Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జులై 6న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాడు ఓడిపోవాలి..

విహారికి అడ్డు రావొద్దు అని అంబికకు చారుకేశవ చెప్తాడు. వాడు ఇప్పుడో మానిస్టర్ వాడికి అడ్డు వస్తే నువ్వే నాశనం అయిపోతావ్ అని అంటాడు. విహారి ఇలా మారిపోతాడు అని అస్సలు ఊహించలేదు.. ఈ 5 ఆరు ఏళ్లు మత్తులో ఉంటాడు అనుకుంటే ఇలా మారిపోయాడు అని అంబిక సుభాష్‌తో అంటుంది. విహారి మార్పు వెనక మా అన్నయ్య ఎమోషన్ కారణం.. అందుకే వాడు ఇలా చేస్తున్నాడు.. ఎవరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు.. నియంతలా పని చేస్తున్నాడు.. ఈ కంపెనీ సక్సెస్ అవ్వకుండా మనం అడ్డుకోవాలి అని అంబిక అంటుంది. ముందు మనం ఇన్వెస్టిర్లని ఆపాలని సుభాష్ అంటాడు.

ఆ అమ్మాయి ఎవరు..

శకుంతల తన సర్టిఫికేట్లు కాల్చేయడంతో లక్ష్మీ బాధగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అంబిక, సుభాష్ ఉన్న వైపే సుభాష్ భార్య స్కూటీ మీద వస్తూ సుభాష్‌ని చూస్తుంది. సుభాష్ ఇక్కడున్నాడేంటి అని మానస అనుకుంటుంది. సుభాస్ కూడా మానసని చూసి అంబికను పంపేయాలి అని అనుకుంటాడు. హడావుడిగా అంబికను పంపేస్తాడు. ఇక మానస సుభాష్ దగ్గరకు వచ్చి ఇక్కడున్నావేంటి..నాకు ఫోన్ కూడా చేయలేదు.. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావ్ అని అడుగుతుంది. నీకు సర్‌ఫ్రైజ్ ఇద్దాం అనుకున్నా అని అంటాడు. మానస సుభాష్‌ని తీసుకొని ఇంటికి వెళ్లిపోతుంది.

ఈ బామ్మ ఎవరు..

సుభాష్ ఇంటికి వచ్చి బామ్మని చూసి ఎవరు అని అడుగుతాడు. మన ఇంటి పని మనిషి కానీ ఆవిడతో పని చేయించుకోవడం ఇష్టం లేదు కానీ తనకి పని అవసరం అనడంతో పని ఇచ్చా అని మానస చెప్తుంది. బామ్మ బయట పని చేస్తూ ఉంటే లక్ష్మీ బామ్మని చూస్తుంది. బామ్మ ఇక్కడుందేంటి అని అనుకుంటుంది. ఎవరికీ తెలీకుండా చూసి బామ్మ పని మనిషిగా చేస్తుందని తెలుసుకొని షాక్ అయిపోతుంది. చాలా బాధ పడుతుంది. బామ్మ చేయి కట్ అయిపోతే మానస వెళ్లి కంగారు పడుతుంది. మానస బామ్మకి సేవలు చేస్తుంటే లక్ష్మీ చూసి మానస మంచిది అని అనుకుంటుంది. సుభాష్ అక్కడే ఉంటాడు కానీ లక్ష్మీని చూడడు.. లక్ష్మీ కూడా సుభాష్‌ని చూడదు.

అంతా నా తలరాత..

లక్ష్మీ ఇంటికి వచ్చి బామ్మ చేస్తున్న పనులు గుర్తు చేసుకొని బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో బామ్మ వచ్చి గుడి నుంచి వచ్చానని అంటుంది. అవునా గుడికి వెళ్లావా బామ్మ అక్కడ ఎప్పుడూ పని చేసే పంతులు ఉన్నారా అని అడుగుతుంది లక్ష్మీ. ఆయన లేరు అని బామ్మ అంటుంది. బామ్మ చేతి గాయం చూసి ఏంటి బామ్మ ఇది.. నేను ఏమీ చేయలేకపోతున్నాను అని ఇంట్లో వాళ్లని నువ్వే పోషించడానికి పనికి వెళ్తున్నావ్ కదా అని అడిగి ఏడుస్తుంది. అంతా నా తల రాత అని లక్ష్మీ తల బాదుకుంటుంది. బామ్మ వద్దని లక్ష్మీ చేతులకు మసి చూసి ఏమైందని అడుగుతుంది. లక్ష్మీ మొత్తం చెప్తుంది. బామ్మ శకుంతలని తిడుతుంది. ఇక విహారి కంపెనీని సక్సెస్ చేయడానికి చాలా కష్టపడతాడు. ఉద్యోగులు అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. శకుంతల కాంట్రాక్ట్ పది సంవత్సరాల నుంచి తనకే ఇస్తున్నారు ఆమెకి ఎవరూ పోటీ రావడం లేదా అని విహారి క్రిష్‌ని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title=" ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి. " href="https://telugu.abplive.com" target="_self"> ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.