Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జులై 4న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

థ్యాంక్యూరా..

విహారి దగ్గరకు క్రిష్‌ని తీసుకొని హర్ష వెళ్తాడు. మా అమ్మని కాపాడినందుకు థ్యాంక్స్ అని హర్ష చెప్తాడు. తర్వాత విహారికి మీ కోసం ఓ సర్‌ఫ్రైజ్ తీసుకొచ్చా అంటాడు. ఏంటి అది అని విహారి అంటే మా అమ్మ చేతితో చేసిన జీడిపప్పు ఉప్మా తీసుకొచ్చాను టేస్ట్ చేయమని అంటాడు. విహారి తిని చాలా బాగుందని అంటాడు. నేను చేసిన పనికి థ్యాంక్స్‌తో పాటు ఈ ఉప్మా కూడా తీసుకొచ్చావ్ కదా.. థ్యాంక్స్ అని విహారి అంటాడు. ఇక క్రిష్‌ని ఇంటి దగ్గర దింపేయమని హర్షకి చెప్తాడు. విహారి బయటకు వరకు వచ్చి క్రిష్‌ని దింపి ఏ సాయం కావాలి అన్నా అడుగు అని చెప్తాడు.

ALSO READ: Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మళ్లీ సర్టిఫికేట్లు తీసిన లక్ష్మీ.. ముందగుడు వేస్తుందా! విహారిని కలిసిన క్రిష్!

అడుక్కొని తింటారారా..

క్రిష్‌ని తీసుకొని హర్ష వెళ్తుంటే.. శకుంతుల గుర్తు పట్టి ఆపుతుంది. ఏంట్రా బుడ్డొడా మీ షాప్ కాలిపోయింది అంట కదా.. పెద్ద పెద్ద వాళ్లని అడుక్కొని తింటారా అని వెటకారం చేస్తుంది. మేం కష్టపడి తింటాం కానీ అడుక్కోమని క్రిష్ అంటాడు. నీకు మీ అమ్మలా నోరు ఎక్కువేరా.. అని అంటుంది. అవునురా మీ అమ్మ కూడా ఆ పాకలో ఉండిపోయింది అంట పోయిందా అని అడుగుతుంది. దాంతో క్రిష్‌ కోపంగా చూస్తాడు. అసలు నీకు ఇక్కడేం పనిరా అని శకుంతల అంటే ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు అని క్రిష్ అంటాడు. ఎవడ్రా నీ ఫ్రెండ్ అంటే ఈ కంపెనీ ఓనరే నా ఫ్రెండ్ అని క్రిష్ అంటాడు. ఇక విహారికి లక్ష్మీ చేసిన ఉప్మా క్రిష్ ఇచ్చాడని తెలుసుకున్న శకుంతల తనకే సిరి పోటీ వస్తుందా అని అనుకుంటుంది. సిరి చాలా తెలివైనది దాని సంగతి తేల్చాలి అని అనుకుంటుంది.

సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల..

పద్మాక్షి లక్ష్మీ డిటైల్స్ చెప్పమని ఓ వ్యక్తికి చెప్తుంది. ఆయన పద్మాక్షితో లక్ష్మీ ఎక్కడా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో లింక్ అవ్వడం లేదని అంటాడు. లక్ష్మీ ఆధార్ అన్నీ చూస్తాడు. అయితే అప్పుడే లక్ష్మీ లోక్ కోసం వెళ్లడం అక్కడ ఆధార్ కార్డు ఉపయోగించడం పద్మాక్షి మనిషి చూసి లక్ష్మీ ఆధార్ కార్డు ఐదేళ్ల క్రితం ఉపయోగించారని చెప్తాడు. ఈ మధ్య ఏమైనా ఆధార్ కార్డు వాడిందా అని పద్మాక్షి చూడమని అంటుంది. ఇక లక్ష్మీ లోన్‌ కోసం ప్రయత్నించడం పది లక్షలు లోన్ వస్తుందని బ్యాంక్ వాళ్లు చెప్పడంతో లక్ష్మీ చాలా సంతోషిస్తుంది. ఇంతలో శకుంతల అక్కడికి వచ్చి నా బిజినెస్‌కే ఎసరు పెడతావా అని లక్ష్మీ డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. డాక్యుమెంట్స్ తీసుకొని శకుంతల వెళ్లిపోతే లక్ష్మీ వెనకాలే వెళ్లి బతిమాలుతుంది. శకుంతల మాత్రం డాక్యుమెంట్స్ కాల్చేస్తుంది. అందులోనే లక్ష్మీ సర్టిఫికేట్లు ఉంటాయి. లక్ష్మీ చాలా ఏడుస్తుంది. ఇంకోసారి నా జోలికి వస్తే ఇలాగే నీ జీవితం కూడా కాల్చేస్తా అని వార్నింగ్ వచ్చి శకుంతల వెళ్లిపోతుంది. నేను ఎంతో కష్టపడి చదివి సంపాదించుకున్న సర్టిఫికేట్లు కాలి బూడిదయ్యాయి ఏం చేయాలి అని లక్ష్మీ ఏడుస్తుంది.

విహారి 2.0

విహారి ఆఫీస్‌లో చురుకుగా పని చేస్తుంటే అంబిక చూసి ఇంతకు ముందు ఆఫీస్‌నే పట్టించుకోని వాడు ఇప్పుడు ఇంత చేస్తున్నాడు.. అని అంబిక సుభాష్‌తో అంటుంది. ఇంతలో చారుకేశవ వచ్చి మీరు చూస్తుంది విహారి 2.0 అని అంటాడు. వాడే చేస్తాడు ఈ కంపెనీని ఎలా సక్సెస్ చేస్తాడు అన్నావ్ కదా.. ఇప్పుడు వాడిని సరిగ్గా చూడు వాళ్ల నాన్న కంపెనీని ఓ ఎమోషన్‌లా తీసుకున్నాడు.. కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తాడు. వాడి సాధించిన సక్సెస్‌తో మీ నోర్లు మూత పడతాయి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title=" ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి. " href="https://telugu.abplive.com" target="_self"> ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.