరు ఢీ కొట్టుకొని పడిపోతారు. నువ్వు ఈ స్కూల్‌లో జాయిన్ అయ్యావా అని అంటే నువ్వు అయ్యావా అని ఒకరిని ఒకరు అనుకుంటారు. నువ్వు జాగ్రత్తగా చూసుకొని నడు.. లేదంటే మా అమ్మ చీరలు అన్నీ నీ దెబ్బల కోసం చింపేస్తుందని హరికృష్ణ అంటాడు. ఇక సిరి హరికృష్ణని హరికృష్ణ హరికృష్ణ అని పేరు పెట్టి పిలిచి ఏడిపిస్తుంది. లక్ష్మీ రావడం చూసిన సిరి హాయ్ ఏంజెల్ ఆంటీ అని అంటుంది. అదేంటమ్మా అలా పిలుస్తున్నావ్ అంటే నేను ఎప్పుడు పడిపోయినా మీరు నన్ను దేవతలా వచ్చి కాపాడుతున్నారు కదా అందుకే ఏంజెల్ ఆంటీ అని పిలుస్తున్నా అని సిరి అంటుంది.

ఆంటీ మిమల్ని హగ్ చేసుకుంటా..

లక్ష్మీ పాపని పట్టుకొని ఏంటమ్మా ఒళ్లు ఇంత కాలిపోతుంది జ్వరమా అని అడిగితే అవును ఆంటీ అని సిరి అంటుంది. ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావని లక్ష్మీ అడిగితే ఈ రోజు స్కూల్‌లో జాయినింగ్‌కి లాస్ట్ డే అని వచ్చానని సిరి చెప్తుంది. లక్ష్మీ సిరితో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఆంటీ మిమల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా అని సిరి అడగగానే లక్ష్మీ ప్రేమతో సిరిని హత్తుకుంటుంది. హరికృష్ణ ఉడికిపోయి మా అమ్మని వదులు వదులు అని అంటాడు. నువ్వు అలా అంటే నేను ఆంటీని మా ఇంటికి తీసుకెళ్లిపోతా అని సిరి పాప అంటుంది. మా అమ్మని నేను వదలను అని హరికృష్ణ లక్ష్మీని హగ్ చేసుకొని ఐలవ్‌యూ అంటాడు. సిరి కూడా లక్ష్మీని హగ్ చేసుకొని ఐలవ్‌యూ చెప్తుంది. ఇక లక్ష్మీ వాళ్లు ఇంటికి వెళ్తూ సిరికి బాయ్ చెప్పి లక్ష్మీ సిరికి ముద్దు పెట్టుకుంటుంది. సిరి పాప హరికృష్ణ బాయ్ అని హరిని ఉడికిస్తుంది.

లక్ష్మీని చంపేశావా లేదారా..

పద్మాక్షికి ఫోన్ రావడంతో బయటకు వస్తుంది. సహస్ర ఆడ్మిషన్ తీసుకొని ఇంటికి బయల్దేరుతుంది. పద్మాక్షి సిరి పాప దగ్గరకు వచ్చి నిల్చొని లక్ష్మీ ఆటో ఎక్కడం చూసి షాక్ అయిపోతుంది. ఆటో దగ్గరకు వెళ్లే టైంకి ఆటో వెళ్లిపోతుంది. అది లక్ష్మీ ఏనా కాదా అని పద్మాక్షి కంగారు పడుతుంది. వెంటనే రౌడీలకు కాల్ చేసి ఆ రోజు లక్ష్మీని చంపేశావా లేదా అని అడుగుతుంది. అమ్మతోడు మేడం నేను లక్ష్మీని చంపేసి చెరువులో పడేశా అని అంటాడు. దాంతో పద్మాక్షి నేను లక్ష్మీని చూసినట్లు భ్రమ పడ్డా అనుకుంటుంది. సహస్ర రావడంతో ఇంటికి వెళ్లిపోతారు.

లోపలికి వెళ్లకూడదు మేడం..

విహారి హరికృష్ణ కంపెనీని మళ్లీ సక్సెస్ చేయడానికి బోర్డ్ మీటింగ్ పెట్టి మాట్లాడుతాడు. అందరూ ప్రజంటేషన్ ఇస్తారు. అంబిక, సుభాష్ దాన్ని ఎలా దెబ్బకొట్టాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక లక్ష్మీ చెక్కుని తిరిగి ఇచ్చేయడానికి విహారి కంపెనీకి వస్తుంది. లక్ష్మీని సెక్యూరిటీ అతను ఆపి అపాయింట్‌మెంట్ ఉంటేనే లోపలికి వెళ్లాలి అని అంటాడు. సార్ ఉన్నారా అని లక్ష్మీ అడుగుతుంది. ఉన్నారు మేడం అని సెక్యూరిటీ చెప్పడంతో లక్ష్మీ లోపలికి వెళ్తుంది.

