Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 25th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారికి తగిలిన విషపు బాణం.. లక్ష్మీ మళ్లీ తాళి కడతాడా.. సహస్రకు పొంచి ఉన్న ప్రమాదం!

10 months ago 8
ARTICLE AD

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode తెగిపోయిన తాళి పట్టుకొని లక్ష్మీ బాధ పడుతుంది. విహారి కనకంతో నేనే దేవుడి సమక్షంలో తాళి తీసేస్తా అంటే విప్పే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. ఇప్పుడు అదే దేవుడు నా నిర్ణయం కరెక్ట్ అని చెప్పడానికి ఆ తాళి తెంపేశాడని అంటాడు. లక్ష్మీ ఏం మాట్లాడకుండా విహారి వెనక నడుస్తుంది. మరోవైపు యమున దేవుడి గదిలో కూర్చొని లక్ష్మీ, విహారికి ఏం ఆపద రాకుండా కాపాడని కోరుకుంటుంది.విహారి, లక్ష్మీ ఇద్దరూ అడవిలో నడుస్తూ వెళ్తుంటారు. మధ్యలో ఓ పెద్ద రాయి వస్తే లక్ష్మీ కిందకి దిగలేకపోతే విహారి ఎత్తుకొని కిందకి దించుతాడు.

విహారి లక్ష్మీ విహారి కళ్లలోకి చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఇద్దరూ మళ్లీ అడవిలో నడుస్తూ వెళ్తుంటారు. సుభాష్ కూడా ఇద్దరు రౌడీలతో లక్ష్మీ, విహారి కోసం వెతుకుతూ ఉంటాడు. లక్ష్మీ, విహారికి అడవిలో ఏదో శబ్ధం వినిపిస్తుంది. ఇద్దరూ రౌడీలు ఫాలో అవుతున్నారేమో అనుకుంటారు. మొత్తం చూస్తారు. ఎక్కడా ఎవరూ కనిపించకపోవడంతో తొందరగా వెళ్లాలని అనుకుంటారు. ఓ చోటుకి వెళ్లే సరికి ఓ వ్యక్తి లక్ష్మీ మీద బాణం వేయడం చూసిన విహారి లక్ష్మీని పక్కకు తోసి అడ్డుగా వెళ్తాడు. దాంతో విహారి చేతికి బాణం తగులుతుంది. ఇక ఇంట్లో యమున పెట్టిన దీపాలు ఆరిపోతాయి. దాంతో ఏంటి ఈ అపశకునం అని యమున షాక్ అయిపోతుంది. విహారి అరుపు విన్న సుభాష్ అది విహారినే అనుకొని అటు వెళ్లాలని అనుకుంటాడు.

లక్ష్మీ విహారి చేతికి తగిలిన బాణం తీస్తుంది. నొప్పితో విహారి విలవిల్లాడిపోతాడు.  లక్ష్మీ తన చీర కొంగు చింపి విహారి చేతికి కొడుతుంది. విహారి లక్ష్మీతో అడవి మనుషులు వేసిన బాణం అని అంటాడు. వాళ్లతో ప్రమాదం కదా అని లక్ష్మీ అంటుంది. లక్ష్మీ వాళ్లు వెళ్లిపోయే టైంకి అడవి మనుషులు చుట్టు ముడతారు. మరోవైపు సహస్ర బావని వెతుక్కుంటూ అడవికి వస్తుంది. విహారి ఫొటో చూపించి ఇద్దరు దారిలో కనిపించిన వారిని అడుగుతుంది. వాళ్లు చూడలేదని అంటే మళ్లీ ముందుకు వెళ్తుంది. మరోవ్యక్తిని అడిగితే ఆయన్ను చూశానని ఆయనతో పాటు లంగావోణి వేసుకున్న అమ్మాయి కూడా ఉందని అంటే అది లక్ష్మీనే ఉని సహస్ర అనుకుంటుంది. వాళ్లిద్దరూ ఎందుకు కలిసి ఉన్నారని బావనీ తీసుకెళ్లిపోవాలని అంటుంది.

అడవి మనుషులు లక్ష్మీ, విహారి చుట్టు ముడతారు. ఎవరు మీరు అని అడుగుతారు. సిటీ నుంచి వచ్చి పెళ్లి చేసుకోకుండా ఇలా చాటు మాటు యవ్వారాలకు మా అడవికి వచ్చారా అని ప్రశ్నిస్తారు. విహారి ఎంత చెప్పినా వాళ్లు వినరు. మేం ఇద్దరం భార్యాభర్తలం అని విహారి చెప్తాడు. దాంతో వాళ్లు లక్ష్మీ మెడలో తాళి లేదని అంటారు. లక్ష్మీ వాళ్లతో ఆయన నా భర్త అని తాళి చూపిస్తుంది. వాళ్లు అది చూసి మంగళసూత్రం అలా చేతిలో పట్టుకున్నావ్ ఏంటి అమ్మా అంటే కొమ్మకు చిక్కుకొని పడిపోయిందని లక్ష్మీ చెప్తుంది. దాంతో ఆయన తెగిన తాళి అలా పట్టుకోకూడదని వీలైనంత త్వరగా అది నీ భర్తతో కట్టించుకోమని చెప్పి వెళ్లమంటారు. మళ్లీ ఇంతలో బాణం గుర్తొచ్చి అది విషపు బాణం అని విరుగుడు వేయకపోతే ప్రాణాలతో ఉండరు అని చెప్తారు.

లక్ష్మీ వాళ్లతో ఎంత పని చేశారు దానికి విరుగుడు ఇవ్వండని చెప్తుంది. దాంతో ఆయన లక్ష్మీ వాళ్లని తమ గూడానికి రమ్మని అక్కడికి వచ్చాక విరుగుడు ఇస్తామని అంటారు. లక్ష్మీ వాళ్లు వెళ్తారు. సహస్ర కూడా అడవిలోకి చేరుకుంటుంది. సుభాష్ వాళ్లు వెతుకుతూ ఉంటారు. సహస్ర తిరిగి తిరిగి అలసిపోయి అడవి మనుషులు దేవుడిగా కొలుచుకునే ఓ పుట్ట మీద కాలు పెట్టేస్తుంది. దాంతో చాలా మంది అడవి మనుషులు సహస్రని చుట్టు ముట్టి కత్తెలు బల్లాలు గురి పెడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!

Read Entire Article