ఆఫీస్‌లో లక్ష్మీ.. విహారికి వార్నింగ్

లక్ష్మీ ఆఫీస్‌లోకి వెళ్తుంది. చారుకేశవ బయటే ఉంటాడు. కానీ లక్ష్మీని చూడడు.. లక్ష్మీ నేరుగా మీటింగ్ దగ్గరకు వెళ్లి అందరికీ ఇక్కడ బాస్ ఎవరు అని అడుగుతుంది. అందరూ విహారిని చూపిస్తారు. లక్ష్మీ విహారి ముందు నిల్చొని మీకు డబ్బు ఉండొచ్చు.. ఆ డబ్బు వల్ల వచ్చే పొగరు కూడా ఎక్కువ ఉండొచ్చు. చేసిన సాయానికి డబ్బుతో వెలకట్టొచ్చు.. కానీ డబ్బుతో వెల కట్టలేనివి చాలా ఉంటాయి. వాటి కోసం మీరు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేరు.. మా సాయానికి వెల కట్టి మా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తాం అంటే ఈ డబ్బు గడ్డిపోచతో సమానం అని చెక్కుని విహారి ముఖం మీద కొడుతుంది. ఇంకెప్పుడు సాయం చేసిన వాళ్లకి ఇలా ముష్టి వేసి అవమానించకండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అయితే లక్ష్మీ, విహారి ఎదురెదురుగా ఉన్నా అది ప్రజంటేషన్ రూం కావడం అప్పటికే అక్కడ ప్రజంటేషన్ జరగడంతో అందరూ లైట్స్ ఆపేసి ఉంటారు. అందుకే లక్ష్మీ, విహారి ఒకర్ని ఒకరు చూసుకోరు. లక్ష్మీ వెనకాలే విహారి వెళ్లి ఎక్కడ అనుకుంటాడు. మనసులో తనది కనకం గొంతులాగే ఉంది కానీ కనకం కాదు.. ఎందుకు అంటే కనకానికి పిల్లలు లేరు అని విహారి అనుకుంటాడు.

ఆ అమ్మాయి కనిపిచింది సార్..

అంబిక, సుభాష్‌ల రౌడీ ఒకరు ఆఫీస్ దగ్గర నుంచి లక్ష్మీ వెళ్లడం చూసి లోపలికి వెళ్లి అంబిక, సుభాష్‌లకు ఆ అమ్మాయి వచ్చిందని చెప్తారు. అంబిక, సుభాష్ మొత్తం చూసినా ఎక్కడా కనిపించదు. దాంతో సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే ఎవరో తెలిసిపోతుందని అంబిక, సుభాష్ వెళ్లి ఫుటేజ్ చూస్తారు. ఫుటేజ్ మొత్తం చూస్తారు కానీ లక్ష్మీ ముఖం కనిపించదు. ఎలా అయినా లక్ష్మీని కనిపెట్టాలి అని అనుకుంటారు.

ఏంటి పద్మాక్షి అమ్మ రాను అనుకున్నారా..

సహస్ర, పద్మాక్షి, సిరి వెళ్తున్న కారు సడెన్‌గా ఆగిపోతుంది. సహస్ర కిందకి దిగి చూస్తుంది. పద్మాక్షి కారులో ఉంటే సిరి డోర్ తీసి ఏయ్ పద్దు కారు దిగి అమ్మకి సాయం చేయ్.. ఇటు పుల్ల తీసి అటు పుల్ల పెట్టవు ఏమైనా అంటే గుడ్ల గూబలా చూస్తావ్ అని సిరినే వాళ్ల అమ్మకి సాయం చేయడానికి వెళ్తుంది. పద్మాక్షి కాస్త దూరం వెళ్లి చెట్టు కింద లక్ష్మీ గురించి ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. ఇంతలో లక్ష్మీ పద్మాక్షి దగ్గరకు వచ్చి మీద చేయి వేస్తుంది. పద్మాక్షి చూసి షాక్ అయిపోతుంది. ఏంటి పద్మాక్షి అమ్మ రాను అనుకున్నారా.. రాలేను అనుకున్నారా.. మీరు చేసిన పని తెలిసిపోతుందని అనుకున్నారా.. ఎందుకు నన్ను చంపడానికి ప్రయత్నించారు చెప్పు.. ఏం చేశావో చెప్పు అని లక్ష్మీ అడుగుతుంది.

ఏదో చేయకపోతే ఇలా వణికిపోతావా..

నేను ఏం చేయలేదు అని నాకేం తెలీదు అని పద్మాక్షి అంటుంది. నన్ను చూడగానే వణికిపోయావ్.. చెమటలు పట్టేశావ్.. ఏదో కొంప ముంచే పని చేసుంటావ్.. నువ్వు నీ కుట్రలు నాకు తెలీదు అనుకున్నావా.. నీ కూతురి జీవితం కోసం ఎవరి జీవితం అయినా నాశనం చేయడానికి ముందు ఉంటావ్.. ఇన్ని రోజులు నన్ను చూస్తే కోపంతో ఊగిపోయి..చిరాకు పడి.. నన్ను కొట్టే నువ్వు ఇప్పుడు ఏం చేయడం లేదు.. నోటి మాట పెగలడం లేదు.. ఏమైంది చెప్పు అని లక్ష్మీ అడుగుతుంది. ఏం లేదు నేను మామూలుగా ఉన్నాను అని పద్మాక్షి అంటుంది. లేదమ్మా నువ్వేదో చేశావ్ మర్యాదగా చెప్పు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title=" ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి. " href="https://telugu.abplive.com" target="_self"> ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